
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో సదుపాయాలు పెంచాలన్న లక్ష్యంతో కేంద్ర రైల్వే నడుం బిగించింది. ఇందులో భాగంగా పలు రైళ్లలో కోచ్‌లను ఆధునిక సదుపాయాలతో రీడిజైన్ చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 500 రైళ్లలో ఉత్కృష్ట కోచ్‌లను దశలవారీగా చేర్చాలని నిర్ణయించింది. ఇప్పటికే దాదాపు అన్ని రైల్వే జోన్లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఏసీ కోచ్‌లు, నాన్ ఏసీ, స్లీపర్ కోచ్‌లకు ఈ సదుపాయం వర్తించనుంది.
తొలిదశలో గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో
దక్షిణ మధ్య రైల్వేలో తొలిదశలో గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 6 ఉత్కృష్ట కోచ్‌లను ప్రవేశపెట్టారు. నూతన రంగులు, డిజైన్లు, ఆధునిక సదుపాయాలతో ఈ కోచ్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. గోదావరి ఎక్స్‌ప్రెస్ (నం.12728/12727) హైదరాబాద్– విశాఖల మధ్య రెండు రైళ్లు నడుస్తాయి. వీటిలో దశలవారీగా ఉత్కృష్ట కోచ్‌లను ప్రవేశపెడుతున్నారు.
రెండో దశలో ఎంచుకునే రైళ్లు 45 ఒక్కోరైలుకు 24 చొప్పున వీటిలో ఉండే కోచ్‌లు– 1080 కోచ్‌కు 60 లక్షల చొప్పున అయ్యే ఖర్చు రూ.648,00,00000 తెలంగాణ, గౌతమి, చార్మినార్, పద్మావతి, నారాయణాద్రి, హుస్సేన్ సాగర్, ముంబై, దేవగిరి, దురంతో తదితర ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను ఈ ప్రాజెక్టు కింద దక్షిణ మధ్య రైల్వే చేపట్టనుంది.
మొత్తం రైళ్లు - 2
కోచ్‌ల సంఖ్య - 48
ఆధునీకరణ అయినవి - 6
ఒక కోచ్ ఆధునీకరణకు అయ్యే ఖర్చు - 60 లక్షల రూపాయలు
6 కోచ్‌ల ఆధునీకరణకు అయిన ఖర్చు - 3.6 కోట్ల రూపాయలు
డిసెంబర్ నాటికి ఒక రైలు, జనవరి, 2019 నాటికి రెండో రైలు కోచ్(24)లను ఉత్కృష్ట కోచ్‌లుగా మారుస్తారు.
ఏముంటాయి?
♦ నాన్ ఏసీ కోచ్‌ల్లో అగ్నిప్రమాదాలు, చోరీల నియంత్రణకు ఏర్పాట్లు.. అంధులకు అందుబాటులో ఉండేలా బ్రెయిలీ లిపిలో నేమ్‌ప్లేట్లు..
♦ టాయిలెట్లలో నీరు నిల్వకుండా పాలిమరైజ్‌డ్ ఫ్లోరింగ్.. బెర్తుల్లో సౌకర్యంగా ఉండే కుషన్ ఏర్పాటు..
♦ ఆధునిక బయోటాయిలెట్లు.. ఎల్‌ఈడీ లైట్లు
Comments
Please login to add a commentAdd a comment