
కొలంబో : శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ మెండిస్‌ను ఆదివారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. కొలంబో శివారులోని పనాదుర వద్ద కుశాల్ మెండిస్ కారు అదుపుతప్పి 74 ఏళ్ల వృద్ధుడ్ని ఢీకొనగా.. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. యాక్సిడెంట్ సమయంలో కుశాల్ కారుని మితిమీరిన వేగంతో నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. మెండిస్‌పై కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా శ్రీలంక క్రికెట్ జుట్టులో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్న కుశాల్ ఇప్పటివరకు 76 వన్డేల్లో 2,167 పరుగులు, 44 టెస్టుల్లో 2,995 పరుగులు, 26 టీ20ల్లో 484 పరుగులు సాధించాడు.(బెయిర్‌స్టోకు దక్కని చోటు)