భారతదేశంలో ఏ ముస్లిం గురించి మాట్లాడినా, మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు పాకిస్తాన్. అయితే ఇదే సందర్భంలో మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న దేశం పాకిస్తాన్ కాదు. మనం ఇప్పుడు మాల్దీవులకు సంబంధించిన ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మాల్దీవులు ఆసియాలోనే అతి చిన్న దేశం. దీని వైశాల్యం 298 చదరపు కిలోమీటర్లు. ఈ దేశ జనాభా లక్షల సంఖ్యలో మాత్రమే ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు
మాల్దీవుల జనాభా విషయానికొస్తే 2016 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభా దాదాపు 4 లక్షల 28 వేలు. అయితే 2021లో ఇక్కడి జనాభా 5.21 లక్షలుగా అంచనా వేశారు. మాల్దీవులలో సుమారు 212 ద్వీపాలు ఉన్నాయి. వాటిలో సుమారు 200 ద్వీపాలు స్థానిక జనాభాకు కేటాయించారు. 12 ద్వీపాలను పర్యాటకుల కోసం కేటాయించారు.
భారతీయులు మాల్దీవులకు వెళ్లాలనుకుంటే వీసా అవసరం లేదు. మాల్దీవులకు వెళ్లే వారికి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులో ఉంది. అంటే ఇక్కడి విమానాశ్రయంలో దిగగానే 30 నుంచి 90 రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీసా లభిస్తుంది. అయితే చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, మాల్దీవులలోని హోటల్‌లో బస చేసినట్లు రుజువు కలిగి ఉండాలి.
మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం ఇస్లాం మతాన్ని విశ్వసించే వారు మాత్రమే మాల్దీవుల పౌరులవుతారు. అంటే ఇక్కడ ఉండే ముస్లింలకు మాత్రమే స్థానిక పౌరసత్వం లభిస్తుంది. మాల్దీవుల రాజ్యాంగంలోని వివరాల ప్రకారం సున్నీ ఇస్లాం ఇక్కడ జాతీయమతం. ముస్లిమేతరులెవరికీ ఈ దేశ పౌరసత్వం ఇవ్వకూడదని కూడా ఈ రాజ్యాంగంలో పేర్కొన్నారు. ఇక్కడ ప్రభుత్వ నియమాలు కూడా ఇస్లామిక్ చట్టంపై ఆధారపడి ఉండటం విశేషం.
ఇది కూడా చదవండి: హమాస్‌లో ‘మ్యాన్ ఆఫ్ డెత్’ ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment