
ఆఖరి వన్డే కూడా శ్రీలంకదే
భారత్ చేతిలో పరాభవం అనంతరం సొంతగడ్డపై శ్రీలంక సత్తా చాటింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఏడు వన్డేల సిరీస్‌ను 5-2తో ముగించింది.
కొలంబో: భారత్ చేతిలో పరాభవం అనంతరం సొంతగడ్డపై శ్రీలంక సత్తా చాటింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఏడు వన్డేల సిరీస్‌ను 5-2తో ముగించింది. ఇప్పటికే సిరీస్ గెలుచుకున్న లంక... మంగళవారం జరిగిన చివరిదైన ఏడో వన్డేలో 87 పరుగుల తేడాతో నెగ్గింది.
కెరీర్‌లో 300వ వన్డే ఆడిన దిల్షాన్ (124 బంతుల్లో 101; 9 ఫోర్లు, 1 సిక్స్) 18వ సెంచరీ సాధించాడు. ముందుగా శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 302 పరుగులు చేసింది. చండీమల్ (55), తిసార పెరీరా (54) కూడా రాణించారు. లంక తరఫున 9వేల పరుగులు పూర్తిచేసుకున్న ఐదో ఆటగాడిగా దిల్షాన్ నిలిచాడు. అనంతరం ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ (99 బంతుల్లో 80; 5 ఫోర్లు) మినహా ఇతర ఆటగాళ్లంతా విఫలమయ్యారు. లంక దిగ్గజాలు జయవర్ధనే, సంగక్కరలకు సొంతగడ్డపై ఇదే ఆఖరి వన్డే. వచ్చే ప్రపంచ కప్ తర్వాత వీరు రిటైర్ కానున్నారు.