కొలంబో: భారత్‌పై శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్( రా)కుట్ర పన్నుతోందని ఆరోపించారు. తమ క్యాబినెట్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అయితే ‘రా’ పన్నిన కుట్ర గురించి ప్రధాని మోదీకి తెలియదని కూడా ఆయన అన్నారు.
‘రా’తనను హతమార్చేందుకు ప్లాన్ వేసినట్లు మైత్రిపాల్ చెప్పడంతో .. క్యాబినెట్ మంత్రులు షాకైనట్లు తెలుస్తోంది. అయితే అధ్యక్షుడు మైత్రిపాల చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటి వరకు ఎటువంటి ఆధికార ద్రువీకరణ లేదు. వాస్తవానికి మైత్రిపాల్ మరికొన్ని రోజుల్లో భారత్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాగా శ్రీలంక నాయకులు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలపై ఆరోపణలు చేయడం కొత్తేమి కాదు. 2015లో జరిగిన శ్రీలంక ఎన్నికల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు కూడా ‘రా’ పై ఆరోపణలు చేశారు. దేశ పాలన మార్పులో ‘ రా’ పాత్ర కూడా ఉందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment