200 మంది సజీవ సమాధి
కొలంబో: భారీ వర్షాలతో శ్రీలంక చిగురుటాకుల వణికుతోంది. వర్షాల కారణంగా శ్రీలంక సెంట్రల్ బదుల్లా జిల్లాలోని మెర్రిబెడ్డా టీ ఎస్టెట్ ప్రాంతంలో భారీగా కొండ చిరియలు విరిగిపడ్డాయి. దాదాపు 200 మంది కొండ చరియలు కింద పడి సజీవ సమాధి అయ్యారని విపత్తు నిర్వహాణ శాఖ ఉన్నతాధికారి ప్రదీప్ కొడిపల్లి గురువారం కొండపల్లిలో వెల్లడించారు. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
అర్మీ,పోలీసులు, ఎయిర్ఫోర్స్తోపాటు కేంద్రం నుంచి బృందాలు సహాయక చర్యలో పాలుపంచుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం 500 మంది ఆచూకీ తెలియకుండా పోయిందని... గల్లంతైన వారిలో భారతీయ సంతతికి చెందిన వారే అధికంగా ఉన్నారని వెల్లడించారు. భారతీయ సంతతికి చెందిన ప్రజలు మెర్రిబెడా టీ ఎస్టేట్లో కార్మికులు పని చేస్తున్నారు. మరో 817 మందిని పలు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు.