28న ప్రత్యేక ధన్తేరస్ ట్రేడింగ్...
ధనతేరాస్(ఈ నెల 28న) రోజున గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ బాండ్‌ల్లో ట్రేడింగ్‌ను సాయంత్రం ఏడు గంటలవరకూ నిర్వహించాలని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్, బీఎస్‌ఈ నిర్ణయించింది. సాధారణంగా గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్), సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్‌జీబీ)ల్లో లైవ్ ట్రేడింగ్ ఉదయం గం,9.15 నిమిషాలకు ప్రారంభమై, మధ్యాహ్నం గం,3.30 వరకూ కొనసాగుతుంది. కానీ ధన్‌తేరస్ రోజున ఈ లైవ్ ట్రేడింగ్ మళ్లీ సాయంత్రం గం.4.30 నుంచి ప్రారంభమై, రాత్రి 7 గంటల వరకూ కొనసాగుతుందని బీఎస్‌ఈ తెలిపింది.
30న ముహూరత్ ట్రేడింగ్
దీపావళి, ఈ నెల 30 ఆదివారం రోజున ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్‌ను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు నిర్వహించనున్నాయి. సాయంత్రం గం.6.30 నుంచి ప్రారంభమై రాత్రి గం,7.30 వరకూ గంట పాటు ఈ ముహూరత్ ట్రేడింగ్ జరుగుతుంది. ఈక్విటీ డెరివేటివ్‌లు, కరెన్సీ డెరివేటివ్‌లు, ఈక్విటీ, ఎస్‌ఎల్‌బీ(సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్) సెగ్మెంట్లలో బీఎస్‌ఈ, ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్‌లు కరెన్సీ డెరివేటివ్‌లు, ఫ్యూచర్స్, ఆప్షన్స్‌ల్లో ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్ నిర్వహిస్తాయి.