వెల్లింగ్టన్: ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా విజేతగా నిలవని న్యూజిలాండ్ ఈసారి మెగా టోర్నీ కోసం అందరికంటే ముందుగా సమరభేరి మోగించింది. బరిలో ఉన్న పది జట్ల ప్రకటనకు ఈ నెల 23 కటాఫ్ తేదీ కాగా ఇరవై రోజుల ముందుగానే తమ 15 మంది టీమ్‌తో కివీస్ సిద్ధమైంది. రెండో స్పిన్నర్‌గా లెగ్‌స్పిన్నర్ ఇష్ సోధికి చోటు దక్కగా... ఇప్పటి వరకు ఒక్క వన్డే కూడా ఆడని కీపర్ టామ్ బ్లండెల్ నేరుగా వరల్డ్ కప్‌తోనే అరంగేట్రం చేయనున్నాడు.
ఇటీవలి వరకు జట్టులో భాగంగా ఉన్న కీపర్ టిమ్ సీఫెర్ట్ గాయపడటంతో అతనికి అవకాశం లభించింది. మిగతా 13 మంది ఆటగాళ్ల విషయంలో కివీస్ సెలక్టర్లు ఎలాంటి సంచలనాలకు అవకాశం ఇవ్వలేదు. గత కొంత కాలంగా జట్టు సభ్యులుగా నిలకడగా రాణిస్తున్నవారినే ఎంపిక చేసినట్లు కోచ్ గ్యారీ స్టీడ్ చెప్పారు. సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌కు ఇది వరుసగా నాలుగో ప్రపంచ కప్ కావడం విశేషం.
కివీస్ జట్టు ఇదే...
బ్యాట్స్‌మెన్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, హెన్రీ నికోల్స్, రాస్ టేలర్, టామ్ లాథమ్, కొలిన్ మున్రో, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్)
పేసర్లు: ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ
స్పిన్నర్లు: మైకేల్ సాన్‌ట్నర్, ఇష్ సోధి
ఆల్‌రౌండర్లు: జిమ్మీ నీషమ్, కొలిన్ గ్రాండ్‌హోమ్.
Comments
Please login to add a commentAdd a comment