Maithripala Sirisena
-
నిర్లక్ష్యంగా వ్యవహరించారు; పోలీస్‌బాస్ అరెస్టు..!
కొలంబో : శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజు జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహారించారనే కారణంగా పోలీస్ ఉన్నతాధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంటూ పోలీస్ చీఫ్ పుజీత్ జయసుందర, రక్షణశాఖ మాజీ చీఫ్ హేమసిరి ఫెర్నాండోను అరెస్టు చేయించింది. ఈస్టర్ సండే (ఏప్రిల్ 21) రోజు ఓ క్రిస్టియన్ చర్చిలో, మరికొన్ని చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించడంతో 258కి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పోలీస్ అధికారుల అలక్ష్యం వల్లనే ఉగ్రదాడి జరిగిందని శ్రీలంక అటార్నీ జనరల్ డప్పుల డిలివెరా సోమవారం స్పష్టం చేశారు. నిఘావర్గాల హెచ్చరికలపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అటార్నీ జనరల్ సూచనల ప్రకారమే పుజీత్, ఫెర్నాండో అరెస్టుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. కాగా, అరెస్టు సమయంలో ఈ ఇద్దరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండటం గమనార్హం. (చదవండి : శ్రీలంక పోలీస్ చీఫ్‌పై వేటు) అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం క్రిమినల్ నెగ్లిజన్స్ తీవ్రమైన హత్యానేరమని డిలివెరా అన్నారు. ఈ ఘటనల్లో మరో తొమ్మిదిమందిపై కూడా అభియోగాలున్నాయని, వారు కూడా విచారణ ఎదుర్కోవచ్చని చెప్పారు. ఇప్పటికే పార్లమెంటరీ విచారణ కమిటీ ముందు హాజరైన జయసుందర, ఫెర్నాండో తమ వాదనలు వినిపించారు. ప్రోటోకాల్స్‌ను పాటించడంలో విఫలమైన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన జాతీయ భద్రతకు ముప్పు ఉందన్న హెచ్చరికలను అంచనా వేయలేకపోయారని ఆరోపించారు. -
శ్రీలంక పోలీస్ చీఫ్‌పై వేటు
కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజు జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోలేకపోయినందుకు పోలీస్ చీఫ్ పూజిత్ జయసుందరను అధ్యక్షుడు సిరిసేన సోమవారం సస్పెండ్ చేశారు. జయసుందర రాజీనామా చేస్తానని ప్రకటించినప్పటికీ చేయలేదు. దీంతో సిరిసేన ఆయనను సస్పెండ్ చేశారు. సీనియర్ డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా ఉన్న విక్రమరత్నేను తాత్కాలికంగా పోలీస్ చీఫ్‌గా, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఇళంగకూన్‌ను రక్షణ శాఖ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు సిరిసేన ప్రకటించారు. బాంబు పేలుళ్లకు నేతృత్వం వహించినట్లుగా భావిస్తున్న జహ్రాన్ హషీమ్ కుటుంబంలో 18 మంది కనిపించకుడా పోయారనీ, వారంతా చనిపోయుంటారని తనకు భయంగా ఉందని జహ్రాన్ సోదరి మహ్మద్ హషీమ్ మథానియా చెప్పారు. బాంబు పేలుళ్లు జరిగిన రోజు రాత్రి నుంచి తమ కుటుంబంలో ఐదుగురు కనిపించకుండా పోయారనీ, వారిలో తన తండ్రి, ముగ్గురు తన సోదరులు, మరొకరు తన సోదరి భర్త ఉన్నారని ఆమె తెలిపారు. మళ్లీ శుక్రవారం రాత్రి సైందమరుదు పట్టణంలో పోలీసులు, అనుమానిత ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు చిన్నారులు సహా 10 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. ముసుగుపై నిషేధం అమల్లోకి ఈస్టర్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంకలో ముస్లిం మహిళలెవరూ బహిరంగ ప్రదేశాల్లో మొహానికి ముసుగులు ధరించకుండా తీసుకొచ్చిన నిషేధం అమల్లోకి వచ్చింది. ముఖం కనిపించకుండా ఎలాంటి ముసుగులూ ధరించకూడదని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. -
శ్రీలంక సంచలన నిర్ణయం : కొత్త పోలీస్ బాస్
కొలంబో: వరుస ఆత్మాహుతి బాంబు దాడులతో విలవిల్లాడుతున్న శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేయడానికి నిరాకరించిన పోలీసు బాస్‌పై వేటు వేసింది. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) పుజిత్ జయసుందరను విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు చేసింది. ఉగ్రదాడిపై నిఘావర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యంతో వ్యవహరించారన్న ఆరోపణలపై ఆయనను సస్పెండ్ చేసినట్టు సోమవారం ప్రకటించారు. అలాగే డీఐజీ చందన విక్రమ రత్నేను యాక్టింగ్ పోలీస్ ఛీప్‌గా నియమిస్తూ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలను ఖండించిన పుజిత్ రాజీనామా చేసినప్పటికీ, సంబంధిత పత్రాలను అధికారికంగా సమర్పించకపోవడంతో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ చర్య తీసుకున్నారు. మరోవైపు మిలిటరీ దుస్తులు ధరించిన వ్యక్తులు మరిన్నిభీకర దాడులకు పాల్పడవచ్చని, అప్రమత్తంగా ఉండాలంటూ శ్రీలంక భద్రతా వర్గాలకు , నిఘా విభాగం తాజాగా హెచ్చరికలు జారీచేసింది. దేశ వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ముసుగు వేసుకుని సంచరించడాన్ని నిషేధించింది.ఈ మేరకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదివారం ఆదేశాలు జారీచేశారు. దేశంలోని ఉంటున్నవారు తమ ముఖాన్ని ఇతరులు గుర్తు పట్టకుండా ఉండేట్లు ఎలాంటి ముసుగు ధరించకూడదని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అటు ముఖాన్ని కప్పుతూ ఉండేలా దుస్తులు ధరించవద్దని ఇటీవల శ్రీలంకలోని ఓ ముస్లిం సంస్థ కూడా సూచించింది. ముఖానికి ఎవరూ ఎటువంటి ముసుగూ ధరించరాదని శ్రీలంక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈస్టర్ రోజు జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన స్పష్టం చేశారు. సైనిక బలగాలకు తనిఖీకి అనుగుణంగా, నింధితులను గుర్తించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే శ్రీలంకకు వస్తున్న భారతీయులు అవసరమైన చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. కాగా ఉగ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతా బలగాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. దేశంలో సోమవారంనుంచి అత్యయిక పరిస్థితి చట్టాన్ని వినియోగిస్తూ పలు నిబంధనలను విధిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటించారు. -
పేలుళ్లపై ముందే హెచ్చరించాం
న్యూఢిల్లీ: కోయంబత్తూరులో ఐసిస్ కేసు విచారణను ముగించిన వెంటనే, ఆ ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు, శ్రీలంకలో బాంబు దాడులు జరగొచ్చనే నిఘా హెచ్చరికలను శ్రీలంకకు ఈ నెల మొదట్లోనే పంపామని అధికారులు ఢిల్లీలో చెప్పారు. ఐసిస్‌ను స్ఫూర్తిగా తీసుకుని దక్షిణ భారతంలోని ప్రముఖ నేతలను చంపాలని కుట్రపన్నిన ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పట్టుకుని కోయంబత్తూరులో విచారించడం తెలిసిందే. ఆ హెచ్చరికలను రాయబార కార్యాయలం ద్వారా శ్రీలంకకు పంపామని అధికారులు తెలిపారు. కోయంబత్తూరులో విచారణ సమయంలో ఆ ఉగ్రవాదుల వద్ద నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్టీజే) నేత జహ్రాన్ హషీమ్ వీడియోలు లభించాయి. కొలంబోలోని భారత హై కమిషన్‌పై ఉగ్రవాద దాడికి ప్రణాళిక రచిస్తున్నట్లు జహ్రాన్ హషీమ్ ఓ వీడియోలో సూత్రప్రాయంగా చెప్పాడు. మరింత లోతుగా విచారణ జరపగా, ఐసిస్ సహకారంతో ఉగ్రవాదులు చర్చిలు లక్ష్యంగా పేలుళ్లు జరిపేందుకు అవకాశం ఉందని తెలిసింది.ఈ సమాచారాన్ని వెంటనే శ్రీలంకకు తెలియజేశామని అధికారులు చెప్పారు. ఇస్లాం రాజ్యస్థాపనకు ముందుకు రావాల్సిందిగా శ్రీలంక, తమిళనాడు, కేరళ యువతను హషీమ్ కోరుతున్నట్లు మరో వీడియోలో ఉంది. ఇద్దరు రాజీనామా చేయండి: అధ్యక్షుడు పేలుళ్లకు సంబంధించి ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను రాజీనామా చేయాల్సిందిగా శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన ఆదేశించినట్లు సండే టైమ్స్ అనే ప్రతిక బుధవారం తెలిపింది. రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో, దేశ పోలీస్ చీఫ్ పూజిత్ జయసుందరలను రాజీనామా చేయమని సిరిసేన కోరారంది. బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య బుధవారం నాటికి 359కి చేరింది. పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 60 మందిని అరెస్టు చేశామని పోలీసు విభాగ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర చెప్పారు. ఈ పేలుళ్లలో 500 మందికి పైగా ప్రజలు గాయపడటం తెలిసిందే. ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులంతా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన వారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. -
శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు
-
శ్రీలంకలో అఖిలపక్ష భేటీ విఫలం
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం నిష్ప్రయోజనంగా ముగిసింది. ఈ సమావేశానికి మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘేతో పాటు మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స హాజరయ్యారు. కాగా, ఈ భేటీని పార్లమెంటు స్పీకర్ జయసూర్యతో పాటు పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ పార్టీ బహిష్కరించాయి. ఈ సమస్యను సృష్టించిన సిరిసేనే దీన్ని పరిష్కరించాలనీ, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని జేవీపీ స్పష్టం చేసింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అవసరమైతే మరోసారి పార్లమెంటును సమావేశపర్చాలని కోరగా అధ్యక్షుడు స్పందించలేదు. -
కారం పొడి చల్లుకున్న ఎంపీలు!
కొలంబో: శ్రీలంక పార్లమెంట్ శుక్రవారం తీవ్ర గందరగోళం మధ్య సాగింది. గురువారం రాత్రి అధ్యక్షుడు సిరిసేన అన్ని పక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి, మరోసారి విశ్వాస పరీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్ సమావేశం ప్రారంభం కాగా రాజపక్స మద్దతుదారులైన యూపీఎఫ్ఏ ఎంపీలు కొందరు స్పీకర్ కుర్చీని ఆక్రమించారు. స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ఫర్నిచర్ విరగ్గొట్టారు. పుస్తకాలను విసిరేశారు. వెంట తెచ్చుకున్న కారం పొడి చల్లారు. దీంతో స్పీకర్ పోలీసులను పిలిపించారు. సభ్యులను సముదాయించేందుకు యత్నించిన పోలీసులపైకి కూడా వారు కారం చల్లారు. ఈ దాడిలో ప్రత్యర్థి పార్టీల సభ్యులు కొందరు గాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో స్పీకర్..సభను సోమవారానికి వాయిదా వేస్తూ పోలీసు రక్షణ నడుమ బయటకు వెళ్లిపోయారు. -
‘అవిశ్వాసం’లో ఓడిన రాజపక్స
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ పార్లమెంటులో బుధవారం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇటు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే ప్రతిపక్ష యునైటెడ్ నేషనల్ పార్టీ, ఇతర చిన్నాచితకా పార్టీలతో పాటు రాజపక్స కేబినెట్లోని మంత్రులు తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో తాజా ప్రధాని మహింద రాజపక్స సభ విశ్వాసాన్ని కోల్పోయినట్లు స్పీకర్ జయసూర్య ప్రకటించారు. రాజ్యాంగానికి లోబడి తదుపరి చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు సిరిసేనకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తేవీలుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు రాజపక్స ప్రభుత్వం జారీచేసే ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని సైన్యం, ప్రభుత్వ అధికారులకు మాజీ ప్రధాని విక్రమసింఘే పిలుపునిచ్చారు. త్వరలోనే శ్రీలంకలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. -
మహింద రాజపక్సేకు భారీ షాక్
కొలంబో: శ్రీలంకలో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మహింద రాజపక్సేకు బుధవారం గట్టి షాక్ తగిలింది. నేడు అత్యవసరంగా సమావేశమైన ఆ దేశ పార్లమెంట్ రాజపక్సేకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న అనుహ్య నిర్ణయాలతో శ్రీలంక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో దేశ ప్రధానిగా విక్రమసింఘేను తొలగించి.. ఆ స్థానంలో రాజపక్సేను నియమిస్తూ సిరిసేన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన విక్రమసింఘే తను ప్రధాని బంగ్లాను ఖాళీ చేసేందుకు నిరాకరించారు. పార్లమెంట్ స్పీకర్ జయసూరియ కూడా సిరిసేన నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని.. ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. కానీ సిరిసేన మరో అడుగు ముందుకేసి దేశ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరిలో దేశంలో మధ్యంతర ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా, సిరిసేన నిర్ణయాలపై పలువురు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం పార్లమెంట్ రద్దు చేస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయం చెల్లదని మంగళవారం పేర్కొంది. ఎన్నికల ఏర్పాట్లకు చేస్తున్న ఏర్పాట్లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. పార్లమెంట్ రద్దు చెల్లదని కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో స్పీకర్ బుధవారం అత్యవసరంగా పార్లమెంట్‌ను సమావేశపరిచారు. ఈ సందర్భంగా రాజపక్సపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని మెజారిటీ సభ్యులు మద్దతు తెలిపినట్టు స్పీకర్ ప్రకటించారు. -
లంక పయనమెటు?
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఊహించని మలుపు తిరిగింది. రెండేళ్ల ముందుగానే పార్లమెంట్ రద్దు కావడంతో వచ్చే జనవరి 5న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 225 మంది సభ్యుల పార్లమెంట్‌ను రద్దుచేయడంతో పాటు ఎన్నికల నిర్వహణకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజం తప్పుపట్టింది. ఈ నెల 14న విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు స్పీకర్ కె.జయసూర్య చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడింది. రాజపక్సే మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడం భారత్‌కు కూడా రుచించడంలేదు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన భారత్‌తో సంబంధాలకు తక్కువ ప్రాధాన్యమిచ్చి చైనాతో సన్నిహితంగా మెలిగారు. రాజపక్స మళ్లీ అధికారంలోకి వస్తే శ్రీలంకలో చైనా ఆధిపత్యం పెరుగుతుందని భారత్ ఆందోళనగా ఉంది. అస్థిరత మొదలైందిలా.. గత నెల 27న ప్రధాని విక్రమ సింఘేను అధ్యక్షుడు సిరిసేన అకస్మాత్తుగా పదవి నుంచి తొలగించి, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సను కొత్త ప్రధానిగా నియమించడంతో శ్రీలంక రాజకీయాల్లో అస్థిరత ఏర్పడింది. అధికారం కోసం విక్రమసింఘే, రాజపక్సల మధ్య కొనసాగుతున్న పోరుపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎవరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలనేదానిపై పార్లమెంట్లో ఓటింగ్‌కు అనుమతించాలంటూ సిరిసేనపై అమెరికా, ఐరాస, ఐరోపా దేశాల సంఘం (ఈయూ) ఒత్తిడి పెంచాయి. ఫిరాయింపులను ప్రోత్సహించి, తన పార్టీకి తగినంత బలాన్ని కూడగట్టేందుకే సిరిసేన పార్లమెంట్‌ను తొలుత సస్పెండ్ చేశారని భావించారు. పార్టీ మారేందుకు తమకు లక్షలాది డాలర్లు ఎరగా చూపారని కొందరు సభ్యులు పేర్కొన్నారు. తాను ప్రధానిగా నియమించిన రాజపక్స మెజారిటీని నిరూపించుకునే అవకాశాలులేవని తేలడంతో సిరిసేన పార్లమెంట్ రద్దుకు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. సంకీర్ణంలో లుకలుకలు... 2015లో సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ, విక్రమసింఘే ఆధ్వర్యంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రభుత్వ పనితీరు, ఆర్థిక విధానాలు, ఓడరేవులను భారత్‌కు లీజుకిచ్చిన విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. కొలంబోలోని ‘ఈస్ట్ కంటెనర్ టెర్మినల్’ను అభివృద్ధి చేసే బాధ్యతను భారత్‌కు అప్పగించాలని విక్రమ్‌సింఘే భావించగా, సిరిసేన ఆ ప్రతిపాదనని వ్యతిరేకించారు. రాజపక్స అధికారంలో ఉండగా మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు(గతంలో రెండుసార్లు) వీలుగా రాజ్యాంగానికి 18వ సవరణ తీసుకువచ్చారు. దానిస్థానంలో రెండుసార్లకే అధికారం పరిమితం చేస్తూ సిరిసేన–విక్రమసింఘే ప్రభుత్వం 19వ సవరణ చేసింది. ఈ తాజా సవరణతో మళ్లీ అధ్యక్షుడయ్యే అవకాశం లేకపోవడంతో మహిందా రాజపక్స ప్రధాని పదవిపై కన్నేశారు. అదే సమయంలో విక్రమసింఘే, సిరిసేనల మధ్య ఏర్పడిన విభేదాలు ఆయనకు కలిసొచ్చాయి. పార్లమెంట్ రద్దుపై కోర్టుకెళ్తాం: యూఎన్‌పీ కొలంబో: శ్రీలంక పార్లమెంట్‌ను రద్దు చేస్తూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు పదవీచ్యుత ప్రధాని విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) తెలిపింది. ‘నియంతృత్వ పోకడల నుంచి రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించుకునేందుకు కోర్టు జోక్యాన్ని కోరనున్నాం. అధ్యక్షుడు సిరిసేన నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కోర్టులు, పార్లమెంట్, ఎన్నికల బరిలోనూ పోరాడతాం’ అని యూఎన్పీకి చెందిన మంగళ సమరవీర శనివారం తెలిపారు. ప్రధాని పదవి నుంచి విక్రమ సింఘేను తప్పిస్తున్నట్లు అక్టోబర్ 26వ తేదీన ప్రకటించిన అధ్యక్షుడు సిరిసేన..కొద్ది రోజుల్లోనే మాజీ అధ్యక్షుడు రాజపక్సను ప్రధానిగా నియమిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని నివాసం ఎదుట ఆందోళనకు దిగిన విక్రమసింఘే మద్దతుదారులు విక్రమసింఘే, సిరిసేన, రాజపక్స -
శ్రీలంక పార్లమెంటు రద్దు
కొలంబో: శ్రీలంక పార్లమెంటును గడువు కన్నా 20 నెలల ముందుగానే పూర్తిగా రద్దు చేస్తూ ఆ దేశాధ్యక్షుడు సిరిసేన శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ప్రధానిగా విక్రమసింఘేను తప్పించి రాజపక్సను అధ్యక్షుడు నియమించడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తడం తెల్సిందే. తర్వాత పార్లమెంటును ఈ నెల 16 వరకు తాత్కాలికంగా రద్దు చేస్తూ గతనెలలో సిరిసేన ఆదేశాలిచ్చారు. అధ్యక్షుడి తాజా నిర్ణయంతో శ్రీలంకలో జనవరి 5న ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత సంక్షోభాన్ని రూపుమాపేందుకు ప్రజాభిప్రాయాన్ని సేకరించాలన్న ప్రతిపాదనను పక్కనబెట్టిన సిరిసేన.. పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంటుకు వాస్తవానికి 2020 ఆగస్టు వరకు గడువుంది. దాదాపు 20 నెలల ముందుగానే సభ రద్దు కావడంతో జనవరి 5న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. -
పార్లమెంటు సస్పెన్షన్ ఎత్తివేత
కొలంబో: శ్రీలంకలో రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఈ నెల 16 వరకు పార్లమెంటును తాత్కాలికంగా రద్దు చేసిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెనక్కు తగ్గారు. గత షెడ్యూల్ ప్రకారమే సోమవారమైన నవంబర్ 5న యథావిధిగా పార్లమెంటు భేటీ కావాలని గురువారం అధ్యక్షుడు ఆదేశించినట్లు అధికారులు చెప్పారు. పార్లమెంటు సోమవారమే భేటీ అవుతుందన్న సమాచారం అవాస్తవమనీ, ఇది ప్రజలను తప్పుదారి పట్టించే వార్త అని సిరిసేన పార్టీకి చెందిన నాయకుడు సుశీల్ ప్రేమజయంత అన్నారు. ఈ నిర్ణయంతో శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది. ఇప్పటికీ తానే దేశానికి అసలైన ప్రధానిననీ, విశ్వాసపరీక్షలో తామే విజయం సాధిస్తామని పదవీచ్యుత ప్రధాని రణిల్ విక్రమసింఘే ధీమా వ్యక్తం చేశారు. మూడున్నరేళ్ల క్రితం సిరిసేన, విక్రమసింఘేల పార్టీలు కలిసి శ్రీలంకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఇటీవలి కాలంలో ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలు తీవ్రంగా పెరిగిపోయాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న సిరిసేన.. గత నెలలో విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి దించేశారు. మాజీ అధ్యక్షుడు రాజపక్సతో సిరిసేన చేతులు కలిపి ఆయనను కొత్త ప్రధానిగా నియమించారు. దీంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. పార్లమెంటులో అత్యధిక మంది సభ్యులు తమ పార్టీవారేననీ, ప్రజలు ఎన్నుకున్న అసలైన ప్రధానిని తానేనని విక్రమసింఘే వాదిస్తూ వచ్చారు. తనను పదవి నుంచి దించేస్తూ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం అక్రమమని ఆయన ఆరోపించారు. పార్లమెంటులో తన బలాన్ని నిరూపించుకునేందుకు వెంటనే సభను సమావేశపరిచి విశ్వాసపరీక్షను నిర్వహించాలని విక్రమసింఘే గతంలో డిమాండ్ చేశారు. అయితే సిరిసేన అందుకు విరుద్ధంగా పార్లమెంటును ఈ నెల 16 వరకు సుప్తచేతనావస్థలోకి పంపారు. పరిస్థితి ఇలాగే ఉంటే దేశంలో తీవ్ర హింసాత్మక పరిస్థితులు తలెత్తుతాయని పార్లమెంటు స్పీకర్ కరూ జయసూర్య అధ్యక్షుణ్ని హెచ్చరించారు. విక్రమసింఘేనే ప్రధానిగా గుర్తిస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రపంచ దేశాలు కూడా రాజ్యాంగాన్ని అనుసరించాల్సిందిగా శ్రీలంక రాజకీయ పార్టీలను కోరాయి. ఫిరాయింపులు పూర్తయినట్లేనా? వాస్తవానికి శ్రీలంక పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5నే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే విక్రమసింఘేను సిరిసేన పదవి నుంచి దించేయడంతో పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరిచి విశ్వాసపరీక్ష నిర్వహించాల్సిందిగా విక్రమసింఘే కోరారు. అందుకు విరుద్దంగా అధ్యక్షుడు పార్లమెంటును 16వ తేదీ వరకు సుస్తచేతనావస్థలోకి పంపారు. కాగా, పార్లమెంటులోని మొత్తం సభ్యుల సంఖ్య 225 కాగా, విశ్వాసపరీక్షలో నెగ్గేందుకు కనీసం 113 మంది సభ్యుల మద్దతు కావాలి. అయితే సిరిసేన–రాజపక్సల పార్టీలు రెండూ కలిసినా పార్లమెంటులో వారి బలం 95 మాత్రమే. అటు విక్రమసింఘే పార్టీకి సొంతంగా 106 మంది సభ్యులు ఉండటంతోపాటు కొన్ని చిన్న పార్టీల మద్దతు కూడా ఉంది. దీంతో ఎక్కువ సమయం తీసుకుని మరింత మంది సభ్యుల మద్దతు కూడగట్టి విశ్వాసపరీక్షలో రాజపక్స నెగ్గేందుకే అధ్యక్షుడు సభను తాత్కాలికంగా రద్దు చేశారని వార్తలు ఉన్నాయి. ఇప్పటికే ఆరుగురు సభ్యులు విక్రమ సింఘే వైపు నుంచి రాజపక్స వైపుకు మారిపోయారు. మరోవైపు పార్లమెంటును 16 వరకు రద్దు చేసినప్పటికీ మళ్లీ సోమవారం అధ్యక్షుడు సమావేశపరుస్తున్నారు. అంటే బలపరీక్షలో గెలిచేందుకు అవసరమైనంత మంది సభ్యులను ఇప్పటికే రాజపక్స తనవైపునకు తిప్పుకున్నారా అని ప్రశ్న తలెత్తుతోంది. విశ్వాసపరీక్షలో ఎవరు నెగ్గుతారో తెలుసుకునేందుకు ఆ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
మళ్లీ సంక్షోభంలో లంక
పట్టుమని మూడేళ్లు కాకుండానే శ్రీలంక మళ్లీ అస్థిరతలోకి జారుకుంది. ఈసారి సంక్షోభం పూర్తిగా అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సృష్టి. మరో ఏడాదిలోగా దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాల్సి ఉండగా... దేశ రాజకీయ రంగంలో తాను ఏకాకిగా మారుతున్నానని గ్రహించిన సిరిసేన, ఉన్న ట్టుండి ప్రధాని రణిల్ విక్రమసింఘేను తొలగించి ఆయన స్థానంలో మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సను ఆ పీఠం ఎక్కించారు. అంతేకాదు... ఆ దేశ పార్లమెంటును మూడు వారాలపాటు సస్పెండ్ చేశారు. తన మతిమాలిన చర్యకు పార్లమెంటులో ప్రతిఘటన రావొచ్చునన్న భయమే ఇందుకు కారణం. 225మంది సభ్యులున్న పార్లమెంటులో విక్రమసింఘే పార్టీకే అత్యధికంగా 106 మంది సభ్యుల మద్దతుంది. అటు సిరిసేన పార్టీ, ఇటు రాజపక్స పార్టీకి కలిసి 95కి మించి స్థానాలు లేవు. సిరిసేన ఒకప్పుడు రాజపక్సకు అత్యంత సన్నిహితుడు. 2015 జనవరిలో అధ్యక్ష ఎన్నికలు జరగడానికి రెండు నెలల ముందు వరకూ రాజపక్స కేబినెట్లో ఆయన నంబర్ టూ. అప్పటికి దాదాపు పదేళ్లుగా ఆయనతో కలిసి అధికార భోగాలు అనుభవించారు. కానీ అధ్యక్ష ఎన్నికలు ప్రకటించాక విపక్ష శిబిరంలోకి లంఘించి అధ్యక్ష పదవికి పోటీచేసి విజయం సాధించారు. తమిళ టైగర్ల బూచిని చూపి దేశంలో నిరంకుశ పాలన చలాయించిన రాజపక్సపై ఎన్నో ఆరో పణలున్నాయి. ఆయన అవినీతి, బంధుప్రీతి సంగతలా ఉంచి తమిళ టైగర్లను అణిచే పేరిట ఆయన ప్రభుత్వం సాగించిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కాదు. ఆయన సాగించినదంతా నరమేథమని, అందులో 40,000మంది అమాయక పౌరులు మరణించారని ఐక్యరాజ్యసమితి కమిటీ అంచనా వేసింది. ఎందరో మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరిగాయి. పసివాళ్లను సైతం నిర్దాక్షి ణ్యంగా హతమార్చారు. దాదాపు 65,000మంది తమిళులు ఆచూకీ లేకుండాపోయారు. తన విధా నాలను విమర్శించినవారిని జాతి వ్యతిరేకులుగా ముద్రేయడం, రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టి వారిని భయభ్రాంతులకు గురిచేయడం రాజపక్స ఒక కళగా అభివృద్ధి చేసుకున్నారు. ప్రభుత్వం లోని అన్ని వ్యవస్థల్లోనూ తన అనుచరులను చొప్పించి వాటిని నియంత్రణలోకి తెచ్చుకున్నారు. వీటన్నిటి విషయంలో రాజపక్సపై వెల్లువెత్తుతున్న అసంతృప్తిని గమనించే అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు సిరిసేన విపక్ష శిబిరానికి ఫిరాయించారు. అధ్యక్ష పదవికి పోటీచేసి నెగ్గారు. కానీ ఆ సందర్భంగా ఆయన చేసిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. రాజపక్స సాగించిన నియంతృత్వానికి అధ్యక్షుడికుండే అపరిమిత అధికారాలే మూల కారణమని, వాటిని రద్దు చేసి అధ్యక్ష తరహా పాల నకు స్వస్తి పలుకుతానని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకు తగినట్టు రాజ్యాంగానికి 19వ సవర ణను తీసుకొచ్చారు. దాని ప్రకారం పార్లమెంటు అనుమతి లేకుండా ప్రధానిని తొలగించకూడదు. అలాగే ప్రధానితో సంప్రదించాకే కేబినెట్ మంత్రులుగా ఎవరినైనా నియమించాలి. పార్లమెంటును రద్దు చేయడానికుండే అధికారాలను కత్తిరించడం, రాజ్యాంగమండలి అనుమతి లేకుండా ఉన్నతా ధికారుల నియామకం చేయకూడదనటం వంటివి అందులో ఉన్నాయి. అధ్యక్షుడి పదవీకాలాన్ని ఆరేళ్ల నుంచి అయిదేళ్లకు మార్చారు. పర్యవసానంగా ఆయనకు కొన్ని అంశాల్లో భంగపాటు తప్ప లేదు. ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి పంపిన సిఫార్సులను రాజ్యాంగమండలి తోసిపుచ్చడం ఆయనకు ఆగ్రహం కలిగించింది. దానికితోడు జనతా విముక్తి పెరుమున(జేవీపీ) పార్లమెంటులో ప్రవేశపెట్టిన 20వ సవరణ ముసాయిదా అధ్యక్ష అధికారాలకు మరింత కోత పెడుతోంది. దాని ప్రకారం దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల ద్వారా కాక, రహస్య బ్యాలెట్ విధానంలో పార్లమెంటు సభ్యులు దేశాధ్యక్షుణ్ణి ఎన్నుకోవాలన్న నియమం ఉంది. అలాగే అధ్యక్షుడిని అభిశంసించే విశేషాధికారాన్ని ఈ సవరణ బిల్లు పార్లమెంటుకు ఇస్తోంది. నిజానికి ఈ ముసాయిదా సవరణలోని నిబంధనలేవీ సిరిసేన అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధం కాదు. ఇప్పటికే కొన్ని అధికారాలను వదులుకోవాల్సి వచ్చిందని చింతిస్తున్న సిరిసేకు ఈ పరిణామం నచ్చలేదు. ఒకపక్క విక్రమసింఘేతో ఉన్న విభేదాలు రోజురోజుకూ ముదరడం, మరోపక్క తన అను చరులైన ఎంపీల్లో చాలామంది రాజపక్సకు అనుకూలురుగా ఉండటం ఆయన్ను కలచివేస్తోంది. అధికారంలో ఉండగా అధ్యక్ష స్థానాన్ని అపరిమిత అధికారాలతో పటిష్టం చేసుకోవడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ అధికారాలకు కోత వేయాలనడం శ్రీలంకలో దశాబ్దాలుగా సాగుతున్న నాటకమే. సిరిసేన కూడా దాన్నే కొనసాగించారు. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల సమయానికి బలపడకపోతే రాజకీయంగా కనుమరుగవుతానని ఆయన ఆందోళన పడుతున్నారు. అటు రాజపక్స సైతం ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకుని 2020లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. అందుకే 2015లో తనపై తిరగబడి ప్రత్యర్థులతో చేతులు కలిపిన సిరిసేన ఊహించని రీతిలో అందించిన స్నేహహస్తాన్ని ఆయన అందుకున్నారు. రాజపక్స చైనాకు సన్నిహితుడు. ఆయన హయాంలోనే మన దేశంతో శ్రీలంక సంబంధాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అక్కడ చైనా ప్రాబల్యం పెరిగింది. ఆయన మళ్లీ అధికారంలోకి రావడం సహజంగానే చైనాకు మేలు చేస్తుంది. నిర్మాణంలో ఉన్న మన ప్రాజెక్టులకు ఇబ్బందులేర్పడతాయి. పదవీ చ్యుతుడైన విక్రమసింఘే భారత్‌కు సన్నిహితుడన్న పేరుంది. ఇప్పటికే మన పొరుగునున్న మాల్దీ వుల్లో అనిశ్చితి అలుముకుని ఉంది. అక్కడి ఎన్నికల్లో విజయం సాధించిన విపక్ష కూటమి అభ్యర్థి మహ్మద్ సోలిహ్‌కు ప్రస్తుత అధ్యక్షుడు యామీన్ అధికార పగ్గాలు అప్పగిస్తారా లేదా అన్న సందేహాలున్నాయి. కనుక శ్రీలంక పరిణామాలపై మన దేశం ఆచితూచి అడుగేయాలి. పెద్దన్న పాత్ర పోషిస్తున్నదన్న నింద పడకుండా మన ప్రయోజనాల పరిరక్షణ విషయంలో చాకచక్యంగా వ్యవహరించాలి. -
చచ్చామనుకున్నాం : శ్రీలంక మాజీ క్రికెటర్
కొలంబో: ‘ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే ఆ దేవుని దయ, నా భద్రతా సిబ్బంది దైర్యసాహసాలే కారణం. రాజపక్స అనుచరులు నన్ను చంపాలని చూశారు. దాదాపు మేం చచ్చామనుకున్నాం. మా దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది. నాకు ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి ఘటనలు శ్రీలంక ప్రజలు సహించలేరు’అని ఆదివారం కొలంబోలో చోటుచేసుకున్న కాల్పుల ఘటననంతరం శ్రీలంకకు ప్రపంచకప్ అందించిన అర్జున రణతుంగ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంక ప్రధాని పదవి నుంచి రణిల్ విక్రమసింఘేను తొలగించి మహింద రాజపక్సను ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడంతో అక్కడ అధికార సంక్షోభం నేలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పెట్రోలియం శాఖ మంత్రి అయిన అర్జున రణతుంగ హుటాహుటిన లండన్ నుంచి లంకకు చేరుకున్నారు. ఆదివారం కొలంబోలోని తన కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నించగా.. రణతుంగను అడ్డుకోవడంతో పాటు ఆయన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాజపక్స అనుకూల వ్యక్తులు కొందరు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాలు కాల్పులు జరుపుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, హెల్మెట్‌తో అర్జున రణతుంగను రక్షించారు. రణతుంగ భద్రతా సిబ్బందితోపాటు విక్రమసింఘే మద్దతుదారు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటననంతరం రణతుంగ రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు. ఈ ఇద్దరు భవిష్యత్తు కార్యచరణపై సుదీర్ఘంగా చర్చించారు. గత 18 ఏళ్లుగా ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న అర్జున రణతుంగ.. గతేడాదిన్నరగా పెట్రోలియం శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సోదరులు ప్రసన్న రణతుంగ, రువాన రణతుంగాలు కూడా ఎంపీలే కావడం గమనార్హం. ఇక 1996 ప్రపంచకప్‌ను అర్జున రణుతంగ సారథ్యంలోనే శ్రీలంక గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: విక్రమ సింఘేనే ప్రధాని శ్రీలంక పార్లమెంటు రద్దు -
విక్రమ సింఘేనే ప్రధాని
కొలంబో: శ్రీలంక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. రణిల్ విక్రమ సింఘేనే దేశ ప్రధానిగా గుర్తిస్తున్నట్లు పార్లమెంట్ స్పీకర్ జయసూర్య ప్రకటించారు. విక్రమ సింఘేను తొలగించి మహింద రాజపక్సను దేశ ప్రధానిగా నియమించడంతోపాటు పార్లమెంట్‌ను సుప్తచేతనావస్థలో ఉంచుతూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయం తీవ్ర అనూహ్య విపరిణామాలకు దారి తీస్తుందన్నారు. రాజపక్స నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం నేడు బాధ్యతలు స్వీకరించే అవకాశముందని తెలుస్తోంది. రాజపక్స అధికార పగ్గాలు చేబడితే పౌరులు, హక్కుల సంస్థలపై తిరిగి వేధింపులు మొదలవుతాయని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాని విక్రమసింఘేను తొలగించి రాజపక్సను నియమించడంతోపాటు, పార్లమెంట్‌ను నవంబర్ 16 వరకు సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాలను స్పీకర్ జయసూర్య ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సిరిసేనకు ఆయన ఒక లేఖ రాశారు. పార్లమెంట్ సస్పెన్షన్ దేశంలో తీవ్ర, అనూహ్య విపరిణామాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. స్పీకర్‌తో చర్చించిన తర్వాతే అధ్యక్షుడు పార్లమెంట్‌ను సుప్తచేతనావస్థలో ఉంచుతూ ఆదేశాలిచ్చే సంప్రదాయాన్ని గుర్తు చేశారు. ఆయన అహంకారి..అందుకే..: సిరిసేన రణిల్ విక్రమసింఘే అహంకార పూరిత మనస్తత్వమే ఆయన్ను అధికారం నుంచి తొలగించేందుకు కారణమైందని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తెలిపారు. రాజ్యాంగ బద్ధంగానే రాజపక్స కొత్త ప్రధానిగా నియమితులయ్యారని పేర్కొన్నారు. విక్రమసింఘేను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆదివారం ఆయన మొదటిసారిగా దేశప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘దేశ భవిష్యత్తును, సామాన్యుడిని గురించి పట్టించుకోని తన అనుచరులకు ఆయన అధికారాన్ని అప్పగించారు. ఆయన అహంభావి. ఉమ్మడి బాధ్యతలను పరిహాసం చేస్తూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. నాపై హత్యాయత్నం చేయించారు. మా మధ్య ఉన్న సాంస్కృతిక, విధానపరమైన విభేదాలే ప్రస్తుత రాజకీయ, ఆర్థిక సంక్షోభానికి కారణం’ అని పేర్కొన్నారు. తక్షణమే ఎన్నికలు జరపాలి: రాజపక్స దేశ ప్రస్తుత ఆర్థిక, రాజకీయ సంక్షోభానికి ముగింపు పలికేందుకు తక్షణం పార్లమెంట్ ఎన్నికలు జరపాలని నూతన ప్రధాని రాజపక్స డిమాండ్ చేశారు. రాజపక్సకు జిన్‌పింగ్ అభినందనలు శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుండగానే కొత్త ప్రధాని రాజపక్సేకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందనలు తెలిపారు. చైనా రాయబారి చెంగ్ ఆదివారం తనను కలిసి జిన్‌పింగ్ తరఫున అభినందనలు తెలిపారని రాజపక్స ట్విట్టర్లో పేర్కొన్నారు. సంప్రదాయంగా శ్రీలంక విదేశాంగ విధానం భారత్, జపాన్‌లకు అనుకూలంగా చైనాకు దూరంగా ఉంటుంది. అయితే, రాజపక్స ప్రభుత్వం చైనాకు దగ్గరైంది. ఫలితంగా శ్రీలంకలో చైనా వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. రాజధానిలో కాల్పులు అధికార సంక్షోభం నేపథ్యంలో ఆదివారం కొలంబోలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మాజీ క్రికెటర్, పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగను అడ్డుకోవడంతోపాటు ఆయన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాజపక్స అనుకూల వ్యక్తులు కొందరు ప్రయత్నించారు. దీంతో రణతుంగ భద్రతా సిబ్బందితోపాటు విక్రమసింఘే మద్దతుదారు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. -
3రోజుల తర్వాత మళ్లీ ప్రధానిగా!
కొలంబో: శ్రీలంకలో రాజకీయ సంక్షోభం రోజురోజుకి ముదురుతోంది. రణిల్ విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తొలగిస్తూ.. ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంట్ స్పీకర్ కరు జయసూరియ వ్యతిరేకించారు. చట్టపరంగా విక్రమసింఘే ప్రధాని అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా ఈ వివాదంపై సిరిసేనకు ఓ లేఖ రాశారు. పార్లమెంట్‌ను నవంబర్ 16 వరకు మూసివేయడం మరింత రాజకీయ సంక్షోభానికి దారితీస్తుందని పేర్కొన్నారు. వేరే వ్యక్తి పార్లమెంటులో మెజారిటీ నిరూపించుకునేంతవరకు విక్రమసింఘే ప్రధానిగా కొనసాగుతారని తెలిపారు. కాగా, శుక్రవారం రోజున విక్రమసింఘేను పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న సిరిసేన, దేశ మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను ప్రధానిగా నియమించారు. అంతేకాకుండా విక్రమసింఘేకు భద్రత ఉపసంహరిస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో విక్రమసింఘే పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరచాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో మూడు వారాల పాటు పార్లమెంట్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు సిరిసేన ప్రకటించిన సంగతి తెలిసిందే. హింసాత్మకంగా మారుతున్న వైనం శ్రీలంకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఆదివారం హింసాత్మకంగా మారింది. ఎంపీ అర్జున రణతుంగా సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పులో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్టు పోలీసు అధికారులు తెలిపారు. విక్రమసింఘే క్యాబినేట్లో పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసిన రణతుంగా.. సిరిసేన శనివారం క్యాబినేట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆ పదవిని కొల్పోయారు. అయితే ఆదివారం రోజున ఆయన తన ఆఫీసులోకి వెళ్లే సమయంలో అక్కడ ఉన్న సముహంపై సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. అలాగే కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: శ్రీలంక పార్లమెంటు రద్దు -
శ్రీలంక పార్లమెంటు రద్దు
కొలంబో: శ్రీలంకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ముదురుతోంది. రణిల్ విక్రమసింఘేను శుక్రవారం ప్రధాని పదవి నుంచి దించేసిన ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, శనివారం శ్రీలంక పార్లమెంటును తాత్కాలికంగా రద్దు చేశారు. బలనిరూపణ కోసం అత్యవసరంగా పార్లమెంటును ఆదివారం సమావేశపరచాలని రణిల్ విక్రమసింఘే పార్లమెంటు స్పీకర్‌ను శనివారం కోరగా, అందుకు అవకాశం లేకుండా సిరిసేన నవంబరు 16 వరకు పార్లమెంటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో జరిగే బలపరీక్షలో విక్రమసింఘేను ఓడించాలనే లక్ష్యంతోనే అధ్యక్షుడు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం నవంబరు 5న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. పార్లమెంటును సమావేశపరచాలని విక్రమసింఘే కోరడంతోనే సిరిసేన సమావేశాల ప్రారంభ తేదీని మరో 10 రోజులు వెనక్కు జరిపి, అప్పటివరకు సభను రద్దు చేశారు. శ్రీలంక పార్లమెంటులోని మొత్తం స్థానాల సంఖ్య 225 కాగా, బలనిరూపణలో నెగ్గేందుకు కనీసం 113 మంది సభ్యుల మద్దతు అవసరం. సిరిసేన, కొత్త ప్రధాని మహిందా రాజపక్స పార్టీలు రెండూ కలిసినా వారి బలం 95 మాత్రమే. అటు విక్రమసింఘేకు చెందిన యూఎన్‌పీ (యునైటెడ్ నేషనల్ పార్టీ)కి సొంతంగానే 106 మంది సభ్యులున్నారు. మరికొన్ని చిన్నపార్టీల మద్దతు కూడా ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో నవంబరు 5న పార్లమెంటు సమావేశాలు ప్రారంభిస్తే విక్రమసింఘే సులభంగా బలపరీక్షలో నెగ్గి మళ్లీ అధికారంలోకి వస్తారని సిరిసేన భావించినందునే సమావేశాలను మరో 10 రోజులపాటు వాయిదా వేశారని సమాచారం. ఆలోపు సిరిసేన, రాజపక్సలు మరికొంత మంది సభ్యులను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అందుకే సమావేశాల ప్రారంభ తేదీని నవంబరు 16కు మార్చారని తెలుస్తోంది. అయితే కొత్తగా ప్రధాని మారినందున రాజపక్స వార్షిక బడ్జెట్‌ను కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారనీ, ఆ బడ్జెట్ రూపకల్పనకు సమయం పడుతుంది కాబట్టే పార్లమెంటు సమావేశాలు పదిరోజులు ఆలస్యంగా ప్రారంభమవుతాయనేది రాజపక్స పార్టీ నేతల వాదన. సిరిసేన, విక్రమసింఘేల పార్టీలు సంయుక్తంగా మూడేళ్ల క్రితం అధికారం చేపట్టగా, విభేదాల నేపథ్యంలో తాజాగా సిరిసేన పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. విక్రమసింఘేను పదవి నుంచి తప్పించిన సిరిసేన, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స చేత కొత్త ప్రధానిగా ప్రమాణంచేయించడం తెలిసిందే. కావాలనే సిరిసేన దేశంలో కృత్రిమ రాజకీయ సంక్షోభం సృష్టిస్తున్నారనీ, పార్లమెంటును సమావేశపరిస్తే ఆ వెంటనే ఈ సంక్షోభం సమసిపోతుందని విక్రమసింఘే అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ రాజపక్స, సిరిసేనల పార్టీలు కలిసి విక్రమసింఘేపై అవిశ్వాస తీర్మానం పెట్టగా, అప్పటి బలనిరూపణలోనూ విక్రమసింఘే గెలిచారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి.. శ్రీలంకలోని పార్టీలు ఆ దేశ రాజ్యాంగం ప్రకారం నడచుకోవాలనీ, అనవసరంగా హింస, అనిశ్చితిని రేకెత్తించవద్దని పలు దేశాలు కోరాయి. ‘హింసకు దిగకుండా రాజ్యాంగం ప్రకారం నడచుకోవాలని శ్రీలంకలోని పార్టీలను మేం కోరుతున్నాం’ అని అమెరికా విదేశాంగ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ‘యూరోపియన్ కూటమి రాయబారితోపాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, రొమేనియా, యూకేల రాయబారులు కూడా శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. అన్ని పార్టీలూ రాజ్యాంగాన్ని అనుసరించాలి తప్ప హింసను ప్రేరేపించవద్దు’ అని యూరోపియన్ కూటమి ఓ ప్రకటనలో పేర్కొంది. శ్రీలంకలోని బ్రిటిష్ హై కమిషన్ శుక్రవారం ఇలాంటి ఓ ప్రకటన చేసింది. భారత్‌కు ఆందోళనకరమే రాజపక్స శ్రీలంక నూతన ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించడం పొరుగున ఉన్న భారతదేశానికి ఆందోళనకరమేనని చెప్పాలి. చైనా అనుకూలుడిగా పేరు సంపాదించిన ∙రాజపక్స గతంలో అధ్యక్షుడిగా ఉండగా చైనాతో రాసుకుపూసుకు తిరగడం, శ్రీలంకలోని హంబన్‌టోటా పోర్టును చైనాకు దీర్ఘకాలం లీజుకివ్వడం, చైనా ప్రాజెక్టులను అనుమతించడం, చైనా జలాంతర్గాములను తమ సముద్ర జలాల్లో నిలపడానికి అనుమతించడం వంటివి భారత్‌కు కలవరం కలిగించాయి. రాజపక్స తిరిగి అధికారంలోకి వస్తారని భారత్ ఊహిస్తూనే ఉంది. రాజపక్స పునరాగమనంతో శ్రీలంకపై చైనా తన పట్టును మరింత బిగిస్తుందనీ, అది తన భద్రతకు ముప్పుగా మారడమేకాక దక్షిణాసియాలో తన పలుకుబడిని దెబ్బ తీస్తుందని భారత్ ఆందోళన చెందుతోంది. ఆకస్మిక నిర్ణయానికి 3 కారణాలు రాజ్యాంగ విరుద్ధమంటున్న రాజకీయ నిపుణులు శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమసింఘేను తొలగించి, మహిందా రాజపక్సను అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది విక్రమసింఘే ఢిల్లీలో చేసిన ప్రకటన. గతనెల 20న విక్రమసింఘే ఢిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ తర్వాత ఓ ప్రకటన విడుదల చేస్తూ సిరిసేనపై ఆరోపణలు గుప్పించారు. శ్రీలంకలో భారత్ చేపడుతున్న ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి సిరిసేననే కారణమని ఆ ప్రకటనలో చెప్పారు. ఇక రెండవ కారణం కోర్టుల్లో నియామకాల కోసం సిరిసేన పంపిన సిఫారసులను విక్రమసింఘే తిరస్కరించడం. శ్రీలంక సుప్రీంకోర్టు, అప్పీల్ కోర్టుల్లో ఖాళీల భర్తీ కోసం ఇద్దరి పేర్లను సిరిసేన సూచించగా, దేశ రాజ్యాంగ మండలి తిరస్కరించింది. దీంతో సిరిసేన ఆగ్రహానికి గురయ్యారు. ఇక మూడో కారణం అధ్యక్షుడిపై జరిగిన హత్యాయత్నాన్ని పోలీసులు, ప్రభుత్వం తీవ్రంగా పరిగణించకపోవడం. సిరిసేన దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక గతంలో ఓ సారి ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ కుట్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని శుక్రవారమే పోలీసులు ప్రకటించారు. దీంతో తనపై హత్యాయత్నం కేసును పోలీసులు తేలిగ్గా తీసుకున్నారనీ, దీని వెనుక విక్రమసింఘే ఉన్నారని సిరిసేన భావించారు. ప్రధానంగా ఈ మూడు కారణాలతోనే సిరిసేన పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి, రాజపక్సతో చేతులు కలిపి ఆయనను ప్రధానిని చేసినట్లు తెలుస్తోంది. 2015లో సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ, విక్రమసింఘే అధ్యక్షుడిగా ఉన్న యునైటెడ్ నేషనల్ పార్టీలు కలిసి శ్రీలంకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, కొంతకాలంగా వివిధ అంశాల్లో వీరిరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతోపాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల్లో రాజపక్స నేతృత్వంలోని పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికలను మూడేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజా తీర్పులా చూశారు. ఆ తర్వాత ఇరు పార్టీలు, నాయకుల మధ్య విభేదాలు మరింత ఎక్కువై చివరకు ప్రధానిని మార్చే పరిస్థితికి దారితీసింది. అయితే ప్రధానిని మారుస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయం మాత్రం కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమేనని నిపుణులు పేర్కొంటున్నారు. -
లంక ప్రధానిగా రాజపక్స
కొలంబో: శ్రీలంక రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కొంతకాలంగా విభేదాలతో నెట్టుకొస్తున్న సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలు విడిపోయాయి. ప్రధాని రణిల్ విక్రమసింఘేను తొలగించిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన.. మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సకు ఆ పదవి కట్టబెట్టారు. రాజపక్స చేత సిరిసేన ప్రమాణం చేయిస్తున్న దృశ్యాలు శుక్రవారం మీడియాలో ప్రసారమయ్యాయి. విక్రమసింఘేకు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు సిరిసేన పార్టీ యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలియన్జ్(యూపీఎఫ్ఏ) ప్రకటించిన వెంటనే తాజా రాజకీయ డ్రామా మొదలైంది. విక్రమసింఘే పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు సిరిసేన పార్టీ పార్లమెంట్‌కు సమాచారం ఇచ్చింది. తాజా పరిణామంపై పదవీచ్యుత ప్రధాని విక్రమసింఘే స్పందిస్తూ.. రాజపక్సను ప్రధానిగా నియమించడం చట్టవిరుద్ధమని, తానే ప్రధానిగా కొనసాగుతానని అన్నారు. పార్లమెంట్లో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మూడేళ్ల ‘మైత్రి’కి తెర: అవినీతి, ఆర్థిక అవకతవకలపై ఐకమత్యంతో పోరాడుతామంటూ మూడేళ్ల క్రితం మైత్రిపాల సిరిసేన, విక్రమ సింఘే పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. అనంతరం అధికార కూటమికి రెఫరెండంగా భావించిన ఫిబ్రవరిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజపక్స స్థాపించిన కొత్త పార్టీ సంచలన విజయం సాధించడంతో ఈ రెండు పార్టీల మధ్య లుకలుకలు మొదలయ్యాయి. రక్షణ శాఖ మాజీ కార్యదర్శితో పాటు తనని హత్య చేయడానికి పన్నిన కుట్రను విక్రమసింఘే పార్టీ సీరియస్‌గా తీసుకోకపోవడంపై సిరిసేన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు తీవ్రతరమయ్యాయి. ప్రస్తుతం రాజపక్స–సిరిసేన పార్టీలకు పార్లమెంట్లో ఉమ్మడిగా కేవలం 95 సీట్లే ఉన్నాయి. సాధారణ మెజారిటీ సాధించాలంటే ఈ కూటమికి మరో 18 స్థానాలు అవసరం. -
భారత్ కుట్ర.. చైనా సాయం తీసుకుంటాం : శ్రీలంక
కొలంబో : తమ దేశాధ్యక్షుడి హత్యకు కుట్ర జరుగుతోందంటూ సమాచారం అందిన నేపథ్యంలో చైనాకు చెందిన ఫోన్ తయారీ సంస్థ హవాయి సహాయం తీసుకుంటామని శ్రీలంక పోలీసులు తెలిపారు. ఇందుకోసం కోర్టు నుంచి అనుమతి కూడా పొందినట్లు పేర్కొన్నారు. తనను చంపేందుకు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్( రా) కుట్ర పన్నుతోందని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్షుడి హత్యకు కుట్ర జరుగుతున్న విషయం వాస్తమేనని, ఈ విషయమై తాను ఓ సీనియర్ పోలీసు ఆఫీసర్‌తో కూడా ఫోన్లో చర్చించానని పోలీసు ఇన్ఫార్మర్ నమాల్ కుమార పేర్కొన్నాడు. మైత్రిపాలతో పాటు, శ్రీలంక రక్షణ శాఖ మాజీ కార్యదర్శి గోటబాయ రాజపక్స కూడా హిట్ లిస్టులో ఉన్నారని తెలిపాడు. ఈ నేపథ్యంలో ఈ కుట్ర వివరాలను బయటపెట్టేందుకు కుమార ఫోన్ డేటా కీలకంగా మారింది. అయితే ఈ డేటా మొత్తం డెలిట్ అయిన నేపథ్యంలో హవాయి సహాయం అనివార్యమైందని పోలీసులు తెలిపారు. కాగా ఈ కుట్రలో భాగం ఉందంటూ గత నెల 23న కేరళకు చెందిన థామస్ అనే వ్యక్తిని శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను చంపేస్తామంటూ సీఐడీ నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తనని వెంటనే వారి కస్టడీ నుంచి విముక్తి చేయాలని థామస్ కోర్టుకి విన్నవించాడు. కానీ జడ్జి అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు.. ఇది దేశ అధ్యక్షుడి భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి అంత తేలికగా ఎవరినీ విడిచిపెట్టేది లేదని నిఘా సంస్థలు పేర్కొన్నాయి. ఇక శ్రీలంక నాయకులు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలపై ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2015లో జరిగిన శ్రీలంక ఎన్నికల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు కూడా ‘రా’ పై ఆరోపణలు చేశారు. దేశ పాలన మార్పులో ‘ రా’ పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. -
‘రా’ నన్ను చంపాలని చూస్తోంది
కొలంబో: భారత్‌పై శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్( రా)కుట్ర పన్నుతోందని ఆరోపించారు. తమ క్యాబినెట్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అయితే ‘రా’ పన్నిన కుట్ర గురించి ప్రధాని మోదీకి తెలియదని కూడా ఆయన అన్నారు. ‘రా’తనను హతమార్చేందుకు ప్లాన్ వేసినట్లు మైత్రిపాల్ చెప్పడంతో .. క్యాబినెట్ మంత్రులు షాకైనట్లు తెలుస్తోంది. అయితే అధ్యక్షుడు మైత్రిపాల చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటి వరకు ఎటువంటి ఆధికార ద్రువీకరణ లేదు. వాస్తవానికి మైత్రిపాల్ మరికొన్ని రోజుల్లో భారత్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా శ్రీలంక నాయకులు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలపై ఆరోపణలు చేయడం కొత్తేమి కాదు. 2015లో జరిగిన శ్రీలంక ఎన్నికల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు కూడా ‘రా’ పై ఆరోపణలు చేశారు. దేశ పాలన మార్పులో ‘ రా’ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. -
శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు
-
శ్రీలంకలో హింస ; ఎమర్జెన్సీ విధింపు
కొలంబో : పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలు అదుపుతప్పిన నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నేతృత్వంలో మంగళవారం భేటీ అయిన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి దిస్సనాయకే మీడియాకు తెలిపారు. మంగళవారం నుంచి 10 రోజుల పాటు ఎమర్జెన్సీ అమలులో ఉంటుందని ఆయన చెప్పారు. మైనారిటీలపై భీకర దాడులు : సెంట్రల్ శ్రీలంకలోని క్యాండీ జిల్లావ్యాప్తంగా గడిచిన వారం రోజులుగా హింసాయుత ఘటనలు నమోదయ్యాయి. ముస్లిం మైనారిటీలపై మెజారిటీ బౌద్ధుల్లో కొన్ని గ్రూపులు వరుస దాడులకు పాల్పడ్డాయి. ఇవి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం.. క్యాండీ రాష్ట్ర వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించింది. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
మహిళకు మద్యం కొనుక్కునే హక్కులేదా?
కొలంబో : దేశంలో లింగవివక్షను తగ్గించడానికంటూ శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సర్వత్రా విమర్శలపాలయ్యాయి. మగవారిలాగే 18 ఏళ్లు నిండిన ఆడవారు కూడా స్వేచ్ఛగా మద్యం కొనుక్కోవచ్చని లంక సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ 24 గంటలు తిరక్కముందే దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తన విశిష్టఅధికారాలను ఉపయోగించి సదరు ఉత్తర్వులను రద్దుచేశారు. దీంతో నిరసనకారులు మరోసారి భగ్గుమన్నారు. ఏమిటి వివాదం?: బ్రిటిష్ పాలన నుంచి విముక్తిపొందిన శ్రీలంక 1948, ఫిబ్రవరి 4న స్వసంత్రదేశంగా అవతరించిన సంగతి తెలిసిందే. 1955 నాటి చట్టాల ప్రకారం అక్కడి మహిళలు మద్యం కొనుగోలుచేయడం నిషిద్ధం. దశాబ్ధాలుగా కొనసాగుతోన్న ఈ నిషేధానికి వ్యతిరేకంగా నిరసనగళాలు లేచాయి. మహిళకు మాత్రమే మద్యం నిషేధమనడం లింగవివక్ష కిందికే వస్తుందనే వాదన క్రమంగా బలపడింది. ఏళ్లుగా నానుతోన్న ఈ సమస్యకు పరిష్కారంగా శ్రీలంక పార్లమెంట్ ఇటీవలే.. పాత చట్టాన్ని కొట్టివేస్తూ కొత్త బిల్లును తీసుకొచ్చింది. లింగవివక్ష రూపుమాపేందుకేనని చెబుతూ ఆ చట్టం ప్రకారం మద్యం కొనుక్కునే స్వేచ్ఛతోపాటు, బార్లు, మద్యం అమ్మాకాలు జరిగే ఇతర చోట్లా ఉద్యోగాలు చేసుకునే అవకాశం మహిళలకు కల్పించారు. అంతేకాదు, మద్యం అమ్మకాల వేళల్ని ఉదయం9 నుంచి రాత్రి 9కి కాకుండా ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు మార్పు చేశారు. అలా చేస్తే కుటుంబ వ్యవస్థ ఏంగాను? : కాగా, పార్లమెంట్ తీసుకొచ్చిన ‘నిషేధం ఎత్తివేత ఉత్తర్వు’లను దేశాధ్యక్షుడు మైత్రిపాల సినిసేన తన విశిష్ట అధికారాలను ఉపయోగించి రద్దుచేశారు. బౌద్ధమత గురువులు కూడా తొలినుంచీ ఈ నిషేధాన్ని సమర్థిస్తూనేఉన్నారు. మహిళలకు ఆ స్వేచ్ఛ కల్పిస్తే కుటుంబ వ్యవస్థ కుప్పకూలుతుందని మతాచారుల వాదన. అధ్యక్షుడు కాకమునుపు సిరిసేన సైతం మద్యవ్యతిరేక ఆందోళనల్లో భాగంపంచుకున్న చరిత్ర ఉంది. మొత్తానికి అధ్యక్షుడి నిర్ణయంపై నిరసనకారులతోపాటు కొందరు పార్లమెంట్ సభ్యులు కూడా గుర్రుగాఉన్నారు. -
మా వాళ్లను వదిలేయండి!
కొలంబో : అంతర్యుద్ధం ముగిశాక అరెస్ట చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ.. జాఫ్నాలోని తమిళలు శుక్రవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎల్టీటీఈ, శ్రీలంక మధ్య దశాబ్దాలుగా సాగిన అంతర్యుద్ధం 2009లో ముగిసింది. ఈ సమయంలో కొందరు ఎల్టీటీఈ నేతలను ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద అదుపులోకి తీసుకుంది. తాజాగా నిందితులపై ఉన్న ఉగ్రవాద నిరోధక చట్టాన్ని తొలంగించి.. వారందరినీ బేషరుతుగా విడుదల చేయాలని జాఫ్నాలోని తమిళులు.. గవర్నర్ కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలంకలోని తమిళ్ నేషనల్ అలయన్స్ నేత సంపనాథన్.. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనను కలిసి వినతి పత్రం సమర్పించారు. -
భారత్ ఆరోపణలను కొట్టిపారేసిన లంక ప్రధాని
పరాయి దేశాల సైన్యం కోసం కాదు: విక్రమ సింఘె కొలంబో: శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టు ఏ ఇతర దేశాల సైనిక స్థావరం కాదని ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమ సింఘె స్పష్టం చేశారు. చైనా నావికా దళాల సంఖ్య ఈ పోర్టులో పెరుగుతోందన్న భారత్వర్గాల ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈ పోర్టులో 70 శాతం వాటాను చైనాకు 99 ఏళ్ల లీజుకు ఇస్తూ ఒప్పందం చేసుకోగా చైనా మర్చంట్ పోర్టు హోల్డింగ్స్ (సీఎంపోర్టు) పోర్టు అభివృద్ధికి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. ఈ పోర్టు చైనా నావికాదళానికి ఏ మాత్రం ఉపయోగపడేలా లేకపోవడంతో ఈ ఒప్పందం అమలులో గత కొంతకాలం నుంచి జాప్యం జరుగుతోంది. గత రాత్రి జరిగిన ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్స్‌లో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మాట్లాడుతూ.. ఏ దేశంతోనూ తాము మిలిటరీ సహకారాన్ని పొందబోమని, తమ ప్రాంతాలను వారు వాడుకోవడానికి కూడా అంగీకరించబోమని భారత్ ఆందోళన నేపథ్యంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తమ పోర్టులు, ఎయిర్ పోర్టులలో సైనిక కార్యకలాపాలను శ్రీలంక సేనలు మాత్రమే చూసుకుంటాయని చెప్పారు. పోర్టుల్లో వాణిజ్య కార్యకలాపాల అభివృద్ధికి విదేశీ ప్రైవేటు పెట్టుబడిదారుల సహాయం తీసుకుంటామని పునరుద్ఘాటించారు. -
డ్రైవర్ కోసం దేశాధినేత నిరీక్షణ
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు పది నిమిషాలపాటు కారులోనే డ్రైవర్‌కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ఈ సంఘటనతో అంతా నిర్ఘాంతపోయారు. ఒక దేశాధ్యక్షుడు ఇలా నిరీక్షించడమా అని ముక్కున వేలేసుకున్నారు. ఏం జరిగిందంటే.. పోలీసు విభాగం అనుమతి లేకుండానే అధ్యక్షుడి వాహన డ్రైవర్‌ను బయోమెట్రిక్ ద్వారం నుండి శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లారు. దర్శనం త్వరగా కల్పించి డ్రైవర్‌ను ఆలయం వెలుపలకు పంపి ఉంటే సమస్య ఉండేది కాదు? డ్రైవర్ క్యూలో చిక్కుకున్నాడు. తర్వాత డ్రైవరు ఆదరాబాదరాగా వాహనం వద్దకు చేరుకున్నాడు. దీనివల్ల సిరిసేనపదినిమిషాలపాటు కారులోనే నిరీక్షించాల్సి వచ్చింది. వీఐపీల దర్శనం విషయంలో ఆలయ అధికారులు ముందుగానే పోలీసు విభాగాలతో సమన్వయం చేసుకుని ఉంటే పరిస్థితి బాగుండేది. ముందస్తు సమచారం లేకపోవడం, తీసుకెళ్లిన డ్రైవర్‌ను ఆలయంలోనే వదిలేయటం వంటివి చేయటం వల్లే డ్రైవర్ క్యూలో చిక్కుకున్నాడు. ఇలాంటి సంఘటన తిరుమల చరిత్రలోనే ఇది తొలిసారి. ఆలయ, పోలీసు విభాగాల సమన్వయ తప్పిదం అయినప్పటికీ, దాని ప్రభావం మనదేశ ప్రతిష్ట , పరిపాలన వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తుందనటంలో సందేహం లేదు. ఇలాంటి తప్పిదాలను ఆ దేశ విదేశాంగ విభాగం తీవ్రంగా పరిగణిస్తుంది. దేశాధ్యక్షుడి పర్యటన ముగిశాక ఆ దేశ విదేశాంగ విభాగం వివరణ అడిగే అవకాశం ఉందని తెలిసింది. ఈ తప్పిందంపై అర్బన్‌జిల్లా ఎస్పి జయలక్ష్మి ఆలయ డెప్యూటీఈవో కోదండరామారావుపై మండిపడ్డారు. తమ అనుమతి లేకుండా డ్రైవర్‌ను శ్రీవారి దర్శనానికి ఎలా తీసుకెళతారు? తీసుకెళ్లిన డ్రైవర్‌ను ఎలా వదిలేస్తారు? దీనికి బాధ్యులెవరు? అంటూ మండిపడ్డారు. ఆలయ డెప్యూటీఈవో కోదండరామారావు మాత్రం పెద్దగా స్పందించకపోవడం విస్మయం కలిగించింది. సాధారణంగా అత్యున్నత స్థాయి వ్యక్తుల సందర్శనకు ముందు సంబంధిత విభాగాలన్నీ ప్రతి చిన్న సమన్వయపర్చుకోవాలి. ముందస్తు కసరత్తు లేకపోవడం వల్లే ఈ పొరపాటు తలెత్తినట్లు సమాచారం. -
కలిసికట్టుగా తీవ్రవాదుల అంతు చూద్దాం!
కొలంబో: సమాజానికి చీడలా దాపరించిన తీవ్రవాదాన్ని ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా అంతం చేద్దామని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాలా సిరిసేనా బుధవారం పిలుపు నిచ్చారు. మంగళవారం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో తీవ్రవాదులు దృశ్చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడులపై స్పందించిన సిరిసేనా.. బెల్జియం కింగ్ ఫిలిప్‌కు సానుభూతిని ప్రకటిస్తూ లేఖ రాశారు. దాదాపు మూడు దశబ్దాలుగా క్రూరమైన తీవ్రవాదం కారణంగా తమ దేశం కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవడంలో తమ దేశం నుంచి పూర్తి సహకారం ఉంటుందని సిరిసేనా స్పష్టం చేశారు. తీవ్రవాదులు ఇలాంటి క్రూరమైన చర్యలకు పాల్పడటంపై యావత్ ప్రపంచం ఖండించదగిన విషయంగా పేర్కొన్నారు. అన్ని రకాల తీవ్రవాదం నిర్మూలనకై సమిష్టిగా ప్రపంచ దేశాలన్నీ చర్యలు తీసుకోవాల్సిన అత్యవసరం ఎంతైనా ఉందని మనకు ఈ ఘటన సూచిస్తుందని సిరిసేనా హితవు పలికారు. కాగా, బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో తీవ్రవాదులిద్దరూ ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో 30మందికి పైగా దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. -
పాక్‌తో శ్రీలంక 'అణు'బంధం!
భారత్‌కు పొరుగుదేశాలైన శ్రీలంక, పాకిస్థాన్‌లు అణుఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత తొలిసారిగా పాకిస్థాన్‌లో పర్యటిస్తోన్న శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమక్షంలో ఇరు దేశాల అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్లు 'ది ఎక్సప్రెస్ ట్రిబ్యూన్' అనే పత్రిక వెల్లడించింది. అయితే ఈ ఒప్పందంపై ఇరుదేశాల అధికారులు నోరు కదపకపోవడం గమనార్హం. గడిచిన ఫిబ్రవరిలో భారత్‌తో శ్రీలంక అణుఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా శ్రీలంక నిర్మించనున్న అణు రియాక్టరలో పనిచేయబోయే సాంకేతిక సిబ్బందికి భారత ఇంజినీర్లు శిక్షణ ఇవ్వనున్నారు. -
శ్రీలంక అధ్యక్షుడి సోదరుని దారుణహత్య
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన సోదరుడు ప్రియాంత సిరిసేన(40) దారుణహత్యకు గురయ్యారు. వివరాలు...రెండు రోజుల క్రితం ప్రియాంత సిరిసేన ఆయనపై ఒక ఆగంతకుడు అకస్మాత్తుగా గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ప్రియాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. పారిశ్రామికవేత్త అయిన ప్రియాంతపై గురువారం రాత్రి ఆయన సొంత నగరమైన పొలొన్నారువలో ఒక అగంతకుడు దాడి చేశాడు. అనంతరం ఆయనను పొలొన్నారువకు సమీపంలోని కొలంబోకి అదే రోజు రాత్రి తరలించారు. ప్రియాంత తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రి వర్గాలు ఆయనను ఐసీయూలో ఉంచాయి. మైత్రిపాల సిరిసేన చైనా పర్యటనలో ఉండగా ఈ దాడి జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే దాడికి పాల్పడిన వ్యక్తి ప్రియాంత సిరిసేన స్నేహితుడు కావడం గమనించదగ్గ విషయం. హత్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ విధించింది. -
తిరుమలలో శ్రీలంక అధ్యక్షుడు
-
తిరుమల చేరుకున్న మైత్రిపాల సిరిసేన
తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తిరుమల చేరుకున్నారు. అంతకు ముందు ఆయన ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్నారు. ఈ రాత్రికి ఆయన పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. సిరిసేన రేపు తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సిరిసేన తొలి సారిగా భారత్‌లో నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ఆయన నిన్నప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. భారత్, శ్రీలంక దేశాల మధ్య ద్వైపాక్షిక ,అణు ఒప్పందాలతోపాటు ఇతర కీలకమైన అంశాలపై చర్చించారు. -
బుద్ధగయను సందర్శించిన లంక అధ్యక్షుడు
పాట్నా: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన బుద్ధగయను సందర్శించారు. మంగళవారం బుద్ధగయలోని పవిత్ర మహాబోధి ఆలయంలో ఆయన ప్రార్థనలు చేశారు. లంక అధ్యక్షుడి రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరిసేన రేపు ఉదయం తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. -
ఇంగ్లీష్‌లో మాట్లాడని సామాన్యుడు..
కొలంబో: రైతు నేస్తం.. గ్రామీణ శ్రీలంకకు ప్రతీక.. ఇంగ్లీష్‌లో మాట్లాడని సామాన్యుడు. ఎప్పుడూ సంప్రదాయ దుస్తులనే ధరించే జాతీయ వాది. దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య సంస్కరణలకు గట్టి మద్దతుదారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మైత్రిపాల సిరిసేన వ్యక్తిత్వాన్ని వివరించేందుకు ఈ పదాలు చాలు. శ్రీలంక ఉత్తర మధ్య రాష్ట్రానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో 1951లో మైత్రిపాల సిరిసేన జన్మించారు. 20 ఏళ్ల వయసులోనే అంటే 1971లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలపై రెండేళ్లు జైలుశిక్ష అనుభవించారు. 1989లో శ్రీలంక ఫ్రీడం పార్టీలో చేరి క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెట్టిన సిరిసేన అదే ఏడాది ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి వరుసగా 1994, 2000, 2001 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. పలు ప్రభుత్వాల్లో ఆరోగ్యశాఖ, రక్షణశాఖలకు మంత్రిగా పనిచేశారు. ఆయనను హతమార్చేందుకు ఎల్టీటీఈ ఐదుసార్లు విఫలయత్నం చేసింది. 2008లో ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఇప్పటివరకు రెండుసార్లు వరుసగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన మహీంద రాజపక్సకు సిరిసేన మంత్రివర్గ సహచరుడు. అయితే ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్స నుంచి విడిపోయిన సిరిసేన ఐక్య ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. మొదట్లో సిరిసేనను రాజపక్సకు బలమైన ప్రత్యర్థిగా ఎవరూ భావించలేదు. రైతు నేపథ్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సిరిసేనకు లభించిన భారీ మద్దతు, పట్టణాల్లో ప్రధాన ప్రతిపక్షం యునెటైడ్ నేషనల్ పార్టీకున్న పట్టు, రాజపక్సపై అవినీతి ఆరోపణలు, ఆయన కుటుంబ పాలనపై వ్యతిరేకత ఇవన్నీ కలసివచ్చి ఎన్నికల్లో సిరిసేనను విజయ పథంలో నిలిపాయి. మరోవైపు, సిరిసేనకే మద్దతివ్వాలంటూ మాజీ అధ్యక్షురాలు చంద్రిక కుమారతుంగ కూడా తన మద్దతుదారులకు పిలుపునివ్వడం, అలాగే బౌద్ధుల్లో ప్రజాదరణ ఉన్న బుద్ధిస్ట్ నేషనలిస్ట్ హెరిటేజ్ పార్టీ కూడా మద్దతివ్వడం ఆయనకు కలిసొచ్చింది. -
ఒకవైపు సైన్యం...మరోవైపు పులులు
-
గ్రామీణ శ్రీలంకకు ప్రతీక
కొలంబో: కొలంబో సంపన్న, ప్రముఖ కుటుంబాలకు అపరిచితుడు. రైతు నేస్తం. గ్రామీణ శ్రీలంకకు ప్రతీక. పేరున్న స్కూళ్లలో చదువుకోని, ఇంగ్లీష్‌లో మాట్లాడని సామాన్యుడు. ఎల్లప్పుడూ సంప్రదాయ దుస్తులనే ధరించే జాతీయవాది. దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య సంస్కరణలకు గట్టి మద్దతుదారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించబోతున్న మైత్రిపాల సిరిసేన(63) వ్యక్తిత్వాన్ని వివరించేందుకు ఈ పదాలు చాలు. శ్రీలంక ఉత్తర మధ్య రాష్ట్రానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో 1951లో సిరిసేన జన్మించారు. 1971లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలపై రెండేళ్లు జైలుశిక్ష అనుభవించారు. 1989లో శ్రీలంక ఫ్రీడం పార్టీలో చేరి క్రియాశీల రాజకీయాల్లో అడుగిడి, అదే ఏడాది ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి వరుసగా 1994, 2000, 2001 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. పలు ప్రభుత్వాల్లో ఆరోగ్యశాఖ, రక్షణశాఖలకు మంత్రిగా పనిచేశారు. ఆయనను హతమార్చేందుకు ఎల్టీటీఈ ఐదుసార్లు విఫలయత్నం చేసింది. 2008లో ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. సిరిసేన తండ్రి రెండో ప్రపంచయుద్ధంలో సైనికుడిగా పనిచేశారు. ఐక్య ప్రతిపక్ష కూటమి అభ్యర్థి.. ఇప్పటివరకు రెండుసార్లు వరుసగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన మహీంద రాజపక్సకు సిరిసేన మంత్రివర్గ సహచరుడు. రాజపక్స నుంచి విడివడి ఐక్య ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. మొదట్లో సిరిసేనను రాజపక్సకు బలమైన ప్రత్యర్థిగా ఎవరూ భావించలేదు. రైతు నేపథ్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సిరిసేనకు లభించిన భారీ మద్దతు, పట్టణాల్లో ప్రధాన ప్రతిపక్షం యునెటైడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ)కున్న పట్టు, రాజపక్సపై అవినీతి ఆరోపణలు, ఆయన కుటుంబ పాలనపై వ్యతిరేకత.. ఇవన్నీ కలసివచ్చి ఎన్నికల్లో సిరిసేనను విజయ పథంలో నిలిపాయి. మరోవైపు, సిరిసేనకే మద్దతివ్వాలంటూ మాజీ అధ్యక్షురాలు చంద్రిక కుమారతుంగ కూడా తన మద్దతుదారులకు పిలుపునివ్వడం, అలాగే బౌద్ధుల్లో ప్రజాదరణ ఉన్న బుద్ధిస్ట్ నేషనలిస్ట్ హెరిటేజ్ పార్టీ కూడా మద్దతివ్వడం ఆయనకు కలిసొచ్చింది. అధ్యక్ష అధికారాల కుదింపు.. తన ప్రచారంలో కూడా రాజపక్స కుటుంబ పాలనను అంతం పలకాల్సిన అవసరం ఉందని, రాజపక్స పాలనలో దేశం నియంతృత్వం వైపు సాగుతోందని సిరిసేన ప్రధానంగా ప్రస్తావించారు. రాజపక్స పాలనలో దేశంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెచ్చుమీరాయని విమర్శించారు. తాను గెలిస్తే వంద రోజుల్లోగా కార్యనిర్వాహక అధ్యక్షతను రద్దు చేస్తానని, అధ్యక్షుడి అధికారాలను తగ్గించేందుకు రాజ్యాంగ సవరణలను తీసుకువస్తానని, యూఎన్‌పీ నేత, మాజీ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను మళ్లీ ప్రధానిగా నియమిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నిసార్లైనా అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడేందుకు అవకాశం కల్పించే రాజ్యాంగంలోని వివాదాస్పద 18వ సవరణను తొలగించి, 17వ సవరణను మళ్లీ రాజ్యాంగంలో పొందుపరుస్తానన్నారు. -
శ్రీలంక అధ్యక్షుడిగా సిరిసేన
►51.2% ఓట్లతో గెలిచిన ఐక్య ప్రతిపక్ష కూటమి అభ్యర్థి ► మూడోసారి పగ్గాలు చేపట్టాలనుకున్న రాజపక్సకు షాక్ ► అధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేన, ప్రధానిగా విక్రమసింఘే ప్రమాణం ► శుక్రవారం ఉదయమే అధ్యక్షభవనం వీడిన రాజపక్స కొలంబో: వరుసగా మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించాలనుకున్న మహీంద రాజపక్సకు శ్రీలంక ఓటర్లు షాకిచ్చారు. రాజపక్స స్థానంలో ఒకప్పటి ఆయన మంత్రివర్గ సహచరుడు, ఐక్య ప్రతిపక్ష కూటమి అభ్యర్థి మైత్రిపాల సిరిసేన(63)కు అధ్యక్ష పట్టం కట్టబెట్టి చరిత్రాత్మక తీర్పునిచ్చారు. 19 మంది పోటీ పడిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. రాజపక్స 47.6 శాతంతో 57,68,090 ఓట్లు సాధించగా, సిరిసేన 51.2శాతంతో 62,17,162 ఓట్లు గెలుచుకుని శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 1.54 కోట్ల ఓటర్లలో దాదాపు 75% మందికి పైగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమిళులు, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సిరిసేనకు అత్యధిక ఓట్లు లభించాయి. శ్రీలంక ఆరవ దేశాధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేన ఎన్నికయ్యారని ఎన్నికల కమిషనర్ మహీంద దేశప్రియ ప్రకటించారు. అయితే, అంతకుముందే ఓటమిని అంగీకరించిన రాజపక్స అధ్యక్ష భవనం ‘టెంపుల్ ట్రీస్’ను వదలివెళ్లారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిపించినందుకు విజయానంతరం సిరిసేన రాజపక్సకు కృతజ్ఞతలు తెలిపారు.ఫలితాలు వెలువడిన కొద్ది గంటలకే సిరిసేన దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే కూడా ప్రమాణ స్వీకారం చేశారు. విక్రమసింఘే అధ్యక్ష ఎన్నికల్లో సిరిసేనకు మద్దతిచ్చిన ప్రతిపక్ష యునెడైట్ నేషనల్ పార్టీ నేత. కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద వీరిద్దరితో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కే శ్రీపవన్ ప్రమాణ స్వీకారం చేయించారు. సిరిసేన, విక్రమసింఘేలు.. తమకు మద్దతిస్తున్న పార్టీలతో కలిసి గురువారం విశాల సంకీర్ణ కూటమి ‘న్యూ డెమొక్రటిక్ ఫ్రంట్’ను ఏర్పాటు చేశారు. అధికార మార్పిడి నిరాటంకంగా జరిగేందుకు సహకరిస్తానని శుక్రవారం ఉదయం తాను కలిసినప్పుడు రాజపక్స హామీ ఇచ్చారని విక్రమసింఘే వెల్లడించారు. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలకు కృషి చేస్తానని శ్రీలంక నూతన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పేర్కొన్నారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తానని, అప్పుడు తాను చెప్పిన మార్పును తీసుకువస్తానన్నారు. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడబోనని స్పష్టం చేశారు. కాగా, తమిళ అతివాదులతో మెత్తగా వ్యవహరించడం కానీ, ఉత్తర శ్రీలంక నుంచి ఆర్మీని తొలగించడం కానీ చేయబోనని ఎన్నికల ప్రచారం సమయంలోనే సిరిసేన స్పష్టం చేశారు. దీన్నిబట్టి సిరిసేన పాలన రాజపక్స పాలన కన్నా భిన్నంగా ఉండబోదని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళులకు విలన్ రాజపక్స.. కొద్ది వారాల క్రితం వరకు రాజపక్స ఓటమి అసాధ్యమన్న భావన ఉండేది. తమిళ వేర్పాటువాద సంస్థ ఎల్టీటీఈని శ్రీలంకలో తుదముట్టించడం వల్ల దేశంలోని మెజారిటీ సింహళీయుల్లో ఆయనపై అభిమానం భారీగా పెరిగి, ‘కింగ్’ అనే బిరుదు లభించినా.. మైనారిటీ తమిళుల్లో మాత్రం ఆయన భారీ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. 2009లో ఎల్టీటీఈతో పోరు సందర్భంగా పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడడం, తమిళులకు మరిన్ని అధికారాలిచ్చేందుకు రాజ్యాంగ సవరణ చేస్తానన్న హామీని అమలు చేయకపోవడం.. రాజపక్స పట్ల తమిళుల్లో ఆగ్రహాన్ని మరింత పెంచాయి. అలాగే, రాజపక్స పాలనలో అవినీతి, కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతం, నియంతృత్వ ధోరణి ముప్పిరిగొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత కూడా ఈ ఫలితాల్లో ప్రతిఫలించింది. తన సోదరులు గొతాభయను రక్షణ మంత్రిగా, బాసిల్‌ను ఆర్థిక మంత్రిగా, మరికొందరు సన్నిహిత బంధువులను ప్రభుత్వంలోని కీలక పదవుల్లో నియమించడంపై కూడా రాజపక్సపై విమర్శలు వచ్చాయి. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికవాలన్న లక్ష్యంతో రాజపక్స రాజ్యాంగాన్ని సవరించి మరీ ఎన్నికలను రెండేళ్లు ముందుకు జరిపారు. ఎన్నికల ప్రకటన వెలువడినరోజే సిరిసేన 26 మంది అధికార సంకీర్ణ ఎంపీలతో కలసి రాజపక్స పాలనపై తిరుగుబాటు చేశారు. అధికార శ్రీలంక ఫ్రీడం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి, ఆరోగ్య శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రతిపక్ష కూటమి మద్దతుతో అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. తిరుగుబాటుకు ముందురోజే రాజపక్సతో కలసి ఆయన డిన్నర్ చేయడం విశేషం. -
లంకలో కొత్త నీరు!
అందరూ ఊహించినట్టే, సర్వేలన్నీ జోస్యం చెప్పినట్టే శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స అక్కడ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. విపక్షానికి చెప్పుకోదగ్గ నాయకుడే లేని స్థితిని అదునుగా తీసుకుని, తనపై అంతకంతకూ పెరుగుతున్న అసంతృప్తిని పసిగట్టి... ఇప్పుడే ఎన్నికలకు వెళ్లడం ఉత్తమమని రాజపక్స భావించారు. పైగా ఆయనకు సంఖ్యా శాస్త్రంపై అపారమైన నమ్మకం. ఇటు సంవత్సరమూ, అటు తేదీ తన అదృష్ట సంఖ్య 8కి సరిపోయేలా ఉన్నాయి గనుక... జనవరి 8న ఎన్నికలు జరిగేలా ఆయన చూశారు. అన్నీ సరిపోయినా అధికార పీఠం అందుకోవడానికి తప్పనిసరైన జనం మద్దతు మాత్రం ఆయనకు లేకుండా పోయింది. ఇందుకు రెండే కారణాలు-ఆయన కుటుంబ పాలన, దానితో పెనవేసుకుపోయిన అవినీతి. రాజపక్స ఇద్దరు సోదరులు మంత్రులుకాగా, మరో సోదరుడు పార్లమెంటు స్పీకర్, కుమారుడు ఎంపీ. మొన్నటి నవంబర్‌లో ఎన్నికలు ప్రకటించిన రెండురోజుల తర్వాత అప్పటికి రాజపక్స ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా, నంబర్ టూ గా ఉన్న మైత్రిపాల సిరిసేన తన పదవికి రాజీనామా చేసి విపక్ష శిబిరంలో చేరి ఉండకపోతే ఇదంతా యథాతథంగా కొనసాగేదేమో! ఎల్టీటీఈని తుడిచిపెట్టడాన్ని స్వాగతించిన సింహళ బౌద్ధులు 2009 ఎన్నికల్లో రాజపక్స వెనక గట్టిగా నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో మైనారిటీ వర్గాలైన తమిళులు (15.3శాతం), ముస్లింలు (9.3 శాతం), క్రైస్తవులు (7.4శాతం) అనేక కారణాలవల్ల చీలివున్నారు. మొత్తంగా 32 శాతంగా ఉన్న మైనారిటీలు ఆ ఎన్నికల్లో విడివడి ఉండటంతో రాజపక్స ఘనవిజయం సాధించగలిగారు. ఈసారి పరిస్థితి తారుమారైంది. మెజారిటీ సింహళుల్లో చీలిక వచ్చి ఎక్కువ మంది ఆయనకు వ్యతిరేకమయ్యారు. వీరి మద్దతును తిరిగి పొందడం కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. తాను తప్పుకుంటే మళ్లీ తమిళ టైగర్లు విజృంభిస్తారని హెచ్చరించారు. సింహళులకూ, ముస్లింలకూ మధ్య...సింహళులకూ, క్రైస్తవులకూ మధ్య ఘర్షణలు రెచ్చగొట్టాలని చూశారు. అయితే, ఇది ఫలించలేదు సరిగదా...మైనారిటీలతో సింహళులు కూడా జతకట్టారు. ఫలితంగా సిరిసేన 51.3 శాతం ఓట్లతో నెగ్గగలిగారు. ముస్లింలు, తమిళులు అధికంగా ఉండే ప్రాంతాల్లో సిరిసేన 70 శాతానికిపైగా ఓట్లు తెచ్చుకోగలగడం రాజపక్సపై ఆ వర్గాల్లో ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తుంది. విపక్షాల అభ్యర్థిగా అధ్యక్ష పీఠాన్ని గెలుచుకున్న సిరిసేనకు అసలు అగ్నిపరీక్షలు ఇప్పుడు మొదలవుతాయి. ఆయన ముందుగా తన అధికారాలను తాను రద్దు చేసుకోవాల్సి ఉన్నది. తాను అధికారంలోకొచ్చిన వెంటనే దేశంలో నియంతృత్వానికి తావిస్తున్న అధ్యక్ష తరహా పాలనకు స్వస్తి పలుకుతానని సిరిసేన వాగ్దానం చేశారు. దేశంలో తిరిగి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నెలకొల్పుతానన్నారు. అధ్యక్ష తరహా పాలనలో ఉండే లొసుగులవల్లే ప్రభుత్వ ఖజానాను రాజపక్స అయినవారికి దోచిపెట్టారని సిరిసేన ప్రచారం చేసివున్నారు. దిగువ మధ్యతరగతి, పేద వర్గాలవారి బతుకులు దుర్భర ం చేస్తున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలనూ, ఇతర నిత్యావసరాల ధరలనూ తగ్గిస్తామని చెప్పారు. వీటితోపాటు రాజపక్స కుటుంబం చెప్పినట్టల్లా ఆడిన పోలీసు విభాగాన్ని పట్టాలెక్కించి దేశంలో చట్టబద్ధ పాలనను పునరుద్ధరించడం, న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని పునఃప్రతిష్టించి, రాజపక్స కారణంగా పదవి కోల్పోయిన షిరానీ బండారునాయకేను మళ్లీ చీఫ్ జస్టిస్‌గా నియమించడం వంటివి దేశ ప్రజలు సిరిసేన నుంచి తక్షణం ఆశిస్తున్నవి. ఇవిగాక ఆయన సమర్థతకు పరీక్షపెట్టే ఇతర అంశాలు చాలా ఉన్నాయి. రాజపక్స పాలనలో టైగర్ల అణచివేత పేరిట తమిళులపై సాగించిన దురంతాలపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో విచారణకు సిద్ధపడటం అందులో కీలకమైనది. సైన్యం అత్యాచారాల సమయంలో సిరిసేన కొద్దికాలం రక్షణ మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయనను బలపరిచిన సింహళ జాతీయవాద పార్టీలు ఇలాంటి విచారణకు ససేమిరా అంటున్నాయి. అలాగే తమిళ పార్టీల ఆధ్వర్యంలో ఉన్న ఉత్తర తూర్పు ప్రాంత మండలికి అధికారాలను ఇచ్చేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలన్న డిమాండును నెరవేర్చడం సిరిసేనకు తలకు మించిన భారం. దీనికి సంబంధించిన 13వ రాజ్యాంగ సవరణను సింహళ పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. సిరిసేనకు మద్దతిచ్చిన తమిళ పార్టీలు మాత్రం ఆ సవరణ తీసుకురావల్సిందేనంటున్నాయి. వీటన్నిటితోపాటు లంక ఆర్థిక వ్యవస్థతో పెనవేసుకుపోయిన చైనా ప్రభావాన్ని తగ్గించడం సిరిసేనకు పెను సవాలు. చైనాకు దగ్గరకావాలన్న ఉద్దేశంతో అధిక వడ్డీరేట్లపై ఆ దేశంనుంచి భారీ మొత్తంలో రాజపక్స రుణాలు తీసుకొచ్చారు. ఆయన ఓటమికి ఈ రుణభారం కూడా ఒక కారణం. భారత్‌కు వ్యతిరేకంగా ఒక్కొక్క దేశాన్నే చేరదీయాలన్న చైనా వ్యూహంలో భాగంగానే లంకకు భారీ మొత్తంలో రుణాలు అందజేసింది. ఆ దేశానికి చెందిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. శ్రీలంక సైన్యం ఉపయోగిస్తున్న రక్షణ పరికరాల్లో 70 శాతం ‘మేడిన్ చైనా’ గుర్తువే. దీన్నంతటినీ తిరగదోడటం, భారత్‌కు సన్నిహితం కావడం సిరిసేనకు పెద్ద పరీక్షే. ఈ విషయంలో ఆయన ఏం చేస్తారన్న విషయంలో చైనా, భారత్‌లే కాదు...ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. మరోపక్క లంక గడ్డపైనుంచి భారత్ లక్ష్యంగా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కార్యకలాపాలు కొంతకాలంగా సాగుతున్నాయి. రాజపక్స హయాంలో లంకలో పెరిగిన చైనా, పాక్‌ల పలుకుబడి తగ్గించాలని భారత్ కృతనిశ్చయంతో ఉన్నది. అందువల్లనే సిరిసేన నెగ్గిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు భారత్ సందర్శించాలని ఆహ్వానించారు. లంకలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆ దేశంతో మన సంబంధాలు ఏ మేరకు మెరుగుపడగలవో చూడాల్సి ఉన్నది. -
మైత్రిపాల సిరిసేనకు మోడీ అభినందనలు
న్యూఢిల్లీ : శ్రీలంక నూతన అధ్యక్షుడు సిరిసేనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన హోరా హోరీ పోరులో మైత్రిపాల సిరిసేన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ శుక్రవారం ఫోన్ చేసి సిరిసేనను అభినందించారు. కాగా శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కాగా ముస్లిం, తమిళులు మైత్రిపాల సిరిసేనకు పట్టం కట్టారు. రాజపక్సకు వ్యతిరేకంగా విపక్షాలను ఆయన ఏకతాటిపై తెచ్చారు. శుక్రవారం సాయంత్రం సిరిసేన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక ఎల్టీటీఈని తుదముట్టించినా శ్రీలంకేయులు రాజపక్సను పట్టించుకోలేదు. మరోవైపు రాజపక్స తన ఓటమిని అంగీకరిస్తూ అధికార నివాసాన్ని వదిలారు. రెండేళ్ల ముందు ఎన్నికలకు వెళ్లినా రాజపక్సకు భంగపాటు తప్పలేదు. -
రాజ్పక్సేకు కలిసిరాని సెంట్మెంట్
-
రాజపక్సే, మైత్రిపాల మధ్య గట్టి పోటీ!
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు గురువారం ముగిశాయి. ఓటర్లు భారీగా పోలింగ్‌లో పాల్గొన్నారు. అధ్యక్ష అభ్యర్థులు మహీంద్ర రాజపక్సే, మైత్రిపాల సిరిసేనల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించి ప్రస్తుత అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే వరుసగా మూడోసారి అధ్యక్షుడవుతారా? లేక ఆయనకు ప్రతర్థిగా మారిన స్నేహితుడు మైత్రిపాల సిరిసేన అధ్యక్ష పగ్గాలు చేపడతారా? అన్నది శుక్రవారం తేలనుంది. తమిళులు, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అధిక శాతం ఓటింగ్ నమోదవడం విశేషం. మెజారిటీ సింహళ ఓటర్లు ఈ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా మద్దతిస్తున్న నేపథ్యంలో తమిళుల, ముస్లింల ఓట్లు ఫలితంలో కీలకపాత్ర పోషిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కచ్చితమైన గణాంకాలు తెలియకపోయినా దేశవ్యాప్తంగా దాదాపు 65 శాతం నుంచి 70 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు అంచనా. ఈ ఎన్నికల్లో రాజపక్సేకు సిరిసేన గట్టి పోటీ ఇచ్చారు. సిరిసేన గెలిస్తే దేశంలో రాజకీయంగా పెనుమార్పులకు అది శ్రీకారమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలేవీ జరగలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే కొన్ని చోట్ల ఓటర్లను అడ్డుకున్నారని సమాచారం. పోటీలో 19 మంది ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ రాజపక్సే, సిరిసేనల మధ్యే ఉంది. విజయంపై ఇరువురు నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.