న్యూఢిల్లీ : శ్రీలంక నూతన అధ్యక్షుడు సిరిసేనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన హోరా హోరీ పోరులో మైత్రిపాల సిరిసేన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ శుక్రవారం ఫోన్ చేసి సిరిసేనను అభినందించారు. కాగా శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కాగా ముస్లిం, తమిళులు మైత్రిపాల సిరిసేనకు పట్టం కట్టారు. రాజపక్సకు వ్యతిరేకంగా విపక్షాలను ఆయన ఏకతాటిపై తెచ్చారు. శుక్రవారం సాయంత్రం సిరిసేన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
ఇక ఎల్టీటీఈని తుదముట్టించినా శ్రీలంకేయులు రాజపక్సను పట్టించుకోలేదు. మరోవైపు రాజపక్స తన ఓటమిని అంగీకరిస్తూ అధికార నివాసాన్ని వదిలారు. రెండేళ్ల ముందు ఎన్నికలకు వెళ్లినా రాజపక్సకు భంగపాటు తప్పలేదు.
మైత్రిపాల సిరిసేనకు మోడీ అభినందనలు
Published Fri, Jan 9 2015 10:46 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement
Advertisement