
బాబు రోడ్డెక్కారు.. కోడ్ కొండెక్కింది!
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నెంబరు ప్లేటు లేని వాహనాన్ని ఉపయోగించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ దానిని ఆ పార్టీ నేతలు గాలికొదిలేశారు. అధికారులు కూడా పట్టించుకోలేదు. మధురపూడి విమానాశ్రయం నుంచి రావులపాలెం వరకూ రోడ్ షోగా సాగిన ఆయన పర్యటన అంతా నెంబరు లేని వాహనంలోనే కానిచ్చేశారు.