
రాజీనామాపై వెనక్కు తగ్గిన కేంద్ర మంత్రి పల్లంరాజు
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన తరువాత కేంద్ర మంత్రి పల్లంరాజు రాజీనామా విషయంలో వెనక్కు తగ్గినట్లు స్పష్టమవుతోంది. సోనియాతో సమావేశం ముగిసిన తరువాత రాజీనామా విషయమై ఆయన నోరుమెదపలేదు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పిన విధంగా సోనియా చెప్పారని తెలిపారు. తొందరపాటు వద్దని సోనియా చెప్పారన్నారు. మంత్రుల బృందంతో కలిసి పనిచేయమని సోనియా చెప్పినట్లు తెలిపారు.
మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారా? ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నారా? అన్న విషయమై స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు.