టీడీపీ గల్లా జయదేవ్ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమి సాధించారని సన్మానాలు చేయించుకున్నారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సబ్జెక్ట్‌ను పక్కదోవ పట్టించవద్దన్న ఎంపీ గల్లా జయదేవ్ ... మీరు మాకు సన్మానం చేస్తారా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. తాను ఎక్కడా సన్మానాలు చేయించుకోలేదని, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో చేశారని, దాన్ని తాము కాదనలేకపోయామని ఆయన చెప్పుకొచ్చారు.