Hari Kiran
-
చిరుధాన్యాలపై అవగాహన
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించినందున ఏడాది పొడవునా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ చెప్పారు. అందుకు తగినట్టుగా 100 హెక్టార్లకు ఒకటి చొప్పున పంటల వారీగా క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన మంగళవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుధాన్యాల సాగుపై రైతులకు శిక్షణనిస్తూ, భవిష్యత్‌లో మంచి ధర లభించేలా కృషిచేయాలన్నారు. వైఎస్సార్ యంత్ర సేవాకేంద్రాల ఏర్పాటు కోసం జిల్లాల్లోని జిల్లా పర్చేజింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీపీఎంసీ) ద్వారా యంత్ర పరికరాల సూచిక ధరలను ఖరారు చేయాలని చెప్పారు. పీఎం కిసాన్ 13వ విడత ఆర్థికసాయాన్ని సాధ్యమైనంత ఎక్కువమందికి అందించేందుకు వీలుగా రైతుల ఈ–కేవైసీని ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలన్నారు. రబీలో సాగుచేసి కోతకు వచ్చే శనగలు, మినుములు, పెసలు, ఇతర పంటల ఈ–క్రాప్ నమోదు, ఈ–కేవైసీ త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉన్న ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 30వ తేదీలోగా, మిగిలిన జిల్లాల్లో 15వ తేదీలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. -
విమానాశ్రయంలో మరిన్ని సౌకర్యాలు
సాక్షి కడప: కడప విమానాశ్రయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్, ఎయిర్‌పోర్టు అథారిటీ చైర్మన్ హరి కిరణ్ తెలిపారురు. బుధవారం కడప విమానాశ్రయంలో ఏరోడ్రమ్, ఎయిర్ ఫీల్డ్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా చైర్మన్ హోదాలో కలెక్టర్ హరి కిరణ్ మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విమానాశ్రయంలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంతోపాటు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. విమానాశ్రయ పరిధిలో పోలీసు బందోబస్తును మరింత పెంచాలని సూచించారు. విమానాశ్రయం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎక్కడా కూడా చెత్తాచెదారం లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భద్రతకు సంబంధించిన పలు విషయాలను, ప్రయాణీకులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విమానాశ్రయ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ చర్చించింది. కడప సబ్ కలెక్టర్ పృథ్వితేజ్, అడిషనల్ ఎస్పీ రిషికేశవరెడ్డి, విమానాశ్రయ డైరెక్టర్, కమిటీ కన్వీనర్ శివప్రసాద్, కడప డీఎస్పీ సూర్యనారాయణ, ఏటీసీ ఇన్‌ఛార్జి షేక్ షకీల తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన ఖరారు
సాక్షి, వైఎస్సార్ : మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని జూలై 7, 8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా సీఎం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరికిరణ్ జిల్లా అధికారులతో, ఎస్పీ అన్బురాజన్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్-19 నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్(ఎస్ఓపీ) తప్పనిసరిగా పాటించాలన్నారు. పర్యటనలో భాగంగా ఇడుపులపాయ, ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ముఖ్యమంత్రి నిర్వహించే కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. బందోబస్తు పరంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని ఎస్పీ అన్బురాజన్‌కు తెలిపారు. -
ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 4 గంటలతో ముగిసింది. శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్నూలు, ఆదోని, నంద్యాల ఆర్డీఓ కార్యాలయాల్లోని సమావేశ భవనాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఓటర్ల కదలికలను గమనించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఇతర నిఘా బృందాల సభ్యులకు సెల్ఫోన్లు ఇచ్చి ఓటర్ల కదలికలను చిత్రీకరించాలని కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఆదేశించారు. జిల్లాలో మొత్తం 1,087 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఇందులో 116 మంది ఓటర్లు సహాయకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులపై రిటర్నింగ్ అధికారి, జేసీ హరికిరణ్ విచారణ జరిపిస్తున్నారు. ఇందులో ఎంతమందికి సహాయకులను నియమిస్తారనేది తెలియరాలేదు. గురువారం ఉదయానికి సహాయకుల నియామకంపై స్పష్టత రానుంది. నేడుమెటీరియల్ పంపిణీ... పోలింగ్ సామగ్రిని గురువారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో పంపిణీ చేయనున్నారు. మూడు పోలింగ్ కేంద్రాల పీవో, ఏపీఓలకు పోలింగ్ నిర్వహణకు అవసరమైన మెటీరియల్‌ను అందజేస్తారు. రాత్రికే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. -
ఎన్టీఆర్ 92 వ జయంతి
-
ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సివిల్స్ పరీక్ష కేంద్రాల పరిశీలకుడు, మున్సిపల్ కమిషనర్ హరికిరణ్ హాల్‌టికెట్, ఈ-అడ్మిట్ కార్డు తప్పనిసరిగా చూపించాలి సెల్ఫోన్లు, బ్లూటూత్, కాలిక్యులేటర్లు తీసుకురావద్దు విజయవాడ: అఖిల భారత సివిల్ సర్వీసుల పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థుల్ని అనుమతించవద్దని పరీక్ష కేంద్రాల పరిశీలకుడు, నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్ ఆదేశించారు. ఆదివారం నగరంలో జరగనున్న సివిల్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను శనివారం ఆయన పర్యవేక్షించారు. అనంతరం నలంద కళాశాలలో ఇన్విజిలేటర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. పరీక్ష సమయం దాటాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోపలికి అనుమతించవద్దన్నారు. కేంద్రాల వల్ల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో ముందస్తు ఏర్పాట్లను చేయాల్సిందిగా నిర్వాహకులకు సూచించారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఇ-అడ్మిట్ తప్పనిసరిగా అధికారులకు చూపించాలన్నారు. ఇన్విజిలేటర్లు, అభ్యర్థులు కేంద్రాల్లోకి సెల్‌ఫోనులు, బ్లూటూత్, కాలిక్యులేటర్లు తీసుకురాకూడదన్నారు. నగరంలో మొట్టమొదటిసారిగా సివిల్స్ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ ఆర్.ఆర్.పురి కూడా పాల్గొన్నారు.