
మైత్రిపాల సిరిసేన
తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తిరుమల చేరుకున్నారు. అంతకు ముందు ఆయన ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్నారు. ఈ రాత్రికి ఆయన పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. సిరిసేన రేపు తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకుంటారు.
శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సిరిసేన తొలి సారిగా భారత్లో నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ఆయన నిన్నప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. భారత్, శ్రీలంక దేశాల మధ్య ద్వైపాక్షిక ,అణు ఒప్పందాలతోపాటు ఇతర కీలకమైన అంశాలపై చర్చించారు.