జూలై నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో శ్రీలంక స్పిన్ సంచలనం ప్రబాత్ జయసూర్య, మహిళల క్రికెట్ విభాగంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఎమ్మా లాంబ్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు. కాగా జయసూర్య ఆస్ట్రేలియాతో తన అరంగేట్ర టెస్టులోనే 12 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.
అనంతరం స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ జయసూర్య సత్తాచాటాడు. ఈ సిరీస్‌లో జయసూర్య 17 వికెట్లు సాధించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో జయసూర్య జూలై నెలకు గాను నామినెట్ అయిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బెయిర్ స్టో, ఫ్రెంచ్ సంచలనం గుస్తావ్ మెక్‌కీన్‌ను వెనుక్కి నెట్టి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఎమ్మా లాంబ్ సంచలనం
దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన వన్డే సిరీస్‌లో లాంబ్ అదరగొట్టింది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ఆమె.. 234 పరుగులతో పాటు 3వికెట్లు పడగొట్టింది. దీంతో లాంబ్.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్వైవర్, భారత్ పేసర్ రేణుకా సింగ్‌ను అధిగమించి ఈ ప్రతిష్టాత్మక అవార్డును లంబ్ దక్కించుకుంది.
చదవండి: ZIM Vs BAN 2nd ODI: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించిన జింబాబ్వే.. వన్డే సిరీస్ సొంతం!
Comments
Please login to add a commentAdd a comment