కొలంబో: బంగ్లాదేశ్‌లో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నా వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ వేదికలో మార్పు లేదని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) ప్రకటించింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్‌లోనే ఈ టోర్నీ జరుగుతుందని ఏసీసీ సీఈఓ అష్రాఫుల్ హఖ్ స్పష్టం చేశారు.
ఆసియా కప్‌కు ప్రత్యామ్నాయ వేదికను నిర్ణయించేందుకు ఏసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ శనివారం ఇక్కడ సమావేశమైంది. వేదికలో ఎలాంటి మార్పూ చేయని కమిటీ ఆసియా కప్‌లో తొలి సారి అఫ్ఘానిస్థాన్ జట్టుకు కూడా టోర్నీలో పాల్గొనే అవకాశం కల్పించింది. వన్డే క్రికెట్‌లో ఆ జట్టు భారత్, పాక్, శ్రీలంకలాంటి పటిష్ట జట్లతో పోటీ పడనుండటం ఇదే తొలిసారి. 2015లో జరిగే వన్డే వరల్డ్ కప్‌కు కూడా అఫ్ఘాన్ అర్హత సాధిం చింది.
ఫిబ్రవరి 24 నుంచి మార్చి 7 వరకు జరిగే ఆసియా కప్‌లో మొత్తం 11 మ్యాచ్‌లను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోనే నిర్వహిస్తారు. మరో వైపు భద్రతపై భరోసా ఉండటంతో బంగ్లాలో శ్రీలంక పర్యటన కూడా కొనసాగుతుందని... గతంలో ఇలాంటి ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న తమ దేశం బంగ్లాకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని లంక బోర్డు కార్యదర్శి నిషాంత రణతుంగ వెల్లడించారు.
బంగ్లాదేశ్‌లోనే ఆసియా కప్
Published Sun, Jan 5 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement