
కొలంబో: పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు శ్రీలంక చేరిన ధావన్ సేన శుక్రవారం ప్రాక్టీస్‌లో పాల్గొంది. మూడు రోజుల క్వారంటైన్ ముగియడంతో ఆటగాళ్లందరూ ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో నెట్ ప్రాక్టీస్ చేశారు. అక్టోబర్, నవంబర్‌లలో యూఏఈలో జరిగే టి20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడే చివరి సిరీస్ ఇది.
ఈ స్వల్పకాలిక పర్యటనలో ధావన్ నేతృత్వంలోని భారత్ 3 వన్డేలతో పాటు 3 టి20లు కూడా ఆడుతుంది. ప్రపంచకప్ ఆశలు పెట్టుకున్న పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, సంజూ సామ్సన్‌లకు ఈ టూర్ కీలకంగా మారింది. కొలంబోలో ఇరు జట్ల మధ్య ఈ నెల 13న తొలివన్డే జరుగనుం ది. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి సారథ్యంలోని టీమిం డియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment