
ఆస్ట్రేలియా హైకమిషనర్‌గా భారత సంతతి మహిళ
మెల్‌బోర్న్: భారత్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్‌గా హరీందర్ సిధూ నియమితులయ్యారు. ఐదేళ్ల వ్యవధిలో మన దేశంలో నియమితులైన భారత సంతతికి చెందిన రెండో ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ఆమె. సిధూకుటుంబం పంజాబ్ నుంచి వెళ్లి ఆస్ట్రేలియాలో స్థిరపడింది.
ప్రస్తుత హైకమిషనర్ పాట్రిక్ సక్‌లింగ్ స్థానంలో సిధూ బాధ్యతలు చేపట్టనున్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్‌లో దౌత్య ప్రతినిధి పాత్ర పోషించేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని ఆమె తెలిపారు.