కొలంబో: ఈ ఏడాది బంగ్లాదేశ్‌లో జరగాల్సిన ఆసియాకప్ టి20 ప్రపంచకప్‌పై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో ఈ రెండు మెగా టోర్నీలకు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని శ్రీలంక బోర్డు ప్రకటించింది. ఢాకాలో జరుగుతున్న హింస కారణంగా బంగ్లాదేశ్ వెళ్లేందుకు చాలా క్రికెట్ జట్లు ఆసక్తి చూపడం లేదు.
ఫిబ్రవరి 24 నుంచి మార్చి 7 వరకు ఆసియాకప్, మార్చి 16 నుంచి ఏప్రిల్ 6 వరకు టి20 ప్రపంచకప్ బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉన్నాయి. శనివారం కొలంబోలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీలంక బోర్డు ఈ ప్రకటన చేసింది. ఒకవేళ ఆసియాకప్ వేదిక మారిస్తే... టి20 ప్రపంచకప్ వేదిక కూడా మారే అవకాశం ఉందని ఐసీసీ వర్గాలు తెలిపాయి.
మేం ఆతిథ్యమిస్తాం
Published Sat, Jan 4 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement
Advertisement