ముంబై: వచ్చే ఆర్ధిక సంవత్సరానికి (2025–26) గాను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఆ రోజు శనివారం అయినా కూడా ఎక్స్ఛేంజీలు పనిచేస్తాయని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు తెలిపాయి.
ఉదయం 9:15 నుంచి సాయంత్రం 3.30 గంటల మధ్య ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు ఇరు ఎక్స్ఛేంజీలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. గతంలో 2020 ఫిబ్రవరి 1న, 2015 ఫిబ్రవరి 28న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు పని చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment