కెనడా: ఒకపక్క ఖలిస్థాన్ మద్దతుదారుల ఆకృత్యాలు పెరిగిపోతుంటే కెనడా ప్రభుత్వం చూసి చూసినట్టు వ్యవహరిస్తోందని భారత విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తప్పుబట్టారు. వారు చెప్పేదాంట్లో వాస్తవం లేదని తాము ఉగ్రవాద చర్యలపై ఎప్పుడూ కఠినంగానే వ్యవహరించామని అన్నారు.
కెనడాలోని ఖలిస్తాన్ మద్దతుదారుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఆపరేషన్ బ్లూ 39వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ర్యాలీలో ప్రదర్శించిన ఖలిస్తానీలు ఇటీవల భారత దౌత్య కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. జులై 8న ఖలిస్తానీల స్వేఛ్చ ర్యాలీ నిర్వహించనున్నట్లు దౌత్య కార్యాలయం ఎదుట పోస్టర్లను ప్రదర్శించారు. ఖలిస్తానీల చర్యలపై పలు అగ్రదేశాలు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కెనడా ప్రధాని వైఖరిని తప్పుబట్టింది. ఖలిస్తానీలపై మెతక వైఖరి మన రెండు దేశాల సంబంధాలకే ప్రమాదమని చెబుతూ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా వారు ఖలిస్థాన్ మద్దతుదారులపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించింది.
కెనడా ప్రధాని ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వారు చెప్పేది వాస్తవం కాదు. కెనడా ఎప్పుడూ హింసను ప్రేరేపించే తీవ్రవాదం పైన కఠినంగానే వ్యవహరించింది. వ్యవహరిస్తుంది కూడా. దేశంలో అందరికీ భావ ప్రకటన స్వేఛ్చ ఉంటుందని అలాగే హింసను తీవ్రవాదంపై ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతోనే ఉన్నామని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా ఇటీవల ఖలిస్తానీలు భారత దౌత్య కార్యాలయంపై దాడికి కెనడా ఎంపీ చంద్ర ఆర్య తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారి ప్రతి కదలికనూ గమనిస్తోందని మా పెరట్లో పాములు పడగ విప్పి బుసలు కొడుతున్నాయని ఎప్పుడు కాటేసి చంపుతాయన్నదే మమ్మల్ని వేధిస్తున్న ప్రశ్న.. అని అన్నారు.
ఇది కూడా చదవండి: నోరుజారిన నేపాల్ ప్రధాని.. ఏకి పారేస్తున్న ప్రతిపక్షాలు
Comments
Please login to add a commentAdd a comment