
ఎలాంటి కుట్ర చేయలేదు: రాజపక్స
కొలంబో: తన అధికారాన్ని కొనసాగించడం కోసం ఇటీవలి ఎన్నికల్లో ఓటమి అనంతరం కుట్రకు పాల్పడ్డాననేది అవాస్తవమని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స పేర్కొన్నారు. ఈ విషయంలో ఆ దేశ కొత్త ప్రభుత్వం చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఎన్నికల్లో ఓడిపోయిన రాజపక్స తన అధికారాన్ని నిలుపుకోవడం కోసం కుట్ర చేశారని శ్రీలంక కొత్త ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంగళవారం రాజపక్స మాట్లాడుతూ ‘‘గత వారం వెల్లడైన ఎన్నికల ఫలితాలను నేను స్వాగతించాను. అయినా నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు’’ అని చెప్పారు.