కొలంబో : అంతర్యుద్ధం ముగిశాక అరెస్ట చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ.. జాఫ్నాలోని తమిళలు శుక్రవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎల్టీటీఈ, శ్రీలంక మధ్య దశాబ్దాలుగా సాగిన అంతర్యుద్ధం 2009లో ముగిసింది. ఈ సమయంలో కొందరు ఎల్టీటీఈ నేతలను ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద అదుపులోకి తీసుకుంది. తాజాగా నిందితులపై ఉన్న ఉగ్రవాద నిరోధక చట్టాన్ని తొలంగించి.. వారందరినీ బేషరుతుగా విడుదల చేయాలని జాఫ్నాలోని తమిళులు.. గవర్నర్ కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలంకలోని తమిళ్ నేషనల్ అలయన్స్ నేత సంపనాథన్.. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనను కలిసి వినతి పత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment