2న అలైడ్ బ్లెండర్స్, 3న వ్రజ్ ఐరన్ లిస్టింగ్
3నే ఎమ్‌క్యూర్ ఫార్మా, బన్సల్ వైరింగ్ ఇష్యూలు షురూ
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో 4 ఐపీవోలు హడావిడి చేయనున్నాయి. గత వారమే ఇష్యూలు పూర్తి చేసుకున్న అలైడ్ బ్లెండర్స్ 2న, వ్రజ్ ఐరన్ 3న స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నాయి. ఇక మరోపక్క ఎమ్‌క్యూర్ ఫార్మాస్యూటికల్స్, బన్సల్ వైరింగ్ పబ్లిక్ ఇష్యూలు 3నే ప్రారంభంకానున్నాయి. ఆఫీసర్స్ చాయిస్ విస్కీ బ్రాండ్ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ రూ. 281 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 1,500 కోట్లు అందుకుంది.
స్పాంజ్ ఐరన్, టీఎంటీ బార్ల తయారీ కంపెనీ వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ షేరుకి రూ. 207 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 171 కోట్లు అందుకుంది. జూలై 5న ముగియనున్న స్టీల్ వైర్ల తయారీ కంపెనీ బన్సల్ వైర్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 243–256 ధరల శ్రేణిని ప్రకటించింది. మొత్తం రూ. 745 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయడం ద్వారా రూ. 745 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.
రిటైలర్లు కనీసం 58 షేర్లకు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఎమ్‌క్యూర్ ఫార్మా పబ్లిక్ ఇష్యూకి రూ. 960–1008 ధరల శ్రేణిని ప్రకటించింది. 5న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.14 కోట్ల షేర్ల(రూ. 1,152 కోట్ల విలువ)ను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,952 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. రిటైలర్లు కనీసం 14 షేర్లకు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment