stock exchanges
-
బడ్జెట్ రోజున ఎక్సేచెంజీలు పనిచేస్తాయ్
ముంబై: వచ్చే ఆర్ధిక సంవత్సరానికి (2025–26) గాను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఆ రోజు శనివారం అయినా కూడా ఎక్స్ఛేంజీలు పనిచేస్తాయని ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు తెలిపాయి. ఉదయం 9:15 నుంచి సాయంత్రం 3.30 గంటల మధ్య ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు ఇరు ఎక్స్ఛేంజీలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. గతంలో 2020 ఫిబ్రవరి 1న, 2015 ఫిబ్రవరి 28న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు పని చేశాయి. -
ట్రిపుల్ ధమాకా!
గతవారం పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్ కంపెనీల షేర్లు బుధవారం స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యాయి. ఈ మూడు కంపెనీల షేర్లు భారీ ప్రీమియం ధరతో లిస్టయ్యాయి. ఈక్విటీ మార్కెట్ నష్టాల్లో ట్రేడవుతున్నా.., వీటికి కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో తొలిరోజే మొబిక్విక్ షేరు అత్యధికంగా 90%, విశాల్ మెగామార్ట్ 44%, సాయి లైఫ్ సైన్సెస్ 42 శాతం లాభాలను ఇన్వెస్టర్లకు పంచాయి. విశాల్ మెగామార్ట్ దేశవ్యాప్తంగా సూపర్‌మార్ట్‌లను నిర్వహిస్తున్న విశాల్ మెగామార్ట్ షేరు ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.78)తో పోలిస్తే 33% ప్రీమియంతో రూ.104 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 46% ఎగసి రూ.114 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 44% లాభంతో రూ.112 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.50,444 కోట్లుగా నమోదైంది.మొబిక్విక్ సిస్టమ్స్మొబిక్విక్ పేరుతో ఫిన్‌టెక్ సేవలు అందించే వన్ మొబిక్విక్ సిస్టమ్స్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.279)తో పోలిస్తే 59% ప్రీమియంతో రూ.442 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో ఏకంగా 90.21% ఎగసి రూ.531 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి అదే స్థాయి (రూ.530) వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,120 కోట్లుగా నమోదైంది. సాయి లైఫ్ సైన్సెస్ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్ షేరు ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.549)తో పోలిస్తే 18% ప్రీమియంతో రూ.650 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 42% ఎగసి రూ.780 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 40% లాభంతో రూ.768 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,974 కోట్లుగా నమోదైంది. -
ఐపీవోలు.. అదే స్పీడ్
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఇటీవల ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు జోరు చూపుతూనే ఉన్నాయి. వచ్చే నెల(డిసెంబర్)లో 10 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ ద్వారా ఉమ్మడిగా రూ. 20,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నాయి. ఈ జాబితాలో సూపర్‌మార్ట్ దిగ్గజం విశాల్ మెగా మార్ట్తోపాటు.. బ్లాక్‌స్టోన్ పెట్టుబడులున్న డైమండ్ గ్రేడింగ్ కంపెనీ ఇంటర్నేషనల్ జెమ్మలాజికల్ ఇన్స్టిట్యూట్(ఇండియా), విద్యారుణాలందించే ఎన్బీఎఫ్సీ అవాన్సే ఫైనాన్షియల్ సరీ్వసెస్, టీపీజీ క్యాపిటల్ సంస్థ సాయి లైఫ్ సైన్సెస్, ఆసుపత్రుల చైన్ పారస్ హెల్త్‌కేర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ డీఏఎం క్యాపిటల్ అడ్వయిజర్స్, డయాగ్నోస్టిక్ చైన్ సురక్షా, ప్యాకేజింగ్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ మమతా మెషినరీ, ట్రాన్స్‌రైల్ లైటింగ్ ఉన్నాయి.వివిధ రంగాలు, విభిన్న పరిమాణంలో కంపెనీలు నిధుల సమీకరణ బాటలో సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తాజా ఫలితాలు స్టాక్ మార్కెట్లో సానుకూల సెంటిమెంటుకు తెరతీయనున్నట్లు ఆన్లైన్ బ్రోకరేజీ ట్రేడ్జినీ సీవోవో త్రివేష్.డి. అభిప్రాయపడ్డారు. దీంతో ప్రైమరీ మార్కెట్ మరింత కళకళలాడే వీలున్నట్లు అంచనా వేశారు. ఈ ఏడాది(2024) ఐపీవోలకు అత్యంత ప్రోత్సాహకరంగా సాగినప్పటికీ ఇటీవల కొంతమేర ప్రతికూల ధోరణి నెలకొన్నట్లు తెలియజేశారు. ఇష్యూల వివరాలు విశాల్ మెగా మార్ట్ ఐపీవో ద్వారా రూ. 8,000 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రమోటర్ సమయత్ సరీ్వసెస్ ఎల్ఎల్పీ వాటాను విక్రయించనుంది. ఇక జెమ్మలాజికల్ ఇన్స్టిట్యూట్ రూ. 4,000 కోట్ల సమీకరణపై కన్నేసింది. దీనిలో భాగంగా రూ. 1,250 కోట్లు తాజా ఈక్విటీ జారీసహా.. రూ. 2,750 కోట్ల విలువైన షేర్లను బ్లాక్‌స్టోన్ సంస్థ, ప్రమోటర్ బీసీపీ ఏషియా–2 టాప్కో పీటీఈ ఆఫర్ చేయనుంది. కాగా.. వార్బర్గ్ పింకస్ సంస్థ ఒలివ్ వైన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేసిన అవాన్సే ఫైనాన్షియల్ రూ. 3,500 కోట్లు సమీకరించనుంది. తాజా ఈక్విటీ ద్వారా రూ. 1,000 కోట్లు, ప్రస్తుత వాటాదారుల షేర్ల విక్రయం ద్వారా రూ. 2,500 కోట్లు అందుకోనుంది. ఈక్విటీ నిధులను మూలధన పటిష్టతకు వెచి్చంచనుంది. రికార్డ్ సమీకరణ ఈ ఏడాది ఇప్పటికే 75 కంపెనీలు ఉమ్మడిగా రూ. 1.3 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. ఇది రికార్డ్ కాగా.. జాబితాలో హ్యుందాయ్ మోటార్ ఇండియా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్(ఫస్ట్‌క్రై), ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ చేరాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ ద్వారా గతేడాది(2023)లో 57 కంపెనీలు రూ. 49,436 కోట్లు సమకూర్చుకున్నాయి. సుమారు 236 కంపెనీలు 2021–25 మధ్య కాలంలో ఐపీవోలకు వచ్చాయి. సగటున 27 శాతం లిస్టింగ్ లాభాలను అందించడం గమనార్హం.సురక్ష: రూ. 420–441 సమీకృత డయాగ్నోస్టిక్ చైన్ సురక్షా డయాగ్నోస్టిక్ పబ్లిక్ ఇష్యూ శుక్రవారం(29న) ప్రారంభంకానుంది. డిసెంబర్ 3న ముగియనున్న ఇష్యూకి రూ. 420–441 ధరల శ్రేణిని కంపెనీ తాజాగా ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు 1,91,89,330 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 846 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. అయితే ఈక్విటీ జారీ లేనందున ఇష్యూ ద్వారా కంపెనీకి ఎలాంటి నిధులు లభించబోవు. -
ఈ వారం 2 లిస్టింగ్‌లు, 2 ఐపీవోలు
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో 4 ఐపీవోలు హడావిడి చేయనున్నాయి. గత వారమే ఇష్యూలు పూర్తి చేసుకున్న అలైడ్ బ్లెండర్స్ 2న, వ్రజ్ ఐరన్ 3న స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నాయి. ఇక మరోపక్క ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్, బన్సల్ వైరింగ్ పబ్లిక్ ఇష్యూలు 3నే ప్రారంభంకానున్నాయి. ఆఫీసర్స్ చాయిస్ విస్కీ బ్రాండ్ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ రూ. 281 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 1,500 కోట్లు అందుకుంది. స్పాంజ్ ఐరన్, టీఎంటీ బార్ల తయారీ కంపెనీ వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ షేరుకి రూ. 207 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 171 కోట్లు అందుకుంది. జూలై 5న ముగియనున్న స్టీల్ వైర్ల తయారీ కంపెనీ బన్సల్ వైర్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 243–256 ధరల శ్రేణిని ప్రకటించింది. మొత్తం రూ. 745 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయడం ద్వారా రూ. 745 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రిటైలర్లు కనీసం 58 షేర్లకు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఎమ్క్యూర్ ఫార్మా పబ్లిక్ ఇష్యూకి రూ. 960–1008 ధరల శ్రేణిని ప్రకటించింది. 5న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.14 కోట్ల షేర్ల(రూ. 1,152 కోట్ల విలువ)ను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,952 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. రిటైలర్లు కనీసం 14 షేర్లకు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. -
మహీంద్రా ఫైనాన్స్‌లో రూ. 150 కోట్ల మోసం
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల సంస్థ మహీంద్రా ఫైనాన్స్ రుణాల పోర్ట్‌ఫోలియోలో దాదాపు రూ. 150 కోట్ల మోసం బైటపడింది. ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక శాఖలో ఇది చోటుచేసుకున్నట్లుగా గుర్తించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నాలుగో త్రైమాసికం, పూర్తి సంవత్సర ఆర్థిక ఫలితాల వెల్లడిని మే 30కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. బోర్డు సమావేశాన్ని కూడా అదే రోజునకు రీ–షెడ్యూల్ చేసినట్లు వివరించింది. రిటైల్ వాహన రుణాల మంజూరులో కేవైసీ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేయడం ద్వారా నిధులను పక్కదారి పట్టించారని గుర్తించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. దీనిపై ప్రస్తుతం విచారణ తుది దశలో ఉన్నట్లు వివరించింది. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని, కొందరు వ్యక్తులను అరెస్టు చేయడం సహా చర్యల అమలు వివిధ దశల్లో ఉందని మహీంద్రా ఫైనాన్స్ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో మంగళవారం 5 శాతం పైగా క్షీణించి రూ. 263.60 వద్ద క్లోజయ్యింది. -
అదానీ పవర్‌పై ఎక్స్ఛేంజీల కన్ను
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తాజాగా అదానీ పవర్ కౌంటర్‌ను స్వల్పకాలిక అదనపు పర్యవేక్షణ చర్యల(ఏఎస్ఎం) మార్గదర్శకాలలోకి తీసుకువచ్చాయి. వెరసి ఈ నెల 23 నుంచి అదానీ పవర్ స్వల్పకాలిక ఏఎస్ఎం మార్గదర్శకాల తొలి దశ జాబితాలోకి చేరింది. ఈ అంశాన్ని రెండు ఎక్సే్ఛంజీలు విడిగా పేర్కొన్నాయి. సోమవారమే అదానీ గ్రూప్‌లోని అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్డీటీవీ స్టాక్స్‌ను ఎక్సే్ఛంజీలు దీర్ఘకాలిక ఏఎస్ఎం రెండో దశ నుంచి స్టేజ్–1కు బదిలీ చేశాయి. ఇక ఈ నెల 8న అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మర్‌లను స్వల్పకాలిక ఏఎస్ఎంలో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 17 నుంచి వీటిని స్వల్పకాలిక ఏఎస్ఎం నుంచి తప్పించాయి. ఏఎస్ఎం పరిధిలోకి చేర్చేందుకు గరిష్ట, కనిష్ట వ్యత్యాసాలు, క్లయింట్ల దృష్టి, సర్క్యూట్ బ్రేకర్లను తాకడం, పీఈ నిష్పత్తి తదితర అంశాలను స్టాక్ ఎక్సే్ఛంజీలు పరిగణించే విషయం విదితమే. స్వల్పకాలిక ఏఎస్ఎంలో చేర్చిన స్టాక్‌లో ఓపెన్ పొజిషన్లకు 50 శాతం లేదా ప్రస్తుత మార్జిన్ ఏది ఎక్కువైతే అది వర్తిస్తుంది. గరిష్టంగా 100 శాతం మార్జిన్ రేటు పరిమితి ఉంటుంది. -
Suzlon Energy: ‘సుజ్లాన్’ తులసి తంతి తుది శ్వాస
న్యూఢిల్లీ: పవన విద్యుత్ రంగ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, విండ్ మ్యాన్‌గా పేరొందిన తులసి తంతి (64) కన్నుమూశారు. ఆయన శనివారం గుండెపోటుతో మరణించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. తులసి తంతికి భార్య (గీత), ఇద్దరు సంతానం (కుమారుడు ప్రణవ్, కుమార్తె నిధి) ఉన్నారు. ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సంతాపం వ్యక్తం చేశారు. ‘దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడిన దిగ్గజాల్లో తులసి తంతి ఒకరు. ఆయన అకాల మరణంపై కుటుంబసభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను’ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ప్రధాని ట్వీట్ చేశారు. విలేకరుల సమావేశంలో పాల్గొని అహ్మదాబాద్ నుంచి పుణెకు వస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ కారు డ్రైవరుకు తులసి తంతి సూచించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందేలోగానే ఆయన కన్నుమూశారు. పవన విద్యుత్‌లో దిగ్గజం.. తులసి తంతి 1958లో రాజ్‌కోట్‌లో జన్మించారు. గుజరాత్ యూనివర్సిటీలో బీకామ్ చదివారు. 1995లో సుజ్లాన్ ఎనర్జీ ఏర్పాటుతో పవన విద్యుత్ రంగంలోకి ప్రవేశించారు. ఈ రంగంలో ప్రవేశించడానికి ముందు ఆయనకు టెక్స్టైల్ వ్యాపారం ఉండేది. దాన్ని 2001లో విక్రయించారు. అటు పైన 2003లో అమెరికన్ సంస్థ డాన్మర్ అండ్ అసోసియేట్స్ నుంచి 24 టర్బైన్లకు సుజ్లాన్‌కు భారీ ఆర్డరు దక్కింది. ఆ తర్వాత కంపెనీ వేగంగా విస్తరించడంలో తులసి తంతి కీలక పాత్ర పోషించారు. 2006 నుంచి బెల్జియంకు చెందిన టర్బైన్ విడిభాగాల తయారీ సంస్థ జెడ్ఎఫ్ విండ్ పవర్ యాంట్‌వెర్పెన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. అలాగే ఇండియన్ విండ్ టర్బైన్ తయారీదారుల సమాఖ్యకు ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. కష్టకాలంలో కంపెనీ.. సుజ్లాన్ ఎనర్జీ ఆర్థిక సమస్యల్లో ఉన్న తరుణంలో తంతి అకాల మరణం ప్రాధాన్యం సంతరించుకుంది. 2005లో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయిన తర్వాత శరవేగంగా కార్యకలాపాలు విస్తరించిన సుజ్లాన్ ఎనర్జీ ఒక దశలో రూ. 65,474 కోట్ల మార్కెట్ వేల్యుయేషన్ దక్కించుకుంది. కంపెనీలో మెజారిటీ వాటాలున్న తంతి సంపద విలువ దాదాపు రూ. 43,537 కోట్లకు పెరిగింది. అయితే, ఆ తర్వాత అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తడం, ఆ తర్వాత పరిణామాలతో పవన విద్యుత్ రంగం కుదేలైంది. దీనికి టర్బైన్లలో లోపాల ఫిర్యాదులు మొదలైనవి కూడా తోడు కావడంతో సుజ్లాన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. కంపెనీ విలువ రూ. 8,536 కోట్లకు పడిపోయింది. భారీగా రుణాలు పేరుకుపోయాయి. వాటిని తీర్చేందుకు వర్కింగ్ క్యాపిటల్, ఇతరత్రా అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు సుజ్లాన్ అక్టోబర్ 11న రూ. 1,200 కోట్ల రైట్స్ ఇష్యూకు రానుంది. ఈ తరుణంలో తంతి హఠాన్మరణంతో తలెత్తబోయే పరిణామాలపై ఆసక్తి నెలకొంది. అయితే, అనుభవజ్ఞులైన బోర్డు డైరెక్టర్లు, సీనియర్ మేనేజ్మెంట్ సారథ్యంలో తంతి ఆకాంక్షలను నెరవేరుస్తామని సుజ్లాన్ ఎనర్జీ పేర్కొంది. -
సోనీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) విలీన ప్రతిపాదనకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి ఆమోదం లభించింది. ఈ విషయాన్ని జీల్ ప్రకటించింది. స్టాక్ ఎక్సే్చంజ్‌ల నుంచి ఆమోదం లభించడం బలమైన, సానుకూల ముందడుగుగా జీల్ పేర్కొంది. దీనివల్ల విలీనానికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని వివరించింది. అయితే, ఈ ప్రతిపాదిత విలీనం అన్నది ఇంకా నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. సెబీ, ఎన్‌సీఎల్‌టీల, సీసీఐ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. గతేడాది డిసెంబర్లో ఈ రెండు మీడియా సంస్థలు తప్పనిసరి విలీనానికి ఒప్పందం చేసుకోవడం గమనార్హం. నాడు ప్రకటించిన మేరకు విలీనానంతర సంస్థలో కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్‌కు 52.03% వాటా ఉంటే, జీ వాటాదారులకు 47.07% వాటా లభించనుంది. జీల్ ఎండీ, సీఈవోగా ఉన్న పునీత్ గోయెంకా.. విలీనం తర్వా త సంస్థకు ఎండీ, సీఈవోగా కొనసాగనున్నారు. -
కొలంబో స్టాక్ మార్కెట్ క్లోజ్!
దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఐదు రోజుల పాటు కొలంబో స్టాక్ ఎక్సేంజ్‌ని మూసివేయాలని సెక్యూరిటీస్ ఎక్సేంజ్ కమిషనర్ (ఎస్ఈసీ) ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 2022 ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 వరకు కొలంబో స్టాక్ ఎక్సేంజీలో ఎటువంటి లావాదేవీలు జరగవు. దేశంలో నెలకొన్ని ఆర్థిక గడ్డు పరిస్థితులపై ఇన్వెస్టర్లకు ఒక అవగాహన ఏర్పడుతుందని ఎస్ఈసీ అభిప్రాయ పడింది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. వివిద దేశాలు, అంతర్థాతీయ ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన సుమారు 8 బిలియన్ డాలర్ల రుణాలు చెల్లించలేమంటూ అక్కడి ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు ఆర్థికంగా తమ దేశాలను ఆదుకోవాలనే విజ్ఞప్తులు సైతం చేస్తోంది. మరోవైపు ఈ సంక్షోభానికి కారణమైన ప్రభుత్వం దిగిపోవాలంటూ ప్రతిపక్షాలు, పౌరులు నిర్విరామంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చదవండి: శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. భారీగా వడ్డీరేట్ల పెంపు -
జీఎంఆర్‌కు స్టాక్ ఎక్స్ఛేంజీల అనుమతి
ముంబై, సాక్షి: మౌలిక రంగ హైదరాబాద్ దిగ్గజం జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలకు స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కోసం చేసిన ప్రతిపాదనలకు ఎక్స్ఛేంజీలు ఆమోదించినట్లు జీఎంఆర్ తాజాగా వెల్లడించింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా విమానాశ్రయేతర బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు కంపెనీ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలపట్ల ఎలాంటి అభ్యంతరాలూ లేవని ఎక్స్ఛేంజీలు పేర్కొన్నట్లు జీఎంఆర్ తెలియజేసింది. దీంతో ఈ ప్రతిపాదనలపై ఆరు నెలల్లోగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రతిపాదనల్లో భాగంగా కంపెనీ జీఎంఆర్ పవర్ ఇన్ఫ్రా, జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా తదితరాకు సంబంధించి విలీనం, సర్దుబాట్లు తదితర చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో కంపెనీ వ్యూహాత్మక రీస్ట్రక్చరింగ్ ప్రణాళికలకు తెరతీసిన విషయం విదితమే. కాగా.. కార్పొరేట్ హోల్డింగ్ స్ట్రక్చర్‌ను సులభతరం చేసేందుకు వీలుగా ఎయిర్పోర్ట్యేతర బిజినెస్‌ను విడదీయనున్నట్లు ఇప్పటికే కంపెనీ తెలియజేసింది. (మార్కెట్ల పతనం- ఫార్మా షేర్ల జోరు) -
‘ఫ్యూచర్’ నీటినీ కొని అమ్ముకోవచ్చు!
భూమ్మీద మూడొంతులు ఉండేది నీరే. కానీ పేద దేశం నుంచి పెద్ద దేశం దాకా చాలా ప్రాంతాల్లో .. వినియోగించతగ్గ నీటికి కటకటే. 2025 నాటికి 180 కోట్ల మంది పైగా ప్రపంచ జనాభా నివసించే ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంటుందని అంచనాలున్నాయి. దీంతో.. వ్యవసాయం సహా ఇతరత్రా అవసరాల కోసం వర్షాభావ ప్రాంతాల్లో నీటి కొనుగోళ్లు భారీగా పెరగనున్నాయి. అలాగే రేటూ పెరగనుంది. ఈ నేపథ్యంలో నీరు అరుదైన వనరుగానే కాకుండా మార్కెట్ వస్తువుగానూ మారిపోతోంది. తాజాగా షికాగో మర్కెంటైల్ ఎక్సే్ఛంజీ (సీఎంఈ).. బంగారం, ముడి చమురు మొదలైన కమోడిటీల్లాగా నీటి ఫ్యూచర్స్‌లోనూ ట్రేడింగ్ ప్రారంభించింది. ఎన్క్యూహెచ్2ఓ టికర్‌తో దీన్ని ప్రవేశపెట్టింది. ఎందుకంటే.. అంతర్జాతీయంగా నీటిని అత్యధికంగా వినియోగించే దేశాల్లో అమెరికా రెండో స్థానంలో ఉంది. యావత్ అమెరికా రోజు వారీ నీటి వినియోగంలో కాలిఫోర్నియా వాటా 9%. మిగతా ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా కాలిఫోర్నియా నీటి మార్కెట్ 4 రెట్లు అధికంగా ఉంటుంది. 2012–2019 మధ్య కాలంలో నీటికి సంబంధించి 2.6 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే లావాదేవీలు జరిగాయి. నీటి వినియోగం అత్యధికంగా ఉండే కాలిఫోర్నియా తరచూ కరువు బారిన కూడా పడుతుంటుంది. అడపాదడపా వానలు, సుదీర్ఘ కాలం పాటు వర్షాభావం పరిస్థితుల కారణంగా నీటి ఎద్దడి ఏర్పడి, రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయని నాస్డాక్ గ్లోబల్ ఇండెక్సెస్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఎక్సే్ఛంజీల్లో బహిరంగంగా నీటి ట్రేడింగ్ నిర్వహిస్తే మార్కెట్లో పారదర్శకత పెరుగుతుందని, కొనుగోలుదారులకు ప్రయోజనకరంగా ఉంటుం దని పేర్కొన్నాయి. వర్షాభావ సంవత్సరాల్లో కాలిఫోర్నియా స్పాట్ మార్కెట్లో వ్యవసాయ రంగంతో పాటు ఇతరత్రా తయారీ సంస్థలు, మున్సిపాలిటీలు కూడా అత్యధికంగా నీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది. నీటి వినియోగం ఎక్కువగా ఉండే బాదం పప్పు, పిస్తా వంటి పంటల సాగు ఇటీవల పెరుగుతుండటంతో.. నీటి కొనుగోళ్లు సైతం పెరుగుతున్నాయి. సాధారణంగా నీటి నిల్వలు పుష్కలంగా ఉన్న ఇతర ప్రాంతాల్లోని రైతులు, మున్సిపాలిటీలు విక్రయిస్తుంటాయి. ట్రేడింగ్ ఇలా.. రెండేళ్ల క్రితం ప్రారంభించిన నాస్డాక్ వెలస్ కాలిఫోర్నియా వాటర్ సూచీకి అనుసంధానంగా ఈ కాంట్రాక్టులు ఉంటాయి. కాలిఫోర్నియాలో నీటి లావాదేవీలు భారీగా జరిగే అయిదు అతి పెద్ద స్పాట్ మార్కెట్లలో రేట్ల సగటును తీసుకుని ప్రామాణిక రేటు నిర్ణయిస్తారు. ఒకో కాంట్రాక్టు విలువ 10 ఏసీఎఫ్ (ఎకర్ పర్ ఫీట్ ఆఫ్ వాటర్)గా ఉంటుంది. ఎకరం పొలాన్ని ఒక్క అడుగు మేర నింపేందుకు అవసరమైన నీటిని ఏసీఎఫ్‌గా వ్యవహరిస్తారు. 10 ఎకరాలకు సుమారు 3.26 మిలియన్ల గ్యాలన్ల నీరు అవసరమవుతుంది. ప్రస్తుతం 2022 దాకా త్రైమాసిక కాంట్రాక్టులున్నాయి. రేట్ల పెరుగుదలకు హెడ్జింగ్ సాధనంగా ఈ కాంట్రాక్టు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు రాబోయే మూణ్నెల్లలో వర్షాల్లేక నీటి రేటు పెరుగుతుందేమోనన్న అంచనాలు ఉన్న రైతు ఫ్యూచర్స్ కాంట్రాక్టును 500 డాలర్లకు కొనుక్కున్నారనుకుందాం. ఒకవేళ నిజంగానే అలాంటి పరిస్థితే ఏర్పడి రేటు 550 డాలర్లకు పెరిగిందంటే రైతుకు 50 డాలర్ల లాభం వచ్చినట్లు. ఆ కాంట్రాక్టుని విక్రయించేసి .. ఆ డబ్బుతో స్పాట్ మార్కెట్లో నీరు కొనుక్కోవచ్చు. ఈ విధంగా రేటు భారీ పెరుగుదల నుంచి ఉపశమనం కోసం ఫ్యూచర్స్ కాంట్రాక్టు ఉపయోగపడుతుంది. మరోవైపు, కీలక వనరైన నీటితో ట్రేడింగ్ అనర్థదాయకంగా మారుతుందని కొన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్.. వీక్ లిస్టింగ్
ఇటీవల పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిస్టింగ్‌లో ఇన్వెస్టర్లను నిరాశపరచింది. స్టాక్ ఎక్స్ఛేంజీలలో 6 శాతం తక్కువగా రూ. 31 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇష్యూ ధర రూ. 33తో పోలిస్తే ఇది 6 శాతం తక్కువకాగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 32.45 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 32.65 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 30 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. రెండు రెట్లు కొద్ది రోజుల క్రితం పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 517 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూకి దాదాపు రెండు రెట్లు అధికంగా స్పందన లభించింది. ఆఫర్లో భాగంగా 11.6 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 22.6 కోట్ల షేర్లకోసం దరఖాస్తులు లభించాయి. రిటైల్ విభాగం రెండు రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ సాధించింది. ఇష్యూ నిధులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టైర్-1 క్యాపిటల్‌ను పటిష్ట పరచుకునేందుకు వినియోగించనున్నట్లు బ్యాంక్ ఇప్పటికే తెలియజేసింది. ఈక్విటాస్ హోల్డింగ్స్ ప్రమోటర్‌గా కలిగిన ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఐపీవోను చేపట్టింది. లైసెన్సింగ్ మార్గదర్శకాల ప్రకారం కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలోగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కావలసి ఉంది. గత రెండేళ్లలో గత రెండేళ్ల కాలంలో అంటే 2018-20 మధ్య కాలంలో ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్ ఆదాయంలో 29 శాతం వృద్ధిని సాధించింది. వార్షిక ప్రాతిపదికన డిపాజిట్లు 39 శాతం, రుణ విడుదల 31 శాతం చొప్పున పుంజుకున్నాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.72 శాతాన్ని తాకగా.. నికర ఎన్పీఏలు 1.66 శాతానికి చేరాయి. -
నిఫ్టీ 50 వీక్లీ ఆప్షన్లు షురూ
న్యూఢిల్లీ: పెట్టుబడిదారులు తమ పోర్టిఫోలియో రిస్కును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు.. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో మరో అదనపు హెడ్జింగ్ సాధనం అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రధాన సూచీలో తాజాగా వారాంత ఆప్షన్లను నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) ప్రారంభించింది. మూడు నెలలు, త్రైమాసికం, అర్థ సంవత్సరాంత ఆప్షన్లకు సరసన వీక్లీ ఆప్షన్లు కూడా సోమవారం నుంచి ప్రారంభించినట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈఓ విక్రం లిమాయే వెల్లడించారు. ఈయన మాట్లాడుతూ.. ‘నిఫ్టీ 50 ఇండెక్స్ డెరివేటీవ్స్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ట్రేడవుతున్నాయి. ఈ ప్రధాన సూచీ ఎక్సే్ఛంజ్ ప్లాగ్‌షిప్ ఇండెక్స్.’ అని అన్నారు. ఇక నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో వీక్లీ ఆప్షన్లకు కూడా సెబీ వద్ద నుంచి ఎన్ఎస్ఈ అనుమతి పొందిన విషయం తెలిసిందే కాగా, ఈ సూచీ ట్రేడింగ్‌ను సైతం త్వరలోనే ప్రారంభించనుందని సమాచారం. -
రెండు స్టాక్ఎక్స్చేంజీలనుంచి ఇన్ఫీ డీలిస్ట్
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రెండు స్టాక్ ఎక్స్ఛేంజీలనుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. పారిస్, లండన్ స్టాక్‌మార్కెట్లలో ఇన్ఫోసిస్ షేర్లను డిలిస్టింగ్ చేస్తున్నట్టు వెల్లడించింది. రోజువారి సగటు ట్రేడింగ్ వాల్యూమ్ తక్కువగా ఉండటంతో స్వచ్చందంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. యూరో నెక్ట్స్ ప్యారిస్, యూరో నెక్ట్స్ లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలనుంచి తన అమెరికా డిపాజిటరీ షేర్లను (ఏడీస్) డీలిస్ట్ చేయనున్నామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా మార్కెట్ రెగ్యులేటరీ ఆమోదం వచ్చేంతవరకు క్యాపిటల్ స్ట్రక్చర్, ఏడీఎస్ కౌంట్ యథావిధిగానే కొనసాగుతుందని బీఎస్ఈ ఫైలింగ్‌లో చెప్పింది. అయిదేళ్ల క్రితం న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్ట్ షేర్ ట్రేడింగ్ వాల్యూమ్ అప్పటికంటే తక్కువగా ఉందని పేర్కొంది. కాగా సోమవారం వారం నాటి దేశీయ బుల్ ర్యాలీలో లాభాలతో మురిపించింది. -
వాట్సాప్ లీక్ : లిస్టెడ్ కంపెనీలపై విచారణ
ముంబై : వాట్సాప్ ద్వారా కంపెనీ ఆర్థిక వ్యవహారాలు లీక్ చేసిన వ్యవహారంపై సెబీ, స్టాక్ ఎక్స్చేంజ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. రెండు డజన్లకు పైగా స్టాక్స్ ట్రేడ్ వివరాలపై విచారణ ప్రారంభించాయి. వాట్సాప్ ద్వారా పలు బ్లూచిప్కు చెందిన కంపెనీల ఆర్థిక వివరాలు లీకైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కంపెనీ స్టాక్స్ ట్రేడింగ్‌పై సెబీ, స్టాక్ ఎక్స్చేంజ్లు విచారణకు దిగాయి. ఈ లీకేజీలో పాలు పంచుకున్న వ్యక్తుల కాల్ డేటా రికార్డులను కూడా రెగ్యులేటరీ, స్టాక్ ఎక్స్చేంజ్లను కోరుతున్నాయి. ఈ లీకేజీ వ్యవహారంలో పలు బ్లూచిప్ కంపెనీలు ఉన్నట్టు ఈ విషయం తెలిసిన ఓ అధికారి చెప్పారు. ఈ కంపెనీలకు సంబంధించి గత 12 నెలల ట్రేడ్ డేటాను కూడా ఎక్స్చేంజ్లు పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. డేటా వేర్‌హౌజ్, ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ సాయాన్ని కూడా సెబీ తీసుకుంటున్నట్టు తెలిపారు. సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీల ఆర్థిక వివరాలు కేవలం స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా మాత్రమే బయటికి వెళ్లాలి. ఈ డేటా చాలా సున్నితమైనది. ఈ వివరాలు స్టాక్ ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తాయి. కానీ వాట్సాప్ ద్వారా పలు బ్లూచిప్ కంపెనీల డేటా బహిర్గతమైనట్టు తెలుస్తోంది. అంతేకాక ఆర్థిక వ్యవహారాలు లీక్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల కాల్ డేటా రికార్డులన్నీ కావాలని సెబీ ఆదేశించింది. డేటా అంతా ఎస్ఎంఎస్లు, వాట్సాప్ ద్వారా పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి లీకైనట్టు తెలిసింది. వీరిపై కఠిన చర్యలకు కూడా సెబీ సిద్ధమైంది. ఇప్పటికే ఇలాంటి కేసుల్లో పలు సార్లు సెబీ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్ లేకుండా పెట్టుబడుల సూచనదారులుగా వ్యవహరించిన పలు సంస్థలపై కూడా రెగ్యులేటరీ ఉక్కుపాదం మోపింది. -
బీఎస్ఈలో 200 కంపెనీల డీలిస్టింగ్
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్సే్ఛంజ్ బీఎస్ ఈ ఈ నెల 23 నుంచి 200 కంపెనీలను తప్పనిసరి డీలిస్ట్ చేయనుంది. అంతేకాదు ఈ కంపెనీల ప్రమోటర్లను మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం విధించనుంది. డీలిస్ట్ కాబోయే కంపెనీల ప్రమోటర్లు ప్రజల వద్దనున్న వాటాలను స్వతంత్ర వ్యాల్యూయర్ ఖరారు చేసిన ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుందని బీఎస్ఈ తన నోటిఫికేషన్లో పేర్కొంది. డీలిస్ట్ కానున్న 200 కంపెనీల్లో 117 కంపెనీలు పదేళ్లకు పైగా సస్పెండ్‌లో ఉన్నవే. 28 స్టాక్స్ సైతం పదేళ్లుగా సస్పెన్షన్‌లోనే ఉన్నప్పటికీ లిక్విడేషన్‌లో ఉన్నాయి. వీటితోపాటు మరో 55 కంపెనీల షేర్లు కూడా డీలిస్ట్ అవుతాయి. డీలిస్ట్ కానున్న కంపెనీల్లో యూఫార్మా లేబరేటరీస్, అథెనా ఫైనాన్షియల్ సర్వీసెస్, మాగ్నస్ రబ్బర్ ఇండస్ట్రీస్, రాజస్థాన్ పాలిస్టర్స్, ట్రాన్స్‌పవర్ ఇంజనీరింగ్, డ్యుపాంట్ స్పోర్ట్స్ వేర్, డైనవోక్స్ ఇండస్ట్రీస్, జీడీఆర్ మీడియా ఉన్నా యి. షెల్ కంపెనీలపై సెబీ, స్టాక్ ఎక్సే్చంజ్‌లు చర్య లు చేపడుతున్న తరుణంలోనే ఈ కంపెనీలను డీలిస్ట్ చేయనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 331 అనుమానిత షెల్ కంపెనీల్లో ట్రేడింగ్ పరంగా ఆంక్షలకు సెబీ ఇటీవలే ఆదేశించిన విషయం తెలిసిందే. వీటిలో సుమారు పది కంపెనీల వరకు శాట్‌కు వెళ్లి సెబీ ఆదేశాలపై స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నాయి. -
నేటి నుంచి జూలై గోల్డ్ బాండ్ల ట్రేడింగ్
ముంబై: జూలై నెలలో జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లకు సంబంధించి ట్రేడింగ్ మంగళవారం నుంచీ స్టాక్ ఎక్సే్ఛంజీల్లో ప్రారంభమవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొం ది. ఆర్బీఐ సోమవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 6వ తేదీన ప్రభుత్వం 2017–18 సిరిస్ 2 సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రకటించింది. జూలై 10 నుంచి 14 వరకూ అమల్లో ఉన్న స్కీమ్‌కు సంబంధించి బాండ్లు జూలై 28న జారీ అయ్యాయి. 2015 నవంబర్ 5న తొలిసారిగా కేంద్రం గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ఆవిష్కరించింది. ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్‌ను తగ్గించడం, ఈ మొత్తాలను పొదుపులుగా మళ్లించి ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా చేయడం ఈ విధాన లక్ష్యం. జూలై సిరిస్‌కు ముందు, ప్రభుత్వం ఎనిమిది దఫాలుగా ఈ స్కీమ్‌ను ఆవిష్కరించింది. తద్వారా రూ.5,400 కోట్లు సమీకరించగలిగింది. బంగారం బాండ్లలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా కేంద్రం ఇటీవలే ఒక కీలక నిర్ణయమూ తీసుకుంది. సావరిన్ గోల్డ్ బాండ్లలో (ఎస్జీబీ) వార్షిక పెట్టుబడుల పరిమితిని భారీగా పెంచింది. ప్రస్తుతం 500 గ్రాముల మేరకు మాత్రమే పెట్టుబడి పెట్టే వీలుండగా... దీన్ని ఏకంగా 4 కిలోలకు పెంచింది. ఈ పథకం ద్వారా 2015–16, 2016–17లో రూ. 25,000 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యమైనా, రూ.4,769 కోట్లే ప్రభుత్వ ఖాతాలోకి వచ్చాయి. -
ట్రేడింగ్ ఇక 5 వరకూ?
♦ సమయం పెంచేందుకు ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలు రెడీ..! ♦ తమ వ్యాపారం సింగపూర్, దుబాయ్ ♦ ఎక్స్ఛేంజీలకు వెళ్లిపోతోందని ఆందోళన... ♦ సాయంత్రం 5 గంటల వరకూ పెంచుతామని ప్రకటించి వెనక్కితగ్గిన ఎంఎస్‌ఈఐ ♦ సెబీ నుంచి తుది అనుమతులు లేకపోవడమే కారణం దేశీ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లకు త్వరలో మరింత ఎక్కువ సమయం ట్రేడింగ్‌కు (షేర్ల కొనుగోలు, అమ్మకం లావాదేవీలు) అవకాశం లభిస్తుందా? తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. కొత్త స్టాక్ ఎక్సే్చంజ్ అయిన ఎస్ఎస్సీఐ(గతంలో దీని పేరు ఎంసీఎక్స్–ఎస్ఎక్స్)తో పాటు ప్రధాన ఎక్స్ఛేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు కూడా ట్రేడింగ్ వ్యవధిని పెంచడానికి సుముఖంగా ఉండటంతో దీనికి బలం చేకూరుతోంది. ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజీల్లో(ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3.30 వరకూ ట్రేడింగ్‌కు వీలుంది. మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు, షేర్ల ధరల్లో అవాంఛితమైన హెచ్చుతగ్గులను నివారించేందుకు ఉదయం ట్రేడింగ్ ప్రారంభానికి ముందు పావు గంటపాటు(అంటే 8.45 నుంచి 9 వరకూ) ప్రీ–ట్రేడింగ్ సెషన్‌ను ఎక్సే్ఛంజీలు నిర్వహిస్తున్నాయి. కాగా, ఇప్పుడు మూడు స్టాక్ ఎక్సే్ఛంజీలూ కూడా ట్రేడింగ్ వ్యవధిని సాయంత్రం 5 వరకూ పెంచుకోవాలని భావిస్తున్నాయి. ఒకవేళ ఈక్విటీ స్టాక్స్‌కు వీలుకాకపోతే కనీసం ఈక్విటీ డెరివేటివ్స్(ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ విభాగం)లోనైనా వ్యవధి పొడిగించుకోవాలనేది ఎక్సే్ఛంజీల యోచన. తక్కువ వ్యవధి, పన్నుల పరంగా సమస్యలు తక్కువగా ఉండటం కారణంగా విదేశీ ఎక్సే్ఛంజీలు.. ప్రధానంగా సింగపూర్, దుబాయ్‌లు పెద్దమొత్తంలో తమ వ్యాపారాన్ని(ట్రేడింగ్ వాల్యూమ్స్) లాగేసుకుంటున్నాయని ఎక్సే్ఛంజీలు పేర్కొంటున్నాయి. ముందే కూసిన ఎంఈసీఐ... తమ ఈక్విటీ నగదు విభాగం(షేర్లు)లో ట్రేడింగ్ ముగింపు సమయాన్ని ఇప్పుడున్న సాయంత్రం 3.30 నుంచి 5 వరకూ పెంచుతున్నట్లు ఎంఎస్‌ఈఐ ఈ నెల 4న(మంగళవారం) ప్రకటించింది. అయితే, కొద్దిసేపటి తర్వాత ప్రస్తుతానికి ఈ వ్యవధి పెంపును నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. అయితే, దీనికి కారణమేంటనేది తెలియజేయలేదు. మార్కెట్ వర్గాల సమాచారం మేరకు సెబీ నుంచి దీనిపై తగిన తుది అనుమతులేవీ రాకపోవడం వల్లే ఎంఈసీఐ వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది. కమోడిటీ ఎక్సే్ఛంజీలతోపాటు గుజరాత్ గిఫ్ట్ సిటీలో ఏర్పాటైన అంతర్జాతీయ ఎక్సే్ఛంజీలు(ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ, బీఎస్ఈ ఐఎన్ఎక్స్) 12 గంటల నుంచి 22 గంటల పాటు ట్రేడింగ్‌ను(ఈక్విటీ డెరివేటివ్స్, కమోడిటీస్, కరెన్సీ విభాగాల్లో) నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధాన ఎక్సే్ఛంజీల్లో ఈక్విటీ విభాగంలోనూ ట్రేడింగ్ సమయం పెంచాలనేది కొంతమంది మద్దతుదారుల వాదన. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆర్థిక, రాజకీయ, ఇతరత్రా సంఘటనలు, వెలువడే వార్తలకు అనుగుణంగా ఇన్వెస్టర్లకు మార్కెట్లో తగిన అవకాశాలను కల్పించేందుకువీలుగా అంతర్జాతీయంగా చాలా ఎక్సే్ఛంజీలు(దేశీయ లేదా విదేశీ ఇన్వెస్టర్లకు) ట్రేడింగ్‌కు అధిక సమయాన్ని అమలుచేస్తున్నాయి. బ్రోకర్ల నుంచి వ్యతిరేకత... ప్రధానంగా అంతర్జాతీయంగా ఏవైనా కీలక సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు సింగపూర్ ఎక్సే్ఛంజీ లోనో, గిఫ్ట్ సిటీలోని ఎక్సే్ఛంజీలోనో విదేశీ ఇన్వెస్టర్లు తమ పొజిషన్లలో రిస్క్‌ను తట్టుకోవడం కోసంహెడ్జింగ్ చేసుకోవడానికి అవకాశం లభిస్తోంది. అయితే, దేశీ రిటైల్ ఇన్వెస్టర్లు , మ్యూచువల్ ఫండ్లకు ఈ అవకాశం ఉండటం లేదని.. ఈ అసమానతలను తొలగించేందుకు మనకూ ట్రేడింగ్ వ్యవధిని పెంచాలని కోరుతున్నారు. అయితే, ఈ పెంపునకు ప్రధానంగా బ్రోకర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈక్విటీ మార్కెట్‌తో పోలిస్తే అధిక ట్రేడింగ్ వేళలు ఉన్న కమోడిటీ ఎక్సే్ఛంజీల్లో రిటైల్ కార్యకలాపాలు చాలా తక్కువన్న విషయాన్ని వారు ప్రధానంగా గుర్తుచేస్తున్నారు. ట్రేడింగ్ సమయాన్ని పెంచేందుకు తమకు ఎలాంటి నిర్వహణపరమైన ఇబ్బందులూ లేవని అయితే, బ్రోకర్ల నుంచి వ్యతిరేక త కారణంగానే తాము దీన్ని అమలుచేయలేకపోతున్నామని ఎన్ఎస్ఈ వర్గాలు చెబుతున్నాయి. ‘నిర్వహణ వ్యయా లతో పోలిస్తే ప్రయోజనాలు భారీగా ఉంటాయని అనుకుంటే ట్రేడింగ్ సమయాన్ని పొడిగించవచ్చు. అయితే, ఇప్పుడు అలాంటి పరిస్థితేమీ లేదు’ అని బీఎస్ఈ బ్రోకర్స్ ఫోరమ్ చర్మన్ ఉత్తమ్ బాగ్రి పేర్కొన్నారు. ట్రేడింగ్ వ్యవధిని కొద్ది గంటల పాటు పెంచినంతమాత్రాన వాల్యూమ్స్ పెరిగేందుకు అవకాశాలేవీ లేవని ఆయన వ్యాఖ్యానించారు. 2009లో కాస్త పెంచారు... దేశీయ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సమయాల్లో చివరిసారిగా 2009లో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పట్లో ఉదయం 9.55 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకూ ట్రేడింగ్ జరిగేది. అయితే, సెబీ 2009 అక్టోబర్‌లో ఎక్సే్ఛంజీల ట్రేడింగ్ సమాయాన్ని రెండున్నర గంటల మేర పెంచుకునేందుకు(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ) ఆమోదం తెలిపింది. అయితే, 5 వరకూ పెంచేందుకు బ్రోకర్లు అప్పుడు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో వారి అభిప్రాయం మేరకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు అదే నెలలో ట్రేడింగ్ వ్యవధిని దాదాపు గంటపాటు మాత్రమే పెంచాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 వరకూ ట్రేడింగ్‌ను(ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్) అమల్లోకి తీసుకొచ్చాయి. ఇదే విధానం ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే, కరెన్సీ డెరివేటివ్స్‌లో మాత్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ ప్రస్తుతం ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు ఎంఎస్‌ఈఐ గనుక ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 వరకూ పెంచితే... ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు కూడా దీన్ని తప్పనిసరిగా అమలుచేయాల్సిన పరిస్థితి ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
28న ప్రత్యేక ధన్తేరస్ ట్రేడింగ్...
ధనతేరాస్(ఈ నెల 28న) రోజున గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ బాండ్‌ల్లో ట్రేడింగ్‌ను సాయంత్రం ఏడు గంటలవరకూ నిర్వహించాలని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్, బీఎస్ఈ నిర్ణయించింది. సాధారణంగా గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్), సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్జీబీ)ల్లో లైవ్ ట్రేడింగ్ ఉదయం గం,9.15 నిమిషాలకు ప్రారంభమై, మధ్యాహ్నం గం,3.30 వరకూ కొనసాగుతుంది. కానీ ధన్తేరస్ రోజున ఈ లైవ్ ట్రేడింగ్ మళ్లీ సాయంత్రం గం.4.30 నుంచి ప్రారంభమై, రాత్రి 7 గంటల వరకూ కొనసాగుతుందని బీఎస్ఈ తెలిపింది. 30న ముహూరత్ ట్రేడింగ్ దీపావళి, ఈ నెల 30 ఆదివారం రోజున ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్‌ను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు నిర్వహించనున్నాయి. సాయంత్రం గం.6.30 నుంచి ప్రారంభమై రాత్రి గం,7.30 వరకూ గంట పాటు ఈ ముహూరత్ ట్రేడింగ్ జరుగుతుంది. ఈక్విటీ డెరివేటివ్‌లు, కరెన్సీ డెరివేటివ్‌లు, ఈక్విటీ, ఎస్ఎల్బీ(సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్) సెగ్మెంట్లలో బీఎస్ఈ, ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్‌లు కరెన్సీ డెరివేటివ్‌లు, ఫ్యూచర్స్, ఆప్షన్స్‌ల్లో ఎన్ఎస్ఈ ట్రేడింగ్ నిర్వహిస్తాయి. -
అనుబంధ కంపెనీల్లో ల్యాంకో పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అనుబంధ కంపెనీల మూలధన అవసరాల కోసం ల్యాంకో ఇన్ఫ్రాటెక్ రూ.6,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. సెక్యూరిటీస్ రూపంలో రూ.6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వాటాదారుల అనుమతి కోరనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఈ నెలలలో జరిగే వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించాల్సి ఉంది. మార్చి 31, 2015 నాటికి ఈ అనుబంధ కంపెనీల్లో రూ.10,959 కోట్లు సెక్యూరిటీస్ రూపంలో ఇన్వెస్ట్ చేసింది. -
బడ్జెట్ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్
ముంబై: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28, శనివారం నాడు బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది. శనివారం స్టాక్ మార్కెట్‌కు సెలవు అయినప్పటికీ, ఆరోజు స్టాక్ మార్కెట్ పనిచేస్తుందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. అన్ని రోజులాగానే ఆ రోజు కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3.30 వరకూ స్టాక్ ఎక్స్ఛేంజ్లు పనిచేస్తాయని పేర్కొంది. బడ్జెట్ రోజు స్టాక్ ఎక్స్ఛేంజ్లను తెరచే ఉంచాలని బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెబీ ఆదేశాలిచ్చింది. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపే పలు అంశాలు బడ్జెట్లో ఉంటాయని, అందుకని ఆ రోజు స్టాక్ ఎక్స్ఛేంజ్లు తెరచే ఉంచాలని బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలతో సహా ట్రేడర్లు సెబీని కోరారు. కాగా 1991 తర్వాత, 1992, 1993,1999 ... ఈ మూడు సంవత్సరాల్లో శనివారం రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ మూడు రోజుల్లో కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిర్వహించారు. సెబీ ఉత్తర్వుల నేపథ్యంలో స్టాక్ ఎక్స్ఛేంజ్లను బడ్జెట్ రోజు తెరిచే ఉంచుతామని బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు వెల్లడించాయి. ఆ రోజు కరెన్సీ డెరివేటివ్, డెట్ సెగ్మెంట్లలో మాత్రం ట్రేడింగ్ ఉండదని ఎన్ఎస్ఈ తెలిపింది. కాగా గత మూడు సంవత్సరాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజుల్లో స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. -
4 రోజుల లాభాలకు బ్రేక్
కొద్ది రోజులుగా కొత్త రికార్డులు సృష్టిస్తూ సాగుతున్న స్టాక్ మార్కెట్లు బుధవారం వెనకడుగు వేశాయి. రోజుమొత్తం బలహీనంగా కదిలి చివరకు స్వల్ప స్థాయిలో ముగిశాయి. దీంతో నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 79 పాయింట్లు నష్టపోయి 24,298 వద్ద ముగియగా, నిఫ్టీ 23 పాయింట్లు క్షీణించి 7,253 వద్ద నిలిచింది. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 562 పాయింట్లు పుంజుకున్న సంగతి తెలిసిందే. గరిష్ట స్థాయిలవద్ద ఆపరేటర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టడంతో మార్కెట్లు నీరసించినట్లు నిపుణులు తెలిపారు. కాగా, చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగింది. వెరసి మార్కెట్లు నష్టపోయినప్పటికీ బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5% స్థాయిలో లాభపడ్డాయి. ఎఫ్ఐఐల అమ్మకాలు మంగళవారం ఉన్నట్టుండి రూ. 105 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 266 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీ ఫండ్స్ సైతం రూ. 439 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. ఇక బీఎస్ఈలో క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాలు 2-1% మధ్య తిరోగమించగా, రియల్టీ 2% బలపడింది. బ్లూచిప్స్‌లో ఎస్బీఐ, యాక్సిస్ 2.5% స్థాయిలో నష్టపోగా, భెల్, ఎల్అండ్టీ, భారతీ సైతం 2% చొప్పున డీలాపడ్డాయి. అయితే మరోవైపు బజాజ్ ఆటో 5% జంప్‌చేసింది. ఈ బాటలో హిందాల్కో, ఎన్టీపీసీ, సెసాస్టెరిలైట్, కోల్ ఇండియా 2.5-1.5% మధ్య పుంజుకున్నాయి. ఎస్సార్ షేర్ల హవా మిడ్ క్యాప్స్‌లో ఎస్సార్ పోర్ట్స్, ఎస్సార్ షిప్పింగ్, ఎస్సార్ ఆయిల్ 16% చొప్పున దూసుకెళ్లగా, నవభారత్ వెంచర్స్, హెచ్ఎంటీ, ఆప్టో సర్క్యూట్స్ 20% అప్పర్ సీలింగ్‌ను తాకాయి. ఈ బాటలో హెచ్‌సీఎల్ ఇన్ఫో, జిందాల్ స్టెయిన్లెస్, జామెట్రిక్, టొరంట్ పవర్, ఐఎఫ్సీఐ, ఎంఎంటీసీ, పెనిన్సులార్, ఐనాక్స్, సి.మహీంద్రా, ఎంఆర్‌పీఎల్, గీతాంజలి, ఆర్సీఎఫ్, ఎస్కేఎస్ 15-10% మధ్య పురోగమించాయి. -
అన్‌లిస్టెడ్ కంపెనీలు విదేశాలలో లిస్ట్‌కావచ్చు
ముంబై: అన్‌లిస్టెడ్ కంపెనీలు సరాసరి విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయ్యేందుకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అనుమతించింది. తద్వారా విదేశీ నిధులను సమీకరించేందుకు అవకాశాలను కల్పించింది. అంతేకాకుండా విదేశీ రుణాలను చెల్లించేందుకు కూడా ఈ నిధులను వినియోగించుకునేందుకు దేశీయ అన్‌లిస్టెడ్ కంపెనీలకు వీలుచిక్కనుంది. ప్రభుత్వం గరిష్టస్థాయి కరెంట్ ఖాతాలోటుతో సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆర్బీఐ తాజా చర్యలకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఇంతవరకూ ఉన్న నిబంధనల ప్రకారం అన్‌లిస్టెడ్ కంపెనీలు విదేశాలలో ప్రత్యక్షంగా లిస్ట్అయ్యేందుకు వీలులేదు. ఇందుకు ముందుగా దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కావలసి ఉంటుంది. అయితే ఈ నిబంధనల తాజా సమీక్షలో భాగంగా ఆర్బీఐ విదేశాలలో ప్రత్యక్షంగా లిస్ట్అయ్యేందుకు అన్‌లిస్టెడ్ కంపెనీలను అనుమతిం చేందుకు నిర్ణయించింది. ఇందుకు వీలుగా విడుదల చేసిన నోటిఫికేషన్లో తొలి దశకింద రెండేళ్ల గడువును విధించింది. పరిశీలనార్థం ఈ గడువును విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే సెబీతో ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్న ఐవోఎస్‌సీవో, ఎఫ్ఏటీఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్గనైజేషన్ల ద్వారా మాత్రమే లిస్టయ్యేందుకు కంపెనీలను అనుమతిస్తారు. కాగా, నిధులను సమీకరించాక విదేశాలలో వాటిని వినియోగించని పక్షంలో, వాటిని 15 రోజుల్లోగా దేశీయంగా వాణిజ్య బ్యాంకులలో జమ చేయాల్సి ఉంటుంది.