స్పైస్ జెట్.. మొబైల్ చెకిన్ సేవలు! | SpiceJet comes up with smart mobile check-in facility at Hyderabad airport | Sakshi
Sakshi News home page

స్పైస్ జెట్.. మొబైల్ చెకిన్ సేవలు!

Published Sat, Jul 30 2016 6:37 PM | Last Updated on Thu, Jul 11 2019 8:52 PM

స్పైస్ జెట్.. మొబైల్ చెకిన్ సేవలు! - Sakshi

స్పైస్ జెట్.. మొబైల్ చెకిన్ సేవలు!

ఇప్పటికే ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు సరికొత్త సేవలు అందించడంలో ముందున్న విమానయాన సంస్థ స్పైస్ జెట్.. కొత్తగా స్మార్ట్ చెక్-ఇన్ సేవలను ప్రారంభించింది. గంటలదరబడి క్యూలైన్లలో బోర్డింగ్ పాస్ ల కోసం, చెకిన్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ యాప్.. స్మార్ట్ చెక్-ఇన్ ను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కొత్తగా  ప్రవేశ పెట్టింది.

ప్రయాణీకులు గంటలకొద్దీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండేందుకు స్పైస్ జెట్ మరో కొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ చెక్- ఇన్ పేరున కొత్త యాప్ ను ప్రవేశపెట్టింది. ఈ నూతన యాప్ ను స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని దీనిద్వారా ఎయిర్ పోర్టులో నిమిషాల్లో  చెకిన్ అయ్యే అవకాశం కల్పించింది.  హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదటిసారి స్మార్ట్ చెక్-ఇన్ సేవలను ప్రారంభించింది. ఈ సరికొత్త సేవతో ప్రయాణీకులు చెకింగ్ కోసం క్యూలో నిలబడాల్సిన పని ఉండదు. ఈ సేవలను  కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడంలో స్పైస్ జెట్ ముందుంటుందని ఈ సందర్భంలో ఆయన తెలిపారు. త్వరలో ఈ సేవలను అన్ని విమానాశ్రయాల్లో ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు.

యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న విమాన ప్రయాణీకులు.. విమానాశ్రయంలోని చెక్ ఇన్ ప్రాంతంలోకి చేరగానే ఫోన్లకు ఓ అలర్డ్ వస్తుంది. దాన్ని  అంగీకరించిన వెంటనే ఫోన్ లోకి బోర్డింగ్ పాస్ వచ్చి చేరుతుంది. ఈ కొత్త స్మార్ట్ చెక్-ఇన్ సేవ ను వినియోగించుకుంటే ప్రయాణం హడావుడితోపాటు ప్రయాణీకులు చెకిన్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement