
న్యూఢిల్లీ: రక్తదాతలతో ప్రజలు, బ్లడ్ బ్యాంక్‌లు, ఆస్పత్రులు సులువుగా అనుసంధానమయ్యేలా తన వెబ్‌సైట్లో ఫేస్‌బుక్ కొత్త సదుపాయాన్ని పొందుపరిచింది. భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సదుపాయం అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. రక్తం అసవరమున్న వారు ఒక ప్రత్యేక మెసేజ్‌లో బ్లడ్ గ్రూప్, ఆస్పత్రి పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాల్ని పొందుపరిచి పోస్ట్ చేయాలి.
వెంటనే ఫేస్‌బుక్ సమీపంలోని రక్తదాతల వివరాల్ని సేకరించి వారికి అందచేస్తుంది. అలాగే ఖాతాదారుల న్యూస్ ఫీడ్‌లో రక్తదాతగా నమోదు చేయించుకోవాలని కూడా మెసేజ్‌ను ప్రదర్శిస్తుంది. తొలుత ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో దీన్ని అమలు చేస్తున్నామని, కొద్ది వారాల్లో మిగతా నగరాలకు కూడా విస్తరిస్తామని ఫేస్‌బుక్ ప్రొడక్ట్ మేనేజర్ (ఆరోగ్యం) హేమా బూదరాజు తెలిపారు.