శంషాబాద్‌ నుంచి నేరుగా కొలంబోకు విమాన సర్వీసులు | Hyderabad Colombo Flights, Airfares starts from today | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ నుంచి నేరుగా కొలంబోకు విమాన సర్వీసులు

Published Wed, Jul 12 2017 9:17 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

శంషాబాద్‌ నుంచి నేరుగా కొలంబోకు విమాన సర్వీసులు - Sakshi

శంషాబాద్‌ నుంచి నేరుగా కొలంబోకు విమాన సర్వీసులు

శంషాబాద్‌: నగరవాసులకు శుభవార్త. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్‌ నుంచి శ్రీలంకకు నేటి (బుధవారం) నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. శ్రీలంక ఎయిర్లైన్స్‌కు చెందిన ఏ-320 ఎయిర్‌క్రాఫ్ట్‌ విమాన సర్వీసులు వారానికి నాలుగు రోజుల పాటు సేవలందజేయనున్నాయి. ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో  హైదరాబాద్‌  నుంచి కొలంబోకు  విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. దీంతో కేవలం రెండు గంటల్లో  నగరం నుంచి శ్రీలంకకు చేరుకోవచ్చు. ప్రపంచంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన  శ్రీలంకు హైదరాబాద్‌ నుంచి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం పట్ల  జీఎమ్మార్‌ సీఈవో ఎస్‌జీకే కిషోర్‌  ఒక ప్రకటనలో  సంతోషం వ్యక్తం చేశారు.
 
పర్యాటక దేశమైన శ్రీలంకను   భారతీయులు  ఎక్కువగా సందర్శిస్తారని  పేర్కొన్నారు. అందమైన బీచ్‌లు, 1600 కిలోమీటర్‌ల మేర  తీర ప్రాంతం, కొబ్బరితోటలు, తదితర అద్భుతమైన ప్రకృతిసౌందర్యంతో కనువిందు చేసే  శ్రీలంకను సందర్శించేందుకు నగరవాసులకు ఇది చక్కటి అవకాశమని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement