భారత్‌కు చెందిన 19 మంది మత్స్యకారులను శనివారం రాత్రి పొద్దుపోయాక శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారు.
కొలంబో : భారత్‌కు చెందిన 19 మంది మత్స్యకారులను శనివారం రాత్రి పొద్దుపోయాక శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. తమ సముద్ర జలాల్లో చేపలు పడుతున్నారనే అభియోగంతో వీరిని అరెస్ట్ చేసి ఐదు బోట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండుదేశాల మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందానికి విరుద్ధంగా భారత మత్స్యకారులు తమ సరిహద్దుల్లోకి ప్రవేశించారని శ్రీలంక నేవీ కమాండర్ కోసల వర్ణకుల సూరియ తెలిపారు.
ఇటీవలి చర్చల తర్వాత శ్రీలంక అరెస్ట్ చేసిన భారత మత్స్యకారుల సంఖ్య 57కు చేరింది. రామేశ్వరం,జగతపట్నం, కొత్తయిపట్నంల నుంచి బయలుదేరిన నాలుగువేల మంది మత్స్యకారుల్లో ఈ 19 మంది కూడా ఉన్నారని తమిళనాడు అధికారులు తెలిపారు. శ్రీలంక అధికారులు 20 బోట్ల నుంచి వలలను కోసివేశారని వారు చెప్పారు.