ఎయిర్‌పోర్టు అభివృద్ధికి సంబంధించిన అంశాలను స్క్రీన్‌పై తిలకిస్తున్న కలెక్టర్, అధికారులు
సాక్షి కడప: కడప విమానాశ్రయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్, ఎయిర్‌పోర్టు అథారిటీ చైర్మన్ హరి కిరణ్ తెలిపారురు. బుధవారం కడప విమానాశ్రయంలో ఏరోడ్రమ్, ఎయిర్ ఫీల్డ్, ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కమిటీల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా చైర్మన్ హోదాలో కలెక్టర్ హరి కిరణ్ మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విమానాశ్రయంలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంతోపాటు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. విమానాశ్రయ పరిధిలో పోలీసు బందోబస్తును మరింత పెంచాలని సూచించారు.
విమానాశ్రయం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎక్కడా కూడా చెత్తాచెదారం లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భద్రతకు సంబంధించిన పలు విషయాలను, ప్రయాణీకులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విమానాశ్రయ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ చర్చించింది. కడప సబ్ కలెక్టర్ పృథ్వితేజ్, అడిషనల్ ఎస్పీ రిషికేశవరెడ్డి, విమానాశ్రయ డైరెక్టర్, కమిటీ కన్వీనర్ శివప్రసాద్, కడప డీఎస్పీ సూర్యనారాయణ, ఏటీసీ ఇన్‌ఛార్జి షేక్ షకీల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment