కొలంబోలో చివరగా టీమిండియా ఎప్పుడు ఆడిందంటే? అప్పుడు సంజూ! | What happened the last time India played an ODI at the R Premadasa Stadium | Sakshi
Sakshi News home page

Asia Cup 2023: కొలంబోలో చివరగా టీమిండియా ఎప్పుడు ఆడిందంటే? అప్పుడు సంజూ!

Published Sun, Sep 10 2023 8:13 AM | Last Updated on Sun, Sep 10 2023 8:47 AM

What happened the last time India played an ODI at the R Premadasa Stadium - Sakshi

ఆసియాకప్‌-2023లో మరో రసవత్తర పోరుకు సమయం అసన్నమైంది.  ఈ మెగా టోర్నీ సూపర్‌-4లో భాగంగా ఆదివారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో భారత్‌-పాకిస్తాన్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ మ్యాచ్‌ మధ్యహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. కాగా దాయాదుల పోరుకు ఈ సారి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌డేను ఏసీసీ కేటాయించడం అభిమానులకు ఊరట కలిగించే విషయం. ఇక చిరకాల ప్రత్యర్థితో పోరుకు ముందు కొలంబో మైదానంలో భారత్‌ రికార్డు ఎలా ఉందో ఓ లూక్కేద్దం.

ఆఖరి మ్యాచ్‌లో ఘోర ఓటమి..
శ్రీలంకలోని అతిపెద్ద క్రికెట్ మైదానాలలో ఒకటి ప్రేమదాస స్టేడియం ఒకటి. భారత జట్టు ఇప్పటి వరకు ఈ మైదానంలో 46 వన్డేలు ఆడింది. అందులో 23 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 16 సందర్భాల్లో భారత్‌ ఓటమి పాలైంది. మరో నాలుగు వన్డేల్లో ఎటువంటి ఫలితం తేలలేదు.  ఈ స్టేడియంలో టీమిండియా చివరగా వన్డే మ్యాచ్‌ 2021 జూలైలో ఆడింది.

మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు లంక పర్యటనకు  ఆ ఏడాది భారత జట్టు వెళ్లింది. తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా.. కానీ కొలంబో వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో మాత్రం 7 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌తోనే టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 225 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో పృథ్వీ షా(49), సంజూ శాంసన్‌(46) పరుగులతో రాణించారు. అనంతరం 226 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి లంక ఛేదించింది. 
చదవండిదాయాదుల పోరుకు రంగం సిద్ధం.. ఆటనా... వర్షమా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement