
కొలంబో: శ్రీలంక జట్టు ప్రధాన కోచ్ మికీ ఆర్థర్, లంక కెప్టెన్ దాసున్ షనకల మధ్య జరిగిన మాటల యుద్ధం ప్రస్తుతం వైరల్‌గా మారింది. మొదట టీమిండియా ఓటమి దిశగా సాగుతున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో సంతోషంగా కనిపించిన ఆర్థర్.. క్రమంగా చహర్ నిలుద్కొకుకోవడం.. ఆ తర్వాత భువీతో కలిసి ఇన్నింగ్స్ నడిపించడం ఆర్థర్‌కు సహనం కోల్పోయేలా చేశాయి. ఈ సందర్భంగా అతను డ్రెస్సింగ్ రూమ్‌లో కోపంతో విచిత్రమైన హావభావాలు ఇచ్చాడు.
ఇక మ్యాచ్ చివర్లో లంక ఓటమి దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యలోనే మికీ ఆర్థర్ మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వచ్చి కెప్టెన్ షనకతో ఏదో చర్చించాడు. ఆర్థర్ ఏవో సైగలు చేస్తుంటే షనక కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఇరువరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో వెలుగు చూసింది. ఈ వీడియోపై అభిమానులు ఎవరికి తోచింది వారు కామెంట్ చేశారు. '' మ్యాచ్ జరుగుతుంటే కోచ్ మైదానంలోకి అడుగుపెట్టడం రూల్స్‌కు విరుద్ధం.. టీమిండియా ఆటతీరును డిస్టర్బ్ చేయాలనే ఆర్థర్ ఇలా ప్లాన్‌తోనే షనకతో గొడవపడినట్లు నటించాడంటూ'' పేర్కొన్నారు.
— cric fun (@cric12222) July 20, 2021
Comments
Please login to add a commentAdd a comment