ఉప్పునుంతల బీసీ హాస్టల్
ఉప్పునుంతల : స్థానిక బీసీ బాలుర హాస్టల్‌లో సమస్యలు తిష్టవేశాయి. కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పలుమార్లు హాస్టల్ నిద్ర చేసి ప్రత్యక్షంగా చూసిన సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదికలు అందజేసినా ఫలితం లేదు. హాస్టల్ చుట్టూ ప్రహరీ లేకపోవడంలో ఇబ్బందిగా మారింది. వాటర్ ట్యాంకుకు పగుళ్లు రావడంతో నీరు నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. హాస్టల్‌పైన, ఉన్న చిన్న వాటర్ ట్యాంకు ద్వారా వచ్చే నీటితోనే ఇబ్బందుల మధ్య స్నానాలు చేస్తున్నారు. నీటివసతి లేక స్నానపు గదులు, మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. దాంతో విద్యార్థులు ఆరుబయటకు వెళ్తున్నారు.
35కు దాటని విద్యార్థుల హాజర్
160మంది విద్యార్థుల సామర్థ్యం ఉన్న ఈ హాస్టల్‌లో ప్రస్తుతం 90 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు రికార్డుల్లో చూపిస్తున్నా 35 మందికి మించి ఉండటంలేదు. వారిలో 20మంది వరకు పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. తాడూరు, మర్రిపల్లి తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు హాస్టల్‌లో అడ్మిషన్ ఉన్నా ఆయా గ్రామాల నుంచే పాఠశాలకు వచ్చి వెళ్తున్నారు తప్పా హాస్టల్‌లో ఉండడంలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
సమస్యలు పరిష్కరించాలి
హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉండడంతో ఆరుబయటికి వెళ్తున్నాం. స్నానం చేయడానికి ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
– శివ, 5వ తరగతి, హాస్టల్ విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment