
శ్రీగౌతమి హత్య కేసు నిందితులు
సాక్షి, పశ్చిమ గోదావరి : శ్రీగౌతమి హత్య కేసు నిందితులకు జైలులో సకల సౌకర్యాలు అందిస్తున్నారని ఆమె సోదరి పావని ఆరోపించింది. శ్రీగౌతమి హత్య కేసులో అరెస్టయిన టీడీపీ నేతలు సజ్జా బుజ్జి, జడ్పీటీసీ బాలాం ప్రతాప్‌లకు నరసాపురం సబ్ జైలులో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆమె జైలు శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం పావని ఫిర్యాదు మేరకు అధికారులు జైలులో తనిఖీలు చేపట్టారు. జైలు శాఖ డీఎస్పీ మారుతి రమేష్ దాదాపు రెండు గంటల నుంచి జైలులోని సిబ్బందిని విచారించారు. విచారణ అనంతరం డీఐజీకి నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment