భారత్కు పొరుగుదేశాలైన శ్రీలంక, పాకిస్థాన్లు అణుఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత తొలిసారిగా పాకిస్థాన్లో పర్యటిస్తోన్న శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమక్షంలో ఇరు దేశాల అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్లు 'ది ఎక్సప్రెస్ ట్రిబ్యూన్' అనే పత్రిక వెల్లడించింది.
అయితే ఈ ఒప్పందంపై ఇరుదేశాల అధికారులు నోరు కదపకపోవడం గమనార్హం. గడిచిన ఫిబ్రవరిలో భారత్తో శ్రీలంక అణుఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా శ్రీలంక నిర్మించనున్న అణు రియాక్టరలో పనిచేయబోయే సాంకేతిక సిబ్బందికి భారత ఇంజినీర్లు శిక్షణ ఇవ్వనున్నారు.
పాక్తో శ్రీలంక 'అణు'బంధం!
Published Tue, Apr 7 2015 5:57 PM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM
Advertisement
Advertisement