అజయ్ బిసారియా
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లోని భారతీయ హైకమిషనర్‌కు అవమానం జరిగింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరువలో ఉన్న సిక్కుల పవిత్ర క్షేత్రం గురుద్వారా పంజా సాహిబ్‌ను దర్శించేందుకు శుక్రవారం భారత హైకమిషనర్ అజయ్ బిసారియా కుటుంబంతో కలసి వెళ్లారు. ఇందుకోసం పాకిస్తాన్ విదేశాంగ శాఖ నుంచి ముందస్తుగానే అనుమతి తీసుకున్నారు.
అయితే, బిసారియా గురుద్వారాలోకి వెళ్లకుండా పాకిస్తాన్ అధికారులు అడ్డగించారు. పుట్టిన రోజు సందర్భంగా బిసారియా కుటుంబంతో కలసి గురుద్వారాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా బిసారియాను గురుద్వారాలోకి ప్రవేశించకుండా పాకిస్తాన్ అధికారులు అడ్డుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా బిసారియాకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment