
దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఐదు రోజుల పాటు కొలంబో స్టాక్ ఎక్సేంజ్‌ని మూసివేయాలని సెక్యూరిటీస్ ఎక్సేంజ్ కమిషనర్ (ఎస్‌ఈసీ) ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 2022 ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 వరకు కొలంబో స్టాక్ ఎక్సేంజీలో ఎటువంటి లావాదేవీలు జరగవు. దేశంలో నెలకొన్ని ఆర్థిక గడ్డు పరిస్థితులపై ఇన్వెస్టర్లకు ఒక అవగాహన ఏర్పడుతుందని ఎస్‌ఈసీ అభిప్రాయ పడింది.
శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. వివిద దేశాలు, అంతర్థాతీయ ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన సుమారు 8 బిలియన్ డాలర్ల రుణాలు చెల్లించలేమంటూ అక్కడి ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు ఆర్థికంగా తమ దేశాలను ఆదుకోవాలనే విజ్ఞప్తులు సైతం చేస్తోంది. మరోవైపు ఈ సంక్షోభానికి కారణమైన ప్రభుత్వం దిగిపోవాలంటూ ప్రతిపక్షాలు, పౌరులు నిర్విరామంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment