RGI Airport
-
రూ.468 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు ధ్వంసం
శంషాబాద్ (హైదరాబాద్): ఆర్జీఐ విమానాశ్రయంతో పాటు వివిధ ప్రాంతాల్లో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డ రూ.468 కోట్ల విలువైన మాదకద్రవ్యాలతో పాటు విదేశీ సిగరెట్లను హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు ధ్వంసం చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో హైదరాబాద్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా అధికారులు మంగళవారం ఈ ప్రక్రి యను పూర్తి చేశారు. ధ్వంసం చేసిన వాటిలో రూ.95.37 కోట్ల విలువ చేసే 27 కేజీల హెరాయిన్, రూ.272.55 కోట్ల విలువ చేసే 136 కేజీల మెఫిడోన్, రూ.కోటి విలువ చేసే 52 కేజీల గంజాయితోపాటు ఆర్జీఐ విమానా శ్రయంలో పట్టుడిన రూ.40 లక్షల విలువ చేసే విదేశీ సిగరెట్లు కూడా ఉన్నాయి. నైజీరియా, టాంజానియా, దక్షిణాఫ్రికా, బెనియోనాయస్ దేశాలకు చెందిన పౌరులతో పాటు మనదేశానికి చెందిన వారి నుంచి కస్టమ్స్ అధికారులు, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కలిసి వీటిని పట్టుకున్నారు. -
మరో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్.. కానిస్టేబుల్ పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఆర్జీఐ ఎయిర్‌పోర్టు దగ్గర ఓ ప్రభుత్వ వాహనం పోలీస్‌ను ఢీకొట్టింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయనపడిన కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Hyderabad Traffic Challan: ఒకే బైక్‌పై 179 చలాన్లు.. అక్షరాల రూ.42,475 ఫైన్లు, పరుగో పరుగు.. -
శంషాబాద్ నుంచి నేరుగా కొలంబోకు విమాన సర్వీసులు
శంషాబాద్: నగరవాసులకు శుభవార్త. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ నుంచి శ్రీలంకకు నేటి (బుధవారం) నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏ-320 ఎయిర్‌క్రాఫ్ట్ విమాన సర్వీసులు వారానికి నాలుగు రోజుల పాటు సేవలందజేయనున్నాయి. ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి కొలంబోకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. దీంతో కేవలం రెండు గంటల్లో నగరం నుంచి శ్రీలంకకు చేరుకోవచ్చు. ప్రపంచంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన శ్రీలంకు హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం పట్ల జీఎమ్మార్ సీఈవో ఎస్జీకే కిషోర్ ఒక ప్రకటనలో సంతోషం వ్యక్తం చేశారు. పర్యాటక దేశమైన శ్రీలంకను భారతీయులు ఎక్కువగా సందర్శిస్తారని పేర్కొన్నారు. అందమైన బీచ్‌లు, 1600 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం, కొబ్బరితోటలు, తదితర అద్భుతమైన ప్రకృతిసౌందర్యంతో కనువిందు చేసే శ్రీలంకను సందర్శించేందుకు నగరవాసులకు ఇది చక్కటి అవకాశమని ఆయన పేర్కొన్నారు. -
అరకేజీ బంగారం స్వాధీనం
హైదరాబాద్ : సింగపూర్ నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికుడి నుంచి అరకేజీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సదరు ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆ లగేజీలో అరకేలో బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దాంతో బంగారాన్ని సీజ్ చేశారు. -
ప్రయాణికుల నుంచి 1.6 కేజీల బంగారం స్వాధీనం
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు మంగళవారం 1.6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తున్న క్రమంలో... సదరు ప్రయాణికుల లగేజీలో ఆ బంగారాన్ని కనుగొన్నారు. కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని సీజ్ చేశారు. ఇద్దరు ప్రయాణికులపై కేసు నమోదు చేసి అధికారులు ప్రశ్నిస్తున్నారు.