Mega tournment
-
ఆడుదాం ఆంధ్ర, ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం ..ఇంకా ఇతర అప్డేట్స్
-
గుంటూరులో ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించనున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రపంచ పోరుకు కివీస్ రెడీ
వెల్లింగ్టన్: ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా విజేతగా నిలవని న్యూజిలాండ్ ఈసారి మెగా టోర్నీ కోసం అందరికంటే ముందుగా సమరభేరి మోగించింది. బరిలో ఉన్న పది జట్ల ప్రకటనకు ఈ నెల 23 కటాఫ్ తేదీ కాగా ఇరవై రోజుల ముందుగానే తమ 15 మంది టీమ్‌తో కివీస్ సిద్ధమైంది. రెండో స్పిన్నర్‌గా లెగ్‌స్పిన్నర్ ఇష్ సోధికి చోటు దక్కగా... ఇప్పటి వరకు ఒక్క వన్డే కూడా ఆడని కీపర్ టామ్ బ్లండెల్ నేరుగా వరల్డ్ కప్‌తోనే అరంగేట్రం చేయనున్నాడు. ఇటీవలి వరకు జట్టులో భాగంగా ఉన్న కీపర్ టిమ్ సీఫెర్ట్ గాయపడటంతో అతనికి అవకాశం లభించింది. మిగతా 13 మంది ఆటగాళ్ల విషయంలో కివీస్ సెలక్టర్లు ఎలాంటి సంచలనాలకు అవకాశం ఇవ్వలేదు. గత కొంత కాలంగా జట్టు సభ్యులుగా నిలకడగా రాణిస్తున్నవారినే ఎంపిక చేసినట్లు కోచ్ గ్యారీ స్టీడ్ చెప్పారు. సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌కు ఇది వరుసగా నాలుగో ప్రపంచ కప్ కావడం విశేషం. కివీస్ జట్టు ఇదే... బ్యాట్స్‌మెన్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, హెన్రీ నికోల్స్, రాస్ టేలర్, టామ్ లాథమ్, కొలిన్ మున్రో, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్) పేసర్లు: ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ స్పిన్నర్లు: మైకేల్ సాన్‌ట్నర్, ఇష్ సోధి ఆల్‌రౌండర్లు: జిమ్మీ నీషమ్, కొలిన్ గ్రాండ్‌హోమ్. -
‘జి’లో ఈజీ కాదు!
గ్రూప్-జి విశ్లేషణ జర్మనీ, పోర్చుగల్, ఘనా, అమెరికా ప్రతి ప్రపంచకప్‌లో ఓ గ్రూప్ ఉంటుంది. అందులో అందరూ ఉద్ధండపిండాలే ఉంటాయి. దానినే ‘గ్రూప్ ఆఫ్ డెత్’ అని పిలుస్తారు. నాకౌట్‌కు చేరుకునే అర్హత ఈ నాలుగు జట్లకూ ఉంటుంది. అయితే క్లిష్టమైన ‘డ్రా’ కారణంగా రెండు జట్లకు నిరాశ తప్పదు. పరిశీలకులు ఈసారి ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా ‘జి’ గ్రూప్‌ను పరిగణిస్తున్నారు. టైటిల్ ఫేవరెట్ జర్మనీ, పోర్చుగల్, అమెరికా, ఘనా జట్లు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. ఈ నాలుగు జట్ల మధ్య జరిగే ప్రతీ మ్యాచ్ కీలకమే. ఏ జట్టయినా ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు. మాజీ చాంపియన్ జర్మనీ ‘గ్రూప్ టాప్’గా నిలిచే అవకాశం ఉంది. 2006, 2010 ప్రపంచకప్‌లతో పాటు 2008, 2012 యూరో కప్‌లలో కనీసం సెమీఫైనల్‌కు చేరిందంటే ఈ జట్టు సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచకప్ గెలిచి 14 ఏళ్లు కావడంతో మరోసారి అద్భుతమైన ఆటతీరును కనబరిచి నాలుగోసారి టైటిల్ అందుకోవాలని పట్టుదలగా ఉంది. ప్రపంచకప్ ప్రదర్శన: ఈ మెగా టోర్నీలో అత్యధిక టైటిళ్లు సాధించిన బ్రెజిల్ (5 సార్లు), ఇటలీ (4 సార్లు) తర్వాతి స్థానం జర్మనీదే. ఇప్పటిదాకా మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన జర్మనీ (1954, 1974, 1990) నాలుగుసార్లు రన్నరప్ ట్రోఫీని అందుకుంది. నాలుగుసార్లు మూడో స్థానంలో, ఒకసారి నాలుగో స్థానంలో నిలిచింది. మూడుసార్లు మినహాయిస్తే ఆ జట్టు అంచనాలకు తగ్గట్లుగానే తన ఆటతీరును ప్రదర్శించింది. మొత్తానికి 17 సార్లు ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన ఈ మాజీ చాంపియన్ చివరిసారిగా 1990లో విజేతగా నిలిచింది. 18వ సారి ప్రపంచకప్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. అర్హత సాధించారిలా: క్వాలిఫయింగ్‌లో జర్మనీ అద్భుతంగా ఆడింది. యూరోప్ రీజియన్‌లోని గ్రూప్ ‘సి’లో జర్మనీ 10 మ్యాచ్‌ల్లో 28 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 9 మ్యాచ్‌ల్లో గెలిచిన జర్మనీ కేవలం ఒకే మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఈ గ్రూప్‌లో ఓటమెరుగని జట్టు జర్మనీయే. కీలక ఆటగాళ్లు: గోల్కీపర్లలో నంబర్‌వన్‌గా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న మాన్యువల్ న్యూయర్ ప్రపంచకప్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఫుల్‌బ్యాక్ ఫిలిప్ లామ్, బాస్టియన్ ష్వీన్స్టీగర్ చాలా కాలం కిందటే అంతర్జాతీయ సాకర్‌లో ఖ్యాతిని ఆర్జించారు. మీసట్ ఒజిల్, థామస్ ముల్లర్, పొడోల్‌స్కీ జట్టుకు ఆయువుపట్టు లాంటి వాళ్లు. ఇక యువ ఆటగాళ్లు మార్కో రియస్, ఆండ్రీ షురెల్, టోనీ క్రూస్, మారియో గోట్జే తమ సత్తా చాటుతున్నారు. కోచ్: జోకిమ్ లో; అంచనా: ఫైనల్ చేరుకునే అవకాశం. ఘనా ఫిఫా ర్యాంకుల్లో ఘనాది 37వ స్థానం... ఈ ర్యాంకును చూసిన వారెవరైనా ఈ గ్రూప్‌లో ఉన్న ఘనాను సాధారణంగా తక్కువగా ఉంచనా వేస్తారు. అయితే గత రెండు ప్రపంచకప్‌లో ఘనా ఆకట్టుకునే స్థాయిలో ఆడింది. కానీ ఇటీవలి కాలంలో ఈ జట్టు ఆటతీరు నామమాత్రంగా ఉంది. ప్రపంచకప్ ప్రదర్శన: 2006 ప్రపంచకప్‌లో ఘనా తొలిసారిగా బరిలోకి దిగి రెండో రౌండ్‌కు చేరింది. 2010లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అర్హత సాధించారిలా: క్వాలిఫయింగ్‌లో భాగంగా గ్రూప్ ‘డి’లో ఘనా ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి ప్లే ఆఫ్‌కు చేరింది. ఈజిప్టుతో జరిగిన ప్లే ఆఫ్ తొలి మ్యాచ్‌లో ఘనా 6-1తో గెలవగా.. రెండో మ్యాచ్‌లో 1-2తో ఓడింది. గోల్స్ ఆధారంగా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. కీలక ఆటగాళ్లు: మైకేల్ ఎస్సైన్, ముంతారి, ఆండ్రీ అయెవ్, క్వాడ్వో అసమో, కెవిన్ ప్రిన్స్ బోటింగ్, అసమో గ్యాన్లు ప్రత్యర్థి అవకాశాలను దెబ్బ తీయడంలో ఎక్స్పర్ట్స్. కోచ్: క్వెసి అప్యా అంచనా: పోర్చుగల్, అమెరికాలపై నెగ్గితే నాకౌట్‌కు చేరుతుంది. అమెరికా అమెరికా ఇటీవలి కాలంలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. జర్మనీ మాజీ ప్లేయర్ జుర్గెన్ క్లిన్స్మన్ కోచ్‌గా ఉండటం అమెరికాకు కలి సొచ్చే అంశం. ప్రపంచకప్ ప్రదర్శన: అమెరికా ఇప్పటిదాకా తొమ్మిదిసార్లు ప్రపంచకప్‌లో పాల్గొంది. అయితే ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవలేకపోయింది. ఫిఫా తొలి ప్రపంచకప్ (1930)లో అమెరికా సెమీస్‌కు చేరి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. గత ప్రపంచకప్‌లో అమెరికా ప్రి క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది. అర్హత సాధించారిలా: క్వాలిఫయింగ్ తుది రౌండ్‌ను ఓటమితో మొదలుపెట్టిన అమెరికా... ఆవెంటనే కోలుకుంది. ఆ తర్వాత ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా సత్తా చాటింది. మొత్తానికి యూఎస్ఏ 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, ఒక డ్రాతో 22 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. కీలక ఆటగాళ్లు: రొనాల్డో(పోర్చుగల్), ఒజిల్ (జర్మనీ) లాంటి ఆటగాళ్లు ఈ జట్టుకు లేకపోయినా... గ్రూప్ స్టేజ్‌లో ప్రత్యర్థికి షాకిచ్చే సత్తా అమెరికాకు ఉంది. లాండన్ డొనొవా, క్లయింట్ డెంప్సే, జోజి ఆల్టిడోర్, ఎడ్డి జాన్సన్, మైకేల్ బ్రాడ్లే జట్టులో కీలక ఆటగాళ్లు. కోచ్: జుర్గెన్ క్లిన్స్మన్ అంచనా: గ్రూప్ దశలో ఆడే మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు తప్పనిసరి. -
ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహణపై ఆందోళన
రియో: ఫుట్‌బాల్ ప్రపంచ కప్.. ఎప్పుడెప్పుడా అని విశ్వవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా ఆతృతగా ఈ మెగా టోర్నీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక టోర్నీ జరిగే బ్రెజిల్లోనైతే ఈ జోరు మరింతగా ఉంది. అయితే ఇదంతా ఒకవైపే.. మరోవైపున ఈ వర్ధమాన దేశంలో ఇంత భారీ ఖర్చుతో టోర్నమెంట్ నిర్వహించడం అవసరమా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అంతేగాకుండా ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చి శాంతి భద్రతల సమస్యగా మారింది. శుక్రవారం ఇదే కారణంగా వేలాది మంది నిరసనకారులు మ్యాచ్‌లు జరిగే సావో పాలో, రియో నగరాల్లోని రోడ్ల పైకి వచ్చారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. దీనికి ప్రతిగా యువకులు పోలీసులపైకి రాళ్లు విసరడంతోపాటు టైర్లను కాల్చుతూ రోడ్లను మూసివేశారు. బ్రెజిల్ ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమని, ఇక్కడ పేదరికం కూడా ఎక్కువగానే ఉందని, ఇలాంటి స్థితిలో 15 బిలియన్ల డాలర్ల (రూ.8 లక్షల 78 వేల కోట్లు) ఖర్చుతో ప్రపంచకప్ ఫుట్‌బాల్‌ను నిర్వహించడం దేనికని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యయాన్ని ఇతర అవసరాలకు, గృహ నిర్మాణాలకు ఖర్చు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. -
మేం ఆతిథ్యమిస్తాం
కొలంబో: ఈ ఏడాది బంగ్లాదేశ్‌లో జరగాల్సిన ఆసియాకప్ టి20 ప్రపంచకప్‌పై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో ఈ రెండు మెగా టోర్నీలకు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని శ్రీలంక బోర్డు ప్రకటించింది. ఢాకాలో జరుగుతున్న హింస కారణంగా బంగ్లాదేశ్ వెళ్లేందుకు చాలా క్రికెట్ జట్లు ఆసక్తి చూపడం లేదు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 7 వరకు ఆసియాకప్, మార్చి 16 నుంచి ఏప్రిల్ 6 వరకు టి20 ప్రపంచకప్ బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉన్నాయి. శనివారం కొలంబోలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీలంక బోర్డు ఈ ప్రకటన చేసింది. ఒకవేళ ఆసియాకప్ వేదిక మారిస్తే... టి20 ప్రపంచకప్ వేదిక కూడా మారే అవకాశం ఉందని ఐసీసీ వర్గాలు తెలిపాయి. -
సొంతగడ్డపై మెరుస్తారా?
న్యూఢిల్లీ: నేటి (శుక్రవారం) నుంచి జరిగే జూనియర్ ప్రపంచకప్ హాకీలో భారత కుర్రాళ్లు సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో ఈనెల 15 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో 16 జట్లు పాల్గొననున్నాయి. మొత్తం జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. జర్మనీ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతోంది. ఇక సొంత అభిమానుల మద్దతుతో పాటు ఒత్తిడి కూడా అధికంగానే ఉండడంతో ఈ టోర్నీలో మన్‌ప్రీత్ సింగ్ సేన ఏమేరకు నెగ్గుకురాగలరనేది ఆసక్తికరంగా మారింది. 2001లో భారత జట్టు జూనియర్ ప్రపంచకప్‌ను గెలుచుకోగా ఆ తర్వాత 2005లో కాంస్యం కోసం జరిగిన పోరులో స్పెయిన్‌తో ఓడిపోయి నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటిదాకా జట్టుకిదే ఉత్తమ ప్రదర్శన. ఈ ఏడాది ఆరంభంలో జర్మనీలో జరిగిన మహిళల జూనియర్ ప్రపంచకప్‌లో భారత జట్టు కాంస్యం సాధించింది. కనీసం ఆ స్థాయి ప్రదర్శనైనా కనబరచాలనే ఆలోచనతో ఉన్న కుర్రాళ్లు గ్రూప్ ‘సి’లో నేడు తమ తొలి మ్యాచ్‌లో గత టోర్నీ (2009) రన్నరప్ నెదర్లాండ్స్‌ను ఎదుర్కొనబోతున్నారు. ప్రత్యర్థి పటిష్టమైన జట్టు కావడంతో గెలవకపోయినా కనీసం డ్రా అయినా చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంది.