కొలంబో: శ్రీలంక వరుస పేలుళ్లతో అతలాకుతలమవుతోంది. గురువారం ఉదయం మరో బాంబు పేలుడు సంభవించింది. శ్రీలంక రాజధాని కొలంబోకి 40కిలోమీటర్ల దూరంలో పుగోడా జిల్లాలో జరిగిన ఈ పేలుడు మెజిస్ట్రేట్ కోర్టుకు చెందిన ఖాళీ ప్రదేశంలో సంభవించిన ఈ పేలుడుతో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఉదయం 9.30కు బాంబు పేలిందని, ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని శ్రీలంక పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. గత ఆదివారం జరిగిన ఎనిమిది బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 359కి పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment