
ముంబై: ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలు మూటగట్టుకోనున్నాయని రేటింగ్స్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. ఇంధన ధరలు గరిష్ట స్థాయికి చేరడం, రూపాయి విలువ జీవిత కాలంలోనే కనిష్ట స్థాయికి పడిపోవడం నష్టాలకు కారణాలుగా తెలిపింది.
విమాన టికెట్ చార్జీలను 12 శాతం పెంచడం ద్వారా పెరిగిన వ్యయాలను అధిగమించొచ్చని సూచించింది. అంతేకాక విమానయాన సంస్థల రుణ భారం 10 శాతం మేర పెరుగుతుందని కూడా అంచనా వేసింది. ప్రస్తుతం ప్రయాణికుల్లో 71 శాతం వాటా జెట్ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్, ఇండిగో సంస్థల చేతుల్లోనే ఉంది.