
ఆయనను ఆహ్వానించడం దురదృష్టకరం
చెన్నై: నరేంద్ర మోడీ తన ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సెను ఆహ్వానించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని మోడీ హామీయిచ్చిన నేపథ్యంలో రాజపక్సెను ఆహ్వానించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం దురదృష్టకరమన్నారు.
శ్రీలంక అధ్యక్షుడికి ఆహ్వానంపై కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కూడా అభ్యతంరం తెలిపింది. తమిళుల మనోభావాలను మోడీ అర్థం చేసుకోవాలని సూచించింది. శ్రీలంకలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనపై తమిళులు ఆగ్రహంగా ఉన్నారని తెలిపింది.