శ్రీలంక ప్రధానికి స్వాగతం పలుకుతున్న టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి
తిరుమల/రేణిగుంట: శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే కుటుంబసమేతంగా గురువారం తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీకృష్ణ విశ్రాంతి గృహం వద్ద ఆయనకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ ఏఈవో ఏవీ ధర్మారెడ్డి, తదితరులు స్వాగతం పలికారు.
రాజపక్సే తన కుటుంబంతో కలిసి నేడు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో మహింద రాజపక్సేకు సాదర స్వాగతం లభించింది. విమానాశ్రయంలో వారికి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment