Ajay Bisaria
-
ఇఫ్తార్ అతిథులకు పాక్ వేధింపులు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ శనివారం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు పాక్ రాజకీయ, వాణిజ్య, మీడియా ప్రముఖులు రాకుండా నానా అడ్డంకులు సృష్టించింది. ఈ విందుకు వెళ్లరాదని పలువురు ప్రముఖులకు గుర్తుతెలియని నంబర్ల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వెళ్లాయి. అయినాసరే లెక్కచేయకుండా హాజరైన అతిథుల్ని పోలీసులు, భద్రతాధికారులు తనిఖీల పేరుతో తీవ్రంగా వేధించారు. పలువురు తమ ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. పాక్‌లోని భారత రాయబారి అజయ్ బిసారియా ఇస్లామాబాద్‌లోని సెరేనా హోటల్లో శనివారం ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. ఇందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, అధ్యక్షుడు ఆరీఫ్ అల్వీ సహా పలువురిని ఆహ్వానించారు. కానీ ఈ విందుకు వీరిద్దరూ గైర్హాజరయ్యారు. ఆ హోటల్ వద్ద భారీగా బలగాలను మోహరించిన ప్రభుత్వం, అతిథుల్ని వేధింపులకు గురిచేసింది. ఫోన్‌చేసి బెదిరింపులు.. ఈ విషయమై ప్రముఖ పాక్ జర్నలిస్ట్ మెహ్రీన్ జెహ్రా మాలిక్ మాట్లాడుతూ..‘మొదటగా నా ఆహ్వానపత్రికను పోలీసులు తనిఖీ చేశారు. నా వృత్తి, నివాసం ఉండే చోటు అడిగారు. చివరికి లోపలకు అనుమతించారు. కానీ నా డ్రైవర్‌తో దురుసుగా ప్రవర్తించారు. సెరేనా హోటల్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. వారంతా హోటల్‌కు వచ్చేవారిని వేధిస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరాచీ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఫైసలాబాద్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, లాహోర్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు పాక్ భద్రతాధికారులు గుర్తుతెలియని నంబర్ల నుంచి శుక్రవారం రాత్రి ఫోన్ చేశారు. భారత హైకమిషన్ ఇస్తున్న విందుకు వెళ్లరాదని హెచ్చరించారు. ఈ ఘటనను పాక్ మీడియా కవర్ చేయలేదు. పాక్ నేతకు చుక్కలు.. ఈ విందుకు హాజరైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) నేత ఫర్హతుల్లాహ్ బాబర్‌కు పాక్ అధికారులు చుక్కలు చూపించారు. ‘‘నేను సెరేనా హోటల్‌కు రాగానే బారికేడ్లు దర్శనమిచ్చాయి. వాటిని దాటుకుని ముందుకెళ్లగా భద్రతాధికారులు ఇఫ్తార్ రద్దయిందని చెప్పారు. గట్టిగా అడిగేసరికి మరో గేటు నుంచి లోపలకు వెళ్లాలన్నారు. అటుగా వెళితే.. ఇటువైపు రావొద్దు. ముందువైపు గేటు నుంచే హోటల్లోకి వెళ్లండని ఇబ్బంది పెట్టారు’ అని బాబర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పిన బిసారియా.. ఇఫ్తార్ విందు సందర్భంగా వేధింపులకు గురైన ప్రముఖులకు భారత రాయబారి అజయ్ బిసారియా క్షమాపణలు చెప్పారు. ఇఫ్తార్ విందుకు కరాచీ, లాహోర్ వంటి దూరప్రాంతాల నుంచి హాజరైన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు చాలామంది అతిథులపై పాక్ అధికారులు చేయి చేసుకున్నారనీ, మొబైల్ఫోన్లు లాక్కున్నారని భారత హైకమిషన్ తెలిపింది. ఇది దౌత్య చట్టాలను ఉల్లంఘించడమేననీ, ఈ వ్యవహారంపై పాక్ ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. కాగా, ఢిల్లీలో పాక్ హైకమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు అతిథులు రాకుండా భారత్ ఇలాగే అడ్డుకుందనీ, అందుకే ఇలా ప్రతీకారానికి దిగిందని పాక్ దౌత్యవర్గాలు చెప్పాయి. -
భారత్‌లో ఎన్నికలు; పాకిస్తాన్ నుంచి ఓట్లు!
న్యూఢిల్లీ: మన దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్తాన్ నుంచి కొంత మంది ఓటు వేశారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి దాదాపు వందమందిపైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు. ఓటు వేసిన వారందరూ భారతీయులే. ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వారంతా ఈ-పోస్టల్ బ్యాలెట్(ఈటీపీబీఎస్)తో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌లోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఎలక్ట్రానిక్ పోస్టల్ ఓటర్ విధానంతో భారత సార్వత్రిక ఎన్నికల్లో తమ గళాన్ని వినిపించే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఇప్పటికే ఐదు విడతల ఎన్నికలు ముగిశాయి. మరో రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగాల్సివుంది. ఈనెల 19 నాటికి ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. 23న ఓట్లు లెక్కిస్తారు. ఈటీపీబీఎస్ అంటే... ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్(ఈటీపీబీఎస్)ను సర్వీసు ఓటర్ల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. రక్షణ శాఖలో పనిచేసే ఉద్యోగులను సర్వీసు ఓటర్లుగా పరిగణిస్తారు. సీ-డాక్ రూపొందించిన ఈటీపీబీఎస్ అత్యంత సురక్షితమైందని, రెండంచల్లో భద్రత ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఓటీపీ, పిన్ ద్వారా గోప్యత పాటిస్తారు. స్పష్టమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది కనుక రెండుసార్లు ఓటు పడే అవకాశం(డూప్లికేషన్) ఉండదు. సర్వీసు ఓటర్లతో పాటు ఉంటున్న భాగస్వాములు(భార్య/భర్త), విదేశాల్లో ఉంటున్న రక్షణ శాఖ ఉద్యోగులు దీని ద్వారా ఓటు వేయొచ్చు. తమ నియోజకవర్గానికి వెలుపల ఉన్న సర్వీసు ఓటర్లు ఈటీపీబీఎస్ ద్వారా ఎక్కడినుంచైనా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి ఈటీపీబీఎస్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఓటీపీ కావాలి. ఈ ఫైల్‌ను ఆన్లైన్లో పంపించేందుకు పిన్ తప్పనిసరి. ఎన్నికలకు 16 రోజుల ముందు ఈ-బ్యాలెట్ పంపించాలి. సర్వీసు ఓటరుగా ముందుగా నమోదు చేయించుకుంటేనే దీన్ని వాడగలరు. సర్వీసు ఓటర్లు పంపించిన ఈ-బ్యాలెట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి(ఈఆర్ఓ)కి మాత్రమే కనబడుతోంది. దాన్ని ఆమోదించే, తిరస్కరించే అధికారం ఈఆర్ఓకు మాత్రమే ఉంటుంది. ఈటీపీబీఎస్‌లో ఓటు వేసేదిలా... -
ఇమ్రాన్‌కు బ్యాటు బహుమానం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియా కాబోయే ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపైనా వీరిద్దరు చర్చించారు. సీమాంతర ఉగ్రవాదం, చొరబాట్లు తదితర అంశాలపై ఇమ్రాన్ వద్ద అజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ చీఫ్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరఫున అజయ్ అభినందించారు. భారత క్రికెట్ జట్టు సంతకాలు చేసిన బ్యాట్‌ను బహూకరించారు. భారత్–పాక్ చర్చలు మళ్లీ ప్రారంభం కావాలని ఇమ్రాన్ ఆకాంక్షించారు. ఇస్లామాబాద్‌లో త్వరలో జరగనున్న సార్క్ సదస్సలో భారత్ పాల్గొనాలని కూడా ఆయన కోరారు. పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 18న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పీటీఐ ప్రకటించింది. భారత క్రికెటర్లు కపిల్ దేవ్, నవజ్యోత్ సింగ్ సిద్ధు, సునీల్ గావస్కర్‌లను ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు పేర్కొంది. ఆగస్టు 13 నుంచి పాక్ పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కాగా, పార్లమెంటు ఎన్నికల్లో బహిరంగంగా ఓటు వేసినందుకు పాక్ ఎన్నికల సంఘానికి ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు చెప్పారు. -
ఇమ్రాన్ ఖాన్‌కు మోదీ అరుదైన గిఫ్ట్
న్యూఢిల్లీ: కాబోయే పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపురూపమైన కానుకను పంపించారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్‌కూడా అయిన్ ఖాన్‌కు క్రికెట్ బ్యాట్‌ను గిఫ్ట్‌గా పంపించారు. భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ సంతకాలు చేసిన ఈ అరుదైన క్రికెట్ బ్యాట్‌ను భారత హై కమిషనర్ అజయ్ బిసారియా శుక్రవారం ఇమ్రాన్‌ఖాన్‌కు అందించారు. రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలపై చర్చించేందుకు భారత రాయబారి అజయ్ బిసరియా పాకిస్థాన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఇమ్రాన్ ఖాన్,ఇతర ఉన్నతాధికారులను పిలిచి ప్రధాని మోదీ తరఫునఈ బ్యాట్‌ను బహుకరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సాధించిన ఘనవిజయానికి గాను అభినందనలు తెలిపారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 18న పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సెనేటర్ ఫైసల్ జావేద్ శుక్రవారం ప్రకటించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముగ్గురు మాజీ భారత క్రికెటర్లు కపిల్ దేవ్, నవజోత్ సింగ్ సిద్ధూ, సునీల్ గవాస్కర్లను ఆహ్వానించినట్టు తెలిపారు. కాగా జూలై 26న జరిగిన ఎన్నికలలో సాధారణ ఎన్నికలలో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ 116 సీట్లను గెలుచుకుని అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ ఇమ్రాన్ అభినందించిన సంగతి తెలిసిందే. Indian HC Ajay Bisaria called on Mr Imran Khan, Chairperson & senior leadership of PTI. HC congratulated @ImranKhanPTI on his electoral success, discussed range of issues, prospects of India-Pak relationship. HC gifted a cricket bat autographed by the entire Indian cricket team. pic.twitter.com/xtdZ8H8ZQ5 — India in Pakistan (@IndiainPakistan) August 10, 2018 -
పాక్‌లో భారత రాయబారికి అవమానం
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత రాయబారిని అవమానించింది. పాక్‌లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియాను భద్రతా కారణాలను సాకుగా చూపుతూ గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకుంది. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా బిసారియా కుటుంబ సభ్యులతో కలసి ఇస్లామాబాద్‌లోని గురుద్వారా పంజా సాహిబ్‌కు వెళ్లారు. ఇందు కోసం పాక్ విదేశాంగ శాఖ నుంచి ముందస్తు అనుమతి కూడా తీసుకున్నారు. అయితే గురుద్వారా సమీపానికి చేరుకున్నాక బిసారియాను లోపలకు అనుమతించలేదు. భద్రతా కారణాలను సాకుగా చూపిన పాక్ అధికారులు బిసారియా కారు నుంచి దిగేందుకు కూడా అంగీకరించలేదు. ఈ ఘటనపై ఢిల్లీలోని పాక్ డిప్యూటీ హైకమిషనర్ సయ్యద్ హైదర్ షాకు సమన్లు జారీచేసిన భారత విదేశాంగ శాఖ.. పాక్ అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర నిరసన తెలిపింది. -
భారత రాయబారికి అవమానం
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లోని భారతీయ హైకమిషనర్‌కు అవమానం జరిగింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరువలో ఉన్న సిక్కుల పవిత్ర క్షేత్రం గురుద్వారా పంజా సాహిబ్‌ను దర్శించేందుకు శుక్రవారం భారత హైకమిషనర్ అజయ్ బిసారియా కుటుంబంతో కలసి వెళ్లారు. ఇందుకోసం పాకిస్తాన్ విదేశాంగ శాఖ నుంచి ముందస్తుగానే అనుమతి తీసుకున్నారు. అయితే, బిసారియా గురుద్వారాలోకి వెళ్లకుండా పాకిస్తాన్ అధికారులు అడ్డగించారు. పుట్టిన రోజు సందర్భంగా బిసారియా కుటుంబంతో కలసి గురుద్వారాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా బిసారియాను గురుద్వారాలోకి ప్రవేశించకుండా పాకిస్తాన్ అధికారులు అడ్డుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా బిసారియాకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. -
భారత రాయబారికి అవమానం
న్యూఢిల్లీ : దాయాది పాకిస్తాన్ మరోసారి తన వంకరబుద్ధిని బయటపెట్టుకుంది.భారత రాయబారి అజయ్ బిసారియాను ఉద్దేశపూర్వకంగా అవమానించింది.పలు దేశాల రాయబారులు, ఉన్నతాధికారులు సభ్యులుగా ఉండే ఇస్లామాబాద్ క్లబ్లో బిసారియా చేరకుండా అడ్డుకునేయత్నం చేసింది. సాధారణంగా ఒకటి రెండు రోజుల్లో ముగిసే ప్రయను నెలలు గడుస్తున్నా వాయిదావేస్తూవచ్చింది. గతంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న పరిస్థితుల్లోనూ ఇలా ఎప్పుడూ జరగలేదు. కొంతకాలంగా సరిహద్దులో వరుస కాల్పులు, ఉద్రక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ తాజా చర్య మరింత రెచ్చగొట్టినట్లైంది. రాయబారుల అడ్డా ఇస్లామాబాద్ క్లబ్ : పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో రాయబార కార్యాలయాలకు సమీపంగా ఇస్లామాబాద్ క్లబ్ ఉంది. 350 ఎకరాల సువిశాల ప్రాగణంలో గోల్ఫ్, స్విమ్మింగ్, రెస్టారెంట్ సహా సకల సదుపాయాలుంటాయి. పాక్‌లో పనిచేసే అన్ని దేశాల రాయబారులు, వారి కుటుంబాలు, అత్యున్నతాధికారులకు అదొక రిక్రియేషన్ ప్లేస్. ఏ దేశం నుంచైనా కొత్తగా రాయబారి నియమితులయ్యారంటే, గంటల వ్యవధిలోనే ఆ క్లబ్లో మెంబర్ కావడం రివాజుగా వస్తోంది. అలా ఇస్లామాబాద్ క్లబ్ రాయబారుల అడ్డాగా పేరుపొందింది. కాగా, గత డిసెంబర్లో అజయ్ బిసారియా పాకిస్తాన్లో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం ఇస్లామాబాద్ క్లబ్ మెంబర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నప్పటికీ పాక్ అధికారులు ఆయనకు సభ్యత్వం ఇవ్వలేదు. భారత రాయబారుల కార్యకలాపాలపై ఆంక్షలు విధించాలన్న ఉద్దేశంలోనే పాక్ ఈ రీతిగా వ్యవహరిస్తున్నది. మరి భారత్‌లో పాక్ రాయబారి సంగతేంటి? : వేర్పాటువాద నేతలతో వరుస భేటీలు నిర్వహించి వివాదాస్పదుడిగా పేరుపొందిన అబ్దుల్ బాసిత్ పదవీ విరమణ అనంతరం భారత్‌లో పాక్ రాయబారిగా సోహైల్ మొహమ్మద్(గతేడాది మేలో) నియమితులైన సంగతి తెలిసిందే. బాసిత్ అనుభవం దృష్ట్యా సోహైల్ కార్యకలాపాలకు సంబంధించి భారత ప్రబుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. ఢిల్లీ శివారు నోయిడా, గురుగ్రామ్‌లలో పర్యటనకు ఆయనను అనుమతించడంలేదు. దీంతో పాకిస్తాన్కూడా అదే తరహా ఆంక్షలకు తెరలేపింది.