ముష్ఫికర్ రహీమ్ అరుదైన రికార్డు(PC: Bangladesh Cricket)
Mushfiqur Rahim achieved a wonderful milestone: బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా ఈ రికార్డు నమోదు చేశాడు.
కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం శ్రీలంక బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చిట్టోగ్రామ్ వేదికగా మొదటి టెస్టు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో రోజు ఆటలో రహీమ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా రెండో సెషన్ సమయానికి అతడు 230 బంతులు ఎదుర్కొని 86 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఇక తమీమ్ ఇక్బాల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో ఈ అరుదైన రికార్డును చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 133 పరుగులు చేసిన అతడు టెస్టుల్లో 4981 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా మొదటి టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 397 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ కొనసాగుతోంది. నాలుగో రోజు రెండో సెషన్ ఆరంభ సమయానికి 401 పరుగులు పూర్తి చేసుకుంది.
చదవండి👉🏾IPL 2022: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్
చదవండి👉🏾IPL 2022: అతడి వల్లే సన్‌రైజర్స్‌కు విజయాలు.. బుమ్రా బౌలింగ్‌నూ చితక్కొట్టేస్తాడు! టీ20 సిరీస్‌కు ఎంపిక చేయండి!
Comments
Please login to add a commentAdd a comment