రాత్రి 7 గంటల వరకు పంపిణీ
6వ తేదీ కల్లా పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు
దివ్యాంగులు, తీవ్ర అనారోగ్య బాధితులు, మంచానికే పరిమితమైన వారికి మాత్రం ఇంటి వద్దే..
ఏప్రిల్, మే, జూన్ నెలల పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
ఈసీ సూచించిన అన్ని ప్రత్యామ్నాయ మార్గాలు, కలెక్టర్లతో చర్చించాకే నిర్ణయం
సాక్షి, అమరావతి: ఎండలు కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. విభిన్న దివ్యాంగ లబ్దిదారులతోపాటు తీవ్ర అనారోగ్యాల పాలైనవారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం తప్పనిసరిగా వారి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీని కొనసాగించాలని పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65,69,904 మంది లబ్దిదారులకు ఫించన్లు పంపిణీ చేసేందుకు రూ.1,951.69 కోట్ల మొత్తాన్ని ఆయా గ్రామ, వార్డు సచివాలయాలవారీగా బ్యాంకులలో మంగళవారం రాత్రి నిధులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఎన్నికల కోడ్ కారణంగా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏప్రిల్, మే, జూన్‌లో పింఛన్ల పంపిణీకి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మంగళవారం కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులిచ్చారు.
♦తప్పనిసరిగా ఇంటివద్దే పంపిణీ చేయాలని ప్రత్యేకంగా నిర్ధారించిన వర్గాలు మినహా మిగిలిన కేటగిరీ పింఛనుదారులందరికీ ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే íపింఛన్ల పంపిణీ చేపడతారు.
♦ ఒక గ్రామ సచివాలయం పరిధిలో వివిధ గ్రామాలు ఉన్నచోట్ల ప్రత్యేక సిబ్బందిని నియమించి పంపిణీ చేస్తారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక్కో సచివాలయం పరిధిలో ఎక్కువ సంఖ్యలో గిరిజన తండాలు ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.
♦ వేగంగా పింఛన్ల పంపిణీని పూర్తి చేసేందుకు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సిబ్బంది సచివాలయాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సచివాలయంలో పనిచేసే సిబ్బందిలో పంపిణీకి సరిపడినంత మందిని ఇందుకోసం కేటాయించుకోవాలని సూచించారు.
♦ సచివాలయాల వద్దకు వచ్చే íపింఛనుదారులకు ఎండల కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి సదుపాయం కల్పించే బాధ్యతలను ఆయా గ్రామ పంచాయతీలకు అప్పగిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. పంపిణీ సమాచారాన్ని గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
♦ పింఛన్ల పంపిణీ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
♦ సిబ్బంది బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసిన అనంతరం బుధవారం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభించి 6వతేదీ కల్లా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
♦ ప్రత్యేకంగా నిర్ధారించిన వర్గాలకు ఇంటి వద్దే పంపిణీ సందర్భంగా సచివాలయాల సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్లాలి.
♦ పింఛన్ల పంపిణీని సచివాలయాల వద్ద లబ్దిదారుల ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ లేదా ఐరిస్, ముఖ గుర్తింపు విధానంలో చేపట్టాలి. ఎవరైనా లబ్దిదారుడి విషయంలో ఆధార్‌తో ఇబ్బందులు తలెత్తితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీ ఆధర్యంలో రియల్ టైం బెనిఫిïÙయర్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఆర్‌బీఐఎస్) విధానంలో పింఛన్ల పంపిణీ చేపట్టాలి.
♦ ఫింఛన్లు పంపిణీ చేసే సమయంలో ప్రచారాలు, ఫొటోలు, వీడియోలు నిషిద్ధం. తప్పనిసరిగా ఎన్నికల కోడ్‌ను పాటించాలి.
♦సచివాలయాల సిబ్బంది అందరికీ కొత్తగా íపింఛన్ల పంపిణీకి సంబంధించి ఆన్‌లైన్ ప్రక్రియ లాగిన్‌లు అందుబాటులో ఉంటాయి. సిబ్బంది తమ మొబైల్ ఫోన్లలో పింఛన్ల పంపిణీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. n పింఛన్ల పంపిణీ కోసం సచివాలయ సిబ్బంది వద్ద అదనంగా ప్రింగర్ ప్రింటర్లు అందుబాటులో ఉంటాయి.
కలెక్టర్లతో చర్చించాకే నిర్ణయాలు
పింఛన్ల పంపిణీలో వలంటీర్ల ప్రమేయాన్ని పూర్తిగా తొలగిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించి ప్రత్యామ్నాయ మార్గాలపై అభిప్రాయాలు సేకరించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణకుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల ప్రకారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు డీబీటీ విధానంలో పింఛన్లు అందించేందుకు అందరికీ బ్యాంకు ఖాతాలు లేవని గుర్తించామన్నారు. వారందరికీ అప్పటికప్పుడు కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవడంలో చాలా సమస్యలున్నట్లు తేలిందన్నారు.
పింఛన్ల డబ్బులు బ్యాంకులో జమ చేసినా వాటిని తీసుకునేందుకు లబ్దిదారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని గుర్తించామన్నారు. మరో ప్రత్యామ్నాయంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయడంలోనూ ఇబ్బందులున్నట్లు వెల్లడైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు 2.66 లక్షల మంది ఉండగా సచివాలయాల ఉద్యోగులు కేవలం 1.27 లక్షల మంది మాత్రమే ఉన్నారన్నారు.
12,770 మంది ఏఎన్‌ఏంలు, 14,232 మంది వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్, వెటర్నరీ, ఫిషరీష్ అసిస్టెంట్లు, 6,754 మంది ఎనర్జీ అసిస్టెంట్లను వారి విధులకు అటంకం కల్పిస్తూ పింఛన్లు పంపిణీ చేయించే పరిస్థితి లేదని తమ చర్చల్లో గుర్తించామన్నారు. మిగిలిన సచివాలయాల ఉద్యోగులలోనూ చాలా మంది ఎన్నికలకు సంబంధించి బీఎల్‌వో విధుల్లో కొనసాగుతున్నారని తెలిపారు.
వారందరినీ మినహాయిస్తే లబ్దిదారుల ఇళ్ల వద్ద í íపింఛన్ల పంపిణీకి వినియోగించుకునేందుకు సచివాలయాల ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందన్నారు. మరోవైపు లబ్దిదారుల చిరునామాలు కచి్చతంగా తెలిసే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని, అందువల్ల పంపిణీలో జాప్యం జరిగే అవకాశం ఉందని నిర్ధారించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment