
శ్రీలంకలో వర్ష బీభత్సం
63 మంది మృతి..
కొలంబో: శ్రీలంకలో రోను తుపాను వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు 63 మంది మరణించగా, 134 మంది గల్లంతయ్యారు. కొలంబో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 2 లక్షల మంది ప్రజలను సుర క్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. కిలినోచ్చి జిల్లా లో 373 మి.మీ. వర్షపాతం నమోదైంది.