srilnaka
-
ICC: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ విజేతలు వీరే!
జూలై నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో శ్రీలంక స్పిన్ సంచలనం ప్రబాత్ జయసూర్య, మహిళల క్రికెట్ విభాగంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఎమ్మా లాంబ్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు. కాగా జయసూర్య ఆస్ట్రేలియాతో తన అరంగేట్ర టెస్టులోనే 12 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. అనంతరం స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ జయసూర్య సత్తాచాటాడు. ఈ సిరీస్‌లో జయసూర్య 17 వికెట్లు సాధించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో జయసూర్య జూలై నెలకు గాను నామినెట్ అయిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బెయిర్ స్టో, ఫ్రెంచ్ సంచలనం గుస్తావ్ మెక్కీన్ను వెనుక్కి నెట్టి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఎమ్మా లాంబ్ సంచలనం దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన వన్డే సిరీస్‌లో లాంబ్ అదరగొట్టింది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ఆమె.. 234 పరుగులతో పాటు 3వికెట్లు పడగొట్టింది. దీంతో లాంబ్.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్వైవర్, భారత్ పేసర్ రేణుకా సింగ్‌ను అధిగమించి ఈ ప్రతిష్టాత్మక అవార్డును లంబ్ దక్కించుకుంది. చదవండి: ZIM Vs BAN 2nd ODI: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించిన జింబాబ్వే.. వన్డే సిరీస్ సొంతం! -
IND-W Vs SL-W: భారత మహిళల శుభారంభం
దంబుల్లా: ఫామ్ కోల్పోయి వన్డే ప్రపంచ కప్ జట్టుకు దూరమైన జెమీమా రోడ్రిగ్స్ ఇప్పుడు టి20ల్లో పునరాగమనంతో సత్తా చాటింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా (27 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శనతో గురువారం జరిగిన తొలి టి20లో భారత మహిళల జట్టు 34 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (31 బంతుల్లో 31; 4 ఫోర్లు) కూడా రాణించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (1), ఆంధ్రప్రదేశ్ బ్యాటర్ సబ్బినేని మేఘన (0) విఫలం కాగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. చివర్లో దీప్తి శర్మ (8 బంతుల్లో 17 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడింది. లంక బౌలర్లలో ఇనొక రణవీర 3, ఒషాది రణసింఘే 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 104 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లంతా సమష్టిగా కట్టడి చేయడంతో చేతిలో వికెట్లున్నా ఛేదనలో శ్రీలంక వెనుకబడిపోయింది. రాధా యాదవ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఇదే వేదికపై ఇరు జట్ల మధ్య రేపు రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది. చదవండి: IRE Vs IND T20 Series: ఆ ఐదుగురు ఆటగాళ్లతో జర జాగ్రత్త.. లేదంటే టీమిండియాకు కష్టమే..! -
BAN Vs SL Test: టెస్టుల్లో ముష్ఫికర్ రహీమ్ అరుదైన రికార్డు!
Mushfiqur Rahim achieved a wonderful milestone: బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా ఈ రికార్డు నమోదు చేశాడు. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం శ్రీలంక బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చిట్టోగ్రామ్ వేదికగా మొదటి టెస్టు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో రోజు ఆటలో రహీమ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా రెండో సెషన్ సమయానికి అతడు 230 బంతులు ఎదుర్కొని 86 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక తమీమ్ ఇక్బాల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో ఈ అరుదైన రికార్డును చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 133 పరుగులు చేసిన అతడు టెస్టుల్లో 4981 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా మొదటి టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 397 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ కొనసాగుతోంది. నాలుగో రోజు రెండో సెషన్ ఆరంభ సమయానికి 401 పరుగులు పూర్తి చేసుకుంది. చదవండి👉🏾IPL 2022: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్ చదవండి👉🏾IPL 2022: అతడి వల్లే సన్‌రైజర్స్‌కు విజయాలు.. బుమ్రా బౌలింగ్‌నూ చితక్కొట్టేస్తాడు! టీ20 సిరీస్‌కు ఎంపిక చేయండి! -
కొలంబో స్టాక్ మార్కెట్ క్లోజ్!
దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఐదు రోజుల పాటు కొలంబో స్టాక్ ఎక్సేంజ్‌ని మూసివేయాలని సెక్యూరిటీస్ ఎక్సేంజ్ కమిషనర్ (ఎస్ఈసీ) ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 2022 ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 వరకు కొలంబో స్టాక్ ఎక్సేంజీలో ఎటువంటి లావాదేవీలు జరగవు. దేశంలో నెలకొన్ని ఆర్థిక గడ్డు పరిస్థితులపై ఇన్వెస్టర్లకు ఒక అవగాహన ఏర్పడుతుందని ఎస్ఈసీ అభిప్రాయ పడింది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. వివిద దేశాలు, అంతర్థాతీయ ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన సుమారు 8 బిలియన్ డాలర్ల రుణాలు చెల్లించలేమంటూ అక్కడి ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు ఆర్థికంగా తమ దేశాలను ఆదుకోవాలనే విజ్ఞప్తులు సైతం చేస్తోంది. మరోవైపు ఈ సంక్షోభానికి కారణమైన ప్రభుత్వం దిగిపోవాలంటూ ప్రతిపక్షాలు, పౌరులు నిర్విరామంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చదవండి: శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. భారీగా వడ్డీరేట్ల పెంపు -
బాప్రే! గాలి పటంతో పాటు మనిషి కూడా గాల్లోనే... !!
నిజంగా ఎవరికైన గాలిపటం ఎగరు వేయడం సరదాగా ఉంటుంది. పైగా కొంతమంది అదోక హాబీలా ఎప్పుడూ గాలిపటాలను ఎగరువేసే వాళ్లు కూడా ఉన్నారు. అయితే శ్రీలంకకు చెందిన ఒక వ్యక్తి సరదాగా తన స్నేహితులతో గాలిపటాలు ఎగరువేసేడు. కానీ అనుహ్యంగా అతను కూడా గాల్లోకి ఎగిరిపోయాడు. (చదవండి: పంచాయితీ ఎన్నికల్లో ఒక అభ్యర్థికి కనివినీ ఎరుగని ఓట్లు!... కచ్చితంగా షాక్ అవుతారు!!) అసలు విషయంలోకెళ్లితే... శ్రీలంకలో తై పొంగల్ నాడు నిర్వహించే గాలిపటాలు ఎగరు వేసే పోటీల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. పైగా శ్రీలంకవాసులు పొంగల్ పండుగను బాగా జరుపుకోవడమే కాక అత్యంత సృజనాత్మకమైన గాలిపటాలు తయారు చేసి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఎగరువేస్తారు. ఈ మేరకు ఎప్పుడూ జరిగే విధంగానే శ్రీలంకలో జాఫ్నాలోని పాయింట్ పెడ్రోలో అకైట్ ఫ్లయింగ్ గేమ్ పోటీలు నిర్వహించారు. దీనిలో భాగంగా చాలామంది రకరకాల గాలిపటాలను ఎగరువేసి గెలిచేందుకు పాల్గొంటారు. ఇదేవిధంగా ఒక వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఒక పెద్ద గాలిపటాన్ని ఎగరువేసే నిమిత్తం ఆ పోటీలో పాల్గొన్నాడు అయితే ఆ పోటిదారుని బృందం అంతా ఆ గాలిపటాన్ని జనపనారతో కూడిన తాళ్లతో ఒక పెద్ద గాలిపటాన్ని ఎగరువేశారు. ఈ మేరకు ఆ బృందంలోని ఆరుగురు నెమ్మదిగా ఆ తాడుని వదిలేస్తే ఈ పోటీదారుడు మాత్రం అనుహ్యంగా తాడుని వదిలి పెట్టడంతో... దీంతో అతను గాలిపటం తోపాటు గాలిలో కొన్ని సెకన్లు ఉన్నారు. దీంతో అతని బృందంలోని సభ్యులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురై 'తాడు వదిలేయ్' అంటూ అరిచారు. కానీ అతను మాత్రం తాడు వదలడానికి భయపడి అలాగే గాల్లో ఉండిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి ఆ వ్యక్తి తాడుని వదిలేసి గాయాలు పాలుకాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. (చదవండి: విరిగిపడిన కొండచరియలు.. 70 మంది గల్లంతు) Dramatic video shows a youth swept into the air with a kite in Jaffna area. The youth was reportedly suffered minor injuries.pic.twitter.com/W0NKrYnTe6 #Kiteman #Kite #LKA #Jaffna #SriLanka — Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) December 21, 2021 -
SL Vs BAN: ఆటగాళ్ల మాటల యుద్దం.. కొట్టుకున్నంత పనిచేశారు
టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లహీరు కుమార నోరుజారాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 6వ ఓవర్ బౌలింగ్ చేసిన లహీరు కుమార.. ఐదో బంతికి లిటన్‌దాస్‌ను పెవిలియన్‌కు పంపాడు. అయితే ఈ క్రమంలో లిటన్ దాస్ వైపు చూస్తూ లహీరు కుమార మాటలు తూటాలు పేల్చాడు. ఈ క్రమంలో లిటన్ దాస్ కూడా తానేం తక్కువ తినలేదన్నట్లుగా అతనితో వాదనకు దిగాడు. దీంతో ఇద్దరు క్రికెటర్ల మధ్య వాగ్వాదం జరగడంతో.. ఫీల్డ్ అంపైర్లు, సహచర ఆటగాళ్లు కలగజేసుకుని సర్దిచెపే ప్రయత్నం చేశారు. అయితే అంతకుముందు కూడా బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 4 వ ఓవర్ బౌలింగ్ చేసిన లహీరు కుమార.. అఖరి బంతిని మహ్మద్ నయీమ్ ఢిపిన్స్ ఆడాడు. కానీ.. ఆ బంతిని అందుకున్న కుమార.. రనౌట్ కోసం వేగంగా నయీమ్పైకి విసిరాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నీర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. చదవండి: IND Vs PAK: అందుకే జట్టులో మాలిక్‌కు చోటు.. అసలు కారణం చెప్పిన పాక్ కెప్టెన్ pic.twitter.com/zhEtXaTVAA — pant shirt fc (@pant_fc) October 24, 2021 -
ఆస్ట్రేలియాలో జయసూర్య కోచింగ్ పాఠాలు!
కొలంబో: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తనపై విధించిన రెండేళ్ల నిషేధాన్ని పూర్తి చేసుకున్న శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య కోచ్‌గా కనిపించనున్నాడు. ఈ మేరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరానికి చెందిన మల్గ్రేవ్ క్రికెట్ క్లబ్ కోచ్‌గా పనిచేయనున్నాడు. 1996 వన్డే వరల్డ్‌కప్ నెగ్గిన జట్టులో జయసూర్య సభ్యుడిగా ఉన్నాడుl. ఐసీసీ అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించాడంటూ 2019 ఫిబ్రవరిలో నిషేధం విధించారు. ఐసీసీ జరిపిన విచారణను అడ్డుకునే ప్రయత్నం చేయడమే అతనిపై నిషేధానికి కారణం. అతని ఫోన్‌ను తమకు అందించాలని కూడా ఏసీయూ కోరగా జయసూర్య దానిపై స్పందించలేదు. 2017 సెప్టెంబర్ వరకు లంక చీఫ్ సెలక్టర్‌గా ఉన్న సమయంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో జయసూర్యకు ఉన్న సంబంధాలపై అతనిపై విచారణ చేయగా అందుకు జయసూర్య సహకరించలేదు. దాంతో అతనిపై నిషేధం విధించక తప్పలేదు. 110 టెస్టులు, 445 వన్డేలు, 31 టి20 మ్యాచ్‌లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు 1996 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రిటైర్మెంట్ తర్వాత 2010లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో జయసూర్య(13430) నాల్గో స్థానంలో ఉన్నాడు. 323 వన్డే వికెట్లు అతని ఖాతాలో ఉన్నాయి. ఇక్కడ చదవండి: ఆట కోసం ఆస్తులమ్ముకున్నాడు.. దేశాన్ని కూడా వీడాడు -
రెండో టెస్టూ లంకే గెలిచింది
కొలంబో: శ్రీలంక సారథి లక్మల్. బేసిక్‌గా బౌలర్. అలాగని ఒక్క వికెట్ తీయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగినా ఒక్క పరుగు (డకౌట్) చేయ లేదు. ఫీల్డర్‌గా ఓ క్యాచ్ కూడా పట్టలేదు. ఎవర్నీ రనౌట్ చేయలేదు. కీపర్ కాదు కాబట్టి స్టంపింగ్ అవకాశమే లేదు. మొత్తానికి ఈ టెస్టు ఆడినా... అన్ని రంగాల్లో ఎక్కడా భాగస్వామ్యం కాలేదు లక్మల్. అయితేనేం అతని సారథ్యంలోనే ఈ మ్యాచ్ లంక గెలిచింది. అతని చేతులతో సిరీస్‌ను తలకెత్తుకుంది. క్రికెట్లో ఏదైనా సాధ్యమే అన్నట్టు... ఇది కూడా సాధ్యమైందిపుడు!! దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులోనూ శ్రీలంక జట్టు 199 పరుగుల తేడాతో గెలిచింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. 490 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు 139/5 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవా రం ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 290 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ బ్రుయిన్ (101; 12 ఫోర్లు) సెంచరీ సాధించాడు. ఇతనికి బవుమా (63; 4 ఫోర్లు) సహకారం అందించాడు. ఇద్దరు ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. 236 స్కోరు వద్ద హెరాత్... బవుమాను ఔట్ చేయడంతో సఫారీ ఇన్నింగ్స్ కూలేందుకు ఎంతోసేపు పట్టలేదు. మరో 13 ఓవర్ల వ్యవధిలో 54 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. శ్రీలంక వెటరన్ స్పిన్నర్ రంగన హెరాత్ (6/98) మరోసారి మాయాజాలం చేసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ పతనాన్ని శాసిం చాడు. హెరాత్‌కు మరో ఇద్దరు స్పిన్నర్లు దిల్రువాన్ పెరీరా (2/90), అఖిల ధనుంజయ (2/67) సహకారం అందించారు. ఫలితంగా దక్షిణాఫ్రికా కోల్పోయిన 10 వికెట్లూ స్పిన్నర్ల ఖాతాలోకే వెళ్లాయి. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 338, దక్షిణాఫ్రికా 124 పరుగులు చేశాయి. 214 పరుగుల ఆధిక్యం పొందిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను 275/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. -
లంకకు సాధ్యమేనా!
దులీప్ మెండిస్, అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా... మురళీధరన్, సనత్ జయసూర్య, మహేల జయవర్ధనే, సంగక్కర... నాటి తరం నుంచి నేటి తరం వరకు శ్రీలంక క్రికెట్లో వీరంతా దిగ్గజాలు. ఈ ఆటగాళ్లంతా ఏదో ఒక దశలో భారత్‌లో టెస్టు సిరీస్‌లు ఆడారు. కానీ విజయం సాధించిన జట్టులో భాగమయ్యే అవకాశం మాత్రం రాలేదు. కొన్ని సార్లు పోరాటస్ఫూర్తితో మ్యాచ్‌లను కాపాడుకోగలిగినా... గెలుపు మాత్రం అందని ద్రాక్షే అయ్యింది. ఇప్పుడు మరోసారి లంక తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన లంక యువ జట్టు ఏ మాత్రం సత్తా చాటుతుందనేది ఆసక్తికరం. సాక్షి క్రీడా విభాగం :శ్రీలంక జట్టు భారత గడ్డపై ఆఖరి సారిగా 2009లో టెస్టు సిరీస్ ఆడింది. తొలి టెస్టులో జయవర్ధనే అసమాన బ్యాటింగ్ (275)తో ఆ జట్టు మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోగలిగింది. అయితే తర్వాతి రెండు టెస్టుల్లో మాత్రం చిత్తుగా ఓడి సిరీస్‌ను కోల్పోయింది. జయవర్ధనే, సంగక్కర, సమరవీర, దిల్షాన్‌లాంటివాళ్లు కూడా భారత బౌలింగ్ ముందు తేలిపోగా... కెరీర్ చరమాంకంలో ఉన్న మురళీధరన్ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. నాటి సిరీస్ ఆడిన జట్టు సభ్యులలో ఇద్దరు మాత్రమే ఇప్పుడు మళ్లీ భారత్‌కు వచ్చారు. ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్, సీనియర్ స్పిన్నర్ రంగన హెరాత్ కుర్రాళ్లకు మార్గనిర్దేశనం చేయనున్నారు. కెప్టెన్ చండిమాల్ కూడా తొలిసారి భారత గడ్డపై బరిలోకి దిగుతున్నాడు. ఇటీవలే సొంత గడ్డపైనే చిత్తుగా ఓడిన లంక, దాదాపు అదే భారత జట్టును నిలువరించి సంచలనం సృష్టించడం అంత సులువు కాదు. సీనియర్లు ఏం చేయగలరు? కొన్నాళ్ల క్రితం వరకు కూడా మాథ్యూస్‌కు ప్రపంచ క్రికెట్లోని ఉత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు ఉంది. అయితే రాన్రానూ కళ తప్పిన అతను ఒక దశలో జట్టుకు భారంగా మారాడు. వరుస గాయాలతో చాలా వరకు అతను బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. ఇక బ్యాటింగ్ కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. భారత్‌తో జరిగిన సిరీస్‌లో మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులు మినహా మిగతా ఐదు ఇన్నింగ్స్‌లలో అతను ఘోరంగా విఫలమయ్యాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల్లో కూడా ఇదే పరిస్థితి. ఒక అర్ధ సెంచరీ చేసి మిగిలిన ఐదు ఇన్నింగ్స్‌లలో చెత్త ప్రదర్శన కనబర్చాడు. మిడిలార్డర్లో కీలక పాత్ర పోషించాల్సిన ప్రధాన బ్యాట్స్‌మన్ అయి ఉండీ మాథ్యూస్ గత 17 టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. గాయం కారణంగా ఇటీవల పాకిస్తాన్‌తో సిరీస్ నుంచి పూర్తిగా తప్పుకున్న అతను... ఇప్పుడు కోలుకొని పునరాగమనం చేస్తున్నాడు. ఈ స్థితిలో అతను రాణించడం ఎంతో ముఖ్యం. మరోవైపు వెటరన్ హెరాత్ ఫామ్ మాత్రం లంక జట్టులో ఆశలు రేపుతోంది. పాకిస్తాన్‌పై రెండో టెస్టులో 11 వికెట్లతో చెలరేగిన హెరాత్, అంతకు కొద్ది రోజుల ముందు ఆస్ట్రేలియా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపై కూడా తన పదును చూపించాడు. అయితే భారత్‌పై హెరాత్ రికార్డు మాత్రం పేలవంగానే ఉంది. భారత్‌పై ఆడిన 9 టెస్టుల్లో 32 వికెట్లు మాత్రమే తీసిన హెరాత్... తన కెరీర్లో అతి చెత్త సగటు (45.96) కూడా భారత్‌పైనే నమోదు చేశాడు. అయితే స్పిన్‌కు అనుకూలమైన పిచ్ తయారైతే మాత్రం మన బ్యాట్స్‌మెన్‌ను కచ్చితంగా ఇబ్బంది పెట్టగలడు. కుర్రాళ్లకు సవాల్! పాక్‌పై ఇటీవల 2–0తో సాధించిన టెస్టు సిరీస్ విజయం శ్రీలంక ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా కొంత మంది యువ ఆటగాళ్లు ఈ సిరీస్‌లో రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ కరుణరత్నే అత్యధిక స్కోరు 196తో సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. చండిమాల్ కూడా సెంచరీతో చెలరేగగా... డిక్వెలా కూడా చక్కటి ప్రదర్శన కనబర్చి లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో సీనియర్ హెరాత్ మాత్రమే కాకుండా ఆఫ్ స్పిన్నర్ దిల్రువాన్ పెరీరా 12 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. స్పిన్‌ను సమర్థంగా ఆడగల పాక్‌ను కట్టడి చేయడంలో లక్మల్, గమగే కూడా సఫలమయ్యారు. ఇప్పుడు వీరంతా అదే స్ఫూర్తి, పట్టుదలతో భారత్‌లో కూడా రాణించాలని భావిస్తున్నారు. భారత్ దుర్భేద్యమైన జట్టు అనడంలో సందేహం లేదు. అయితే ఒక్క రోజు, ఒక్క సెషన్లో తమకు పరిస్థితి అనుకూలంగా మారినా... దానిని సద్వినియోగం చేసుకోగలిగితే యువ లంక జట్టు ఈ సిరీస్‌ను చిరస్మరణీయం చేసుకోగలదు. -
308 పతకాలతో భారత్ అగ్రస్థానం
గువాహటి:గత కొన్ని రోజులుగా ఎంతో అట్టహాసంగా జరిగిన దక్షిణాసియా క్రీడలు ఇక్కడ ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో మంగళవారం ముగిశాయి.ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ దక్షిణాసియా క్రీడలు ముగిసినట్లు ప్రకటించారు. మరోవైపు ముగింపు కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి తరుణ్ గోగాయ్ తో పాటు మేఘాలయ క్రీడా మంత్రి జనిత్ ఎమ్ సంగ్మాలు పాల్గొన్నారు. ఈసారి దక్షిణాసియా క్రీడలను అసోం-మేఘాలయాలు సంయుక్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పోటీలకు మూడోసారి ఆతిథ్యమిచ్చిన భారత్.. అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్రవేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆది నుంచి ఆధిపత్యం కొనసాగించిన భారత్ అదే ఊపును చివరి రోజు కూడా కనబరించింది. తద్వారా 308 పతకాలను తన ఖాతాలో వేసుకున్న భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో 188 స్వర్ణపతకాలు, 90 రజత పతకాలు, 30 కాంస్య పతకాలను భారత్ సాధించింది. కాగా, 186(25 స్వర్ణాలు, 63 రజతాలు, 98 కాంస్యాలు) పతకాలతో శ్రీలంక రెండో స్థానంలో నిలవగా, పాకిస్తాన్ 106 (12 స్వర్ణాలు, 37 రజతాలు, 57 కాంస్యాలు) పతకాలతో మూడో స్థానం సాధించింది. 12 రోజుల పాటు జరిగిన దక్షిణాసియా క్రీడల్లో ఎనిమిది దేశాలు పాల్గొన్నాయి. దాదాపు 2,500 పైగా అథ్లెటిక్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారు. -
విజయం దిశగా కివీస్
హామిల్టన్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయం దిశగా పయనిస్తోంది. 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆదివారం మూడోరోజు బరిలోకి దిగిన కివీస్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 42 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు చేసింది. విలియమ్సన్ (78 బ్యాటింగ్), వాట్లింగ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆతిథ్య జట్టు విజయానికి మరో 47 పరుగులు చేస్తే సరి. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు లాథమ్ (4), గప్టిల్ (1) విఫలమైనా... విలియమ్సన్, టేలర్ (35) మూడో వికెట్‌కు 67 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. మెకల్లమ్ (18), సాంట్నెర్ (4) నిరాశపర్చారు. చమీరాకు 4 వికెట్లు పడ్డాయి. కుప్పకూలిన లంక: అంతకుముందు 232/9 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. దీంతో లంకకు 55 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మ్యాథ్యూస్ సేన ఊహించని రీతిలో కుప్పకూలింది. సౌతీ (4/26), వాగ్నెర్ (3/40), బ్రాస్‌వెల్ (2/31) ధాటికి 36.3 ఓవర్లలో కేవలం 133 పరుగులకే చేతులెత్తేసింది. మెండిస్ (46) టాప్ స్కోరర్. కివీస్ బౌలింగ్ ధాటికి ఏడుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 71 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన లంక... మరో 62 పరుగుల తేడాలో మొత్తం పది వికెట్లు చేజార్చుకుంది.