బడ్జెట్ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ | Stock markets to be open on Budget day | Sakshi
Sakshi News home page

బడ్జెట్ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్

Published Sat, Feb 21 2015 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

Stock markets to be open on Budget day

ముంబై: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28, శనివారం నాడు బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నది. శనివారం స్టాక్ మార్కెట్‌కు సెలవు అయినప్పటికీ, ఆరోజు స్టాక్ మార్కెట్ పనిచేస్తుందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. అన్ని రోజులాగానే ఆ రోజు కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3.30 వరకూ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు పనిచేస్తాయని పేర్కొంది. బడ్జెట్ రోజు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లను తెరచే ఉంచాలని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెబీ ఆదేశాలిచ్చింది.

స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపే పలు అంశాలు బడ్జెట్‌లో ఉంటాయని, అందుకని ఆ రోజు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు తెరచే ఉంచాలని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలతో సహా ట్రేడర్లు సెబీని కోరారు. కాగా 1991 తర్వాత, 1992, 1993,1999 ... ఈ మూడు సంవత్సరాల్లో శనివారం రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ మూడు రోజుల్లో కూడా స్టాక్ మార్కెట్‌లో  ట్రేడింగ్ నిర్వహించారు. సెబీ ఉత్తర్వుల నేపథ్యంలో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లను బడ్జెట్ రోజు తెరిచే ఉంచుతామని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు వెల్లడించాయి. ఆ రోజు కరెన్సీ డెరివేటివ్, డెట్ సెగ్మెంట్లలో మాత్రం ట్రేడింగ్ ఉండదని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. కాగా గత మూడు సంవత్సరాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజుల్లో స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement